మహారాష్ట్ర ఫలితాల్లో వ్యత్యాసాలు: మ్యానిపులేట్ చేశారన్న డా. గార్గ్..
x

మహారాష్ట్ర ఫలితాల్లో వ్యత్యాసాలు: మ్యానిపులేట్ చేశారన్న డా. గార్గ్..

నీలు వ్యాస్ హోస్ట్‌గా వ్యవహరించే ది ఫెడరల్ ‘‘క్యాపిటల్ బీట్‌’’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎలక్షన్ డేటా సైంటిస్ట్ డా. ప్యారేలాల్ గార్గ్ తన అభిప్రాయాలను పంచుకున్నారు.


ఇటీవల ముగిసిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ డేటా సైంటిస్ట్ డా. ప్యారేలాల్ గార్గ్ కొన్ని అనుమానాలను లేవనెత్తారు. నీలు వ్యాస్ హోస్ట్‌గా వ్యవహరించే ది ఫెడరల్ ‘‘క్యాపిటల్ బీట్‌’’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. మహారాష్ట్రలో కనీసం 92 నియోజకవర్గాల్లో పోల్ అయిన ఓట్ల సంఖ్యలో వ్యత్యాసాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఒక్కో నియోజకవర్గంలో సగటున 26,500 ఓట్లు తారుమారు అయ్యాయని, ఇవి అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)కి అనుకూలంగా ఉన్నాయని డాక్టర్ గార్గ్ చెప్పారు. ఓటింగ్ రోజు సాయంత్రం 5:00 గంటలకు, రాత్రి 11:30 గంటలకు విడుదల చేసిన ఓటర్ల శాతం గణాంకాల్లో వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు.

ఓటు శాతంలో అసాధారణ పెరుగుదల..

‘‘మహారాష్ట్రలో సాయంత్రం 5:00 తర్వాత ఓటు శాతం 7.83 శాతానికి పెరిగింది. అదే సమయంలో జార్ఖండ్‌లో రెండో దశలో ఇది కేవలం 0.86 శాతంగా మాత్రమే నమోదైంది. మహారాష్ట్రలో ఈ పెరుగుదల కారణంగా సుమారు 76 లక్షల అదనపు ఓట్లు పోల్ అయ్యాయి. ఇది NDAకి అనుకూల ప్రభావాన్ని చూపింది. మహారాష్ట్రలోని 288 సీట్లలో కనీసం 100 సీట్లు మహాయుతి కూటమి అభ్యర్థులు గెలిచినట్లు ఆధారాలను చూపించారు. ఓటింగ్, కౌంటింగ్ ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించడంలో ఎన్నికల సంఘం (Election Commission of India) విఫలమైందని విమర్శించారు.

ఈవీఎంల మ్యానిపులేషన్‌, ఎలక్షన్ కమిషన్ అపారదర్శకతకు నిరసనగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలిపాలని డా. గార్గ్ ప్రజలకు పిలుపునిచ్చారు. "ఇది కేవలం ఎన్నికలకు సంబంధించిన విషయం కాదు. ప్రజాస్వామ్యానికి సంబంధించినది" అని పేర్కొన్నారు.

గార్గ్ ఆరోపణల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు ECIపై విమర్శలను తీవ్రం చేశాయి. ఓటింగ్ ప్రక్రియ, ఈసీపై ప్రతిపక్షాలు చట్టపరంగా పోరాడతాయా? లేక రీ కౌంటింగ్‌కు పట్టుబడతాయా? అన్నది తేలాల్సి ఉంది.



Read More
Next Story