రెండు రోజుల పాటు నో ఫ్లయింగ్ జోన్‌గా ఢిల్లీ
x

రెండు రోజుల పాటు నో ఫ్లయింగ్ జోన్‌గా ఢిల్లీ

నరేంద్ర మోదీ ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భద్రతను మరింత కటుదిట్టం చేస్తున్నారు.


నరేంద్ర మోదీ జూన్ 9న ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీ పోలీసులు భద్రతను మరింత కటుదిట్టం చేయనున్నారు. అందులో భాగంగానే దేశ రాజధానిని రెండు రోజుల పాటు నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించారు పోలీసు కమిషనర్ సంజయ్ అరోరా.

భారీ భద్రతా ఏర్పాట్లు..

జూన్ 9వ తేదీ ఆదివారం రాత్రి 7.15 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో పోలీసులు భద్రత పెంచారు. ఢిల్లీ పోలీసులతో పాటు NSG, SWAT కమాండోలను రాష్ట్రపతి భవన్‌తో పాటు పలు కీలక ప్రాంతాల్లో నిఘా ఉంచనున్నట్లు భద్రతా అధికారి తెలిపారు. భద్రతా చర్యల్లో భాగంగా పారా గ్లైడర్లు, పారా-మోటార్లు, హ్యాంగ్ గ్లైడర్లు, UAVలు, UASలు, మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్, రిమోట్‌ పైలట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎగురవేయడాన్ని నిషేధించారు. ఈ ఆంక్షలు జూన్ 9 నుంచి అమల్లోకి వస్తాయని, జూన్ 10 వరకు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Read More
Next Story