మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్..
x

మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్..

నవంబర్ 20న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, 23న ఫలితాల వెలువడిన విషయం తెలిసిందే. 288 స్థానాలకు గాను మహాయుతి కూటమి 218 స్థానాలు దక్కించుకుంది.


మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ శాసనసభా పక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం చేయించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రులుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌తో ప్రమాణం చేశారు. దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, గడ్కరీ, నిర్మలా సీతారామన్, జేపీ నడ్డా హాజరయ్యారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు నితీష్ కుమార్, నయాబ్ సింగ్ సైనీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు కూడా హాజరయ్యారు. వీఐపీల్లో ముఖేష్ అంబానీ, సినీ ప్రముఖులు సంజయ్ దత్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, క్రికెటర్ సచిన్ టెండుల్కర్ తదితరులు కార్యక్రమానికి విచ్చేశారు.

నవంబర్ 20న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, 23న ఫలితాల వెలువడిన విషయం తెలిసిందే. 288 స్థానాలకు గాను మహాయుతి కూటమి 218 స్థానాలు దక్కించుకుని అధికారాన్ని చేజిక్కించుకుంది.

Read More
Next Story