‘జార్ఖండ్‌లో  I.N.D.I.A కూటమి హామీలు పేలని బాంబులు’
x

‘జార్ఖండ్‌లో I.N.D.I.A కూటమి హామీలు పేలని బాంబులు’

‘‘గత అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం 117 వాగ్దానాలు, కాంగ్రెస్ 344 ఇచ్చింది. గడిచిన ఐదేళ్లలో వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు.’’- శివరాజ్ సింగ్ చౌహాన్.


జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇండియా కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోను ప్రజలు నమ్మడం లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), కాంగ్రెస్ చాలా హామీలు ఇచ్చాయని అయితే ఏ ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు.

అవన్నీ బూటకమే..

‘‘మేం (జేఎంఎం, కాంగ్రెస్‌లు) ఐదు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. కాని ఇవ్వలేదు. చుల్హా ఖర్చ్ (గృహ ఖర్చులకు) నెలకు రూ.2వేలు ఇస్తామన్నారు. ఇవ్వలేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. కాని ఇవ్వలేదు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)పై బోనస్ ఇచ్చి వరి పంట కొంటామన్నారు. కాని అలా చేయలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం 117 వాగ్దానాలు ఇవ్వగా.. కాంగ్రెస్ 344 ఇచ్చింది. గడిచిన ఐదేళ్లలో వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఇప్పుడు కొత్త వాగ్దానాలతో మీ ముందుకు వచ్చారు. ఈ హామీలన్నీ బూటకం. ప్రజలకు వారిపై నమ్మకం పోయింది. ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాలో చూడండి. హామీలన్నీ నెరవేరుస్తున్నారు.”అని విలేఖరులతో అన్నారు శివరాజ్ సింగ్ చౌహాన్.

ఈ సారి కూటమి హామీలివి..

1. 1932 నాటి ఖతియాన్ విధానాన్ని ఆధారంగా సర్నా మత నియమావళి అమలు చేయటం.

2. డిసెంబర్ 2024 నుంచి మైయా సమ్మాన్ పథకం కింద రూ.2,500 అందించడం.

3. మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణకు కమిషన్ ఏర్పాటు

4. ఒక్కో కుటుంబానికి రూ.450 లకే ఎల్పీజీ సిలిండర్లు, ఒక్కో వ్యక్తికి రేషన్ బియ్యం కోటా 5 నుంచి 7 కిలోలకు పెంపు

5. యువతకు ఉపాధి, రూ. 15 లక్షల వరకు కుటుంబ ఆరోగ్య భృతి కల్పించటం.

6. ప్రతి బ్లాక్‌లో డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలు ఏర్పాటు. ప్రతి జిల్లాలో 500 ఎకరాల ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయటం.

7. బియ్యం ఎంఎస్పీ రూ.2,400 నుంచి రూ.3,200కి పెంచడంతో పాటు ఇతర పంటల రేట్లను 50 శాతానికి పెంపు

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 23న వెల్లడికానున్నాయి.

Read More
Next Story