మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం ఎవరికంటే..
x

మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం ఎవరికంటే..

నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి వివిధ దేశాధినేతలు హాజరవుతున్నారు. అతిథుల జాబితాలో ఇంకా ఎవరెవరికి ఆహ్వానాలు పంపారంటే..


నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధాని కాబోతున్నారు. ఎన్నికయిన ఎంపీలంతా ఆయనను తమ నాయకుడిగా అంగీకరించడంతో జూన్ 9న మోదీ పీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాలని ఇప్పటికే పలువురు దేశాధినేతలకు ఆహ్వానం పంపారు. 8వేల మందికి పైగా విచ్చేస్తున్నఅతిథుల జాబితాలో కొంతమంది పారిశుధ్య కార్మికులు, ట్రాన్స్‌జెండర్లు కూడా ఉన్నారని సమాచారం. వందే భారత్, మెట్రోలో పనిచేస్తున్న రైల్వే ఉద్యోగులు, వివిధ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రతినిథులు, వికసిత్ భారత్ అంబాసిడర్లు కూడా జాబితాలో స్థానం కల్పించారు.

హాజరుకానున్న శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాధినేతలు..

దక్షిణాసియా దేశాల నాయకులను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. తాము హాజరవుతున్నట్లు శ్రీలంక అధ్యక్షుడు రాణిల్ విక్రమసింఘే, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ధృవీకరించారు. నేపాల్, భూటాన్, మారిషస్ దేశాధినేతలు నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.

ఈ లోక్‌సభ ఎన్నికలలో BJP మ్యాజిక్ ఫిగర్ 272ను చేరుకోవడంలో విఫలమైంది. 240 సీట్లను మాత్రమే గెలుపొందింది. 2019లో 303 స్థానాలు కైవసం చేసుకుంది. అంటే ఈ సారి 63 సీట్లు తగ్గడంతో మిత్రపక్షాల మద్దతు అవసరమైంది. మిత్రపక్షాలతో జతకట్టి బలం పెంచుకుంది. మొత్తం 293 ఎంపీల మద్దతుతో కేంద్రంలో మోదీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు.

Read More
Next Story