బాధ్యతలు చేపట్టిన జైశంకర్, వైష్ణవ్
దౌత్యవేత్తగా మారిన రాజకీయవేత్త ఎస్ జైశంకర్ మంగళవారం వరుసగా రెండోసారి విదేశీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
దౌత్యవేత్తగా మారిన రాజకీయవేత్త ఎస్ జైశంకర్ మంగళవారం వరుసగా రెండోసారి విదేశీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 69 ఏళ్ల జైశంకర్.. రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్ లాంటి బిజెపి సీనియర్ నాయకులలో ఒకరు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీకి ఎక్స్ వేదికగా జైశంకర్ ధన్యవాదాలు తెలిపారు.
2019 నుంచి విదేశాంగ మంత్రిగా ఉన్న జైశంకర్ అద్భుతమైన పనితీరు కనపర్చారు. ఉక్రెయిన్‌లో యుద్ధం నేపథ్యంలో మాస్కో నుండి న్యూఢిల్లీ ముడి చమురు కొనుగోలుపై పాశ్చాత్య విమర్శలను తిప్పికొట్టడంలోనూ, విదేశాంగ విధానానికి సంబంధించిన విషయాలను చర్చకు తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించారు.
జైశంకర్ 2015-18 వరకు భారత విదేశాంగ కార్యదర్శిగా, 2013-15 వరకు యునైటెడ్ స్టేట్స్ అంబాసిడర్‌గా, 2009-2013 వరకు చైనా, 2000-2004 వరకు చెక్ రిపబ్లిక్ లలో భారత విదేశాంగ కార్యదర్శిగా పనిచేశారు. 2007-2009 వరకు సింగపూర్‌లో భారత హైకమిషనర్‌గా కూడా విధులు నిర్వహించారు.
ఐఅండ్‌బీ మంత్రిగా అశ్విని వైష్ణవ్ ..
కేంద్ర సమాచార శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఈ పదవిలో అనురాగ్ సింగ్ ఠాకూర్ కొనసాగారు.
వైష్ణవ్‌కు అదనంగా రైల్వేలు, ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ , టెక్నాలజీ వంటి కీలక శాఖలను అప్పగించారు. టాస్క్‌మాస్టర్‌గా పేరుగాంచిన 53 ఏళ్ల అశ్విని వైష్ణవ్ బ్యూరోక్రాట్-రాజకీయవేత్త. జూలై 2021లో మొదటిసారిగా మంత్రి అయ్యారు.
ఒడిశాకు చెందిన రాజ్యసభ సభ్యుడయిన వైష్ణవ్.. 2002లో బిజెడితో బిజెపి పొత్తు పెట్టుకున్నప్పుడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు.