‘అర్బన్ నక్సల్స్ నడుపుతున్న పార్టీకి ఓటెయొద్దు’
ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ను అర్బన్ నక్సల్స్ నడుపుతున్నారని పార్టీగా అభివర్ణించారు.
ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ను అర్బన్ నక్సల్స్ నడుపుతున్నారని పార్టీగా అభివర్ణించారు. మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో వివిధ ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం ర్యాలీలో ఆయన మాట్లాడారు. దేశం పట్ల చిత్తశుద్ధి లేని వ్యక్తులతో కాంగ్రెస్ ఎంత సన్నిహితంగా మెలుగుతుందో చూడాలని ప్రజలను కోరారు.
‘‘ఇటీవల ఢిల్లీలో వేల కోట్ల రూపాయల డ్రగ్స్ పట్టుకున్నారు. ఈ కేసులో ఓ కాంగ్రెస్ నేతను ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్నారు. యువతను డ్రగ్స్ వైపు నెట్టడం ద్వారా వచ్చే డబ్బుతో ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.’’ అని ఆరోపించారు.
కాంగ్రెస్ ఆలోచన మొదటి నుంచి విదేశీయమని మోదీ విమర్శించారు. “బ్రిటీష్ పాలనలో వలె ఈ కాంగ్రెస్ కుటుంబం దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజనులను తమతో సమానంగా పరిగణించదు. దేశాన్ని ఒకే కుటుంబం పాలించాలని భావిస్తున్నారు. అందుకే బంజారా వర్గం పట్ల కించపరిచే వైఖరిని కనిపిస్తుంది. ప్రమాదకరమైన ఎజెండాతో ఎన్నికల్లో నిలిచిన వారిని ఓడించాలి ’’
అని ఆయన అన్నారు.