మహారాష్ట్రలో రెండు కూటముల మధ్య పోటా పోటీ..
x

మహారాష్ట్రలో రెండు కూటముల మధ్య పోటా పోటీ..

మహారాష్ట్రలో అధికారమే లక్ష్యంగా అధికార మహాయుతి కూటమి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి నేతలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. గెలుపుపై అంచనాలు వేసుకుంటున్నారు.


మహారాష్ట్రలో రేపు భీకర పోరు జరగబోతుంది. రెండు కూటములు మధ్య ఎన్నికల యుద్ధం జరగబోతుంది. అధికారమే లక్ష్యంగా అధికార మహాయుతి కూటమి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి నేతలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఎన్నికలపై అదే స్థాయిలో ఇరువర్గాలు భారీ అంచనాలే పెట్టుకున్నాయి. జార్ఖండ్‌లోనూ మంగళవారం మలి దశ పోలింగ్ జరుగుతోంది. 43 నియోజకవర్గాలకు తొలి దశ పోలింగ్ ఈ నెల 13వ తేదీన జరిగిన విషయం తెలిసిందే. రెండో దశలో 38 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది.

నీలూ వ్యాస్ హోస్ట్‌గా వ్యవహరించే ‘ది ఫెడరల్ క్యాపిటల్ బీట్’ కార్యక్రమంలో పొలిటికల్ కామెంటేటర్ వివేక్ దేశ్‌పాండే, సీనియర్ జర్నలిస్టు మనోజ్ ప్రసాద్ పాల్గొన్నారు. రేపు మహారాష్ట్ర, జార్ఖండ్‌ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీరిద్దరూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. హేమంత్ సోరెన్ జేఎంఎం-కాంగ్రెస్ కూటమి జార్ఖండ్‌లో కాషాయ పార్టీకి ఎదురునిలవగలదా?

మహారాష్ట్రలో నిరుద్యోగ సమస్య, అంతర్గత కుమ్ములాటలు, వ్యవసాయ సంక్షోభం, పరిశ్రమల తరలింపు ఓటర్లపై ఏ మేర ప్రభావం చూపుతాయి? అన్ని విషయాలపై వివేక్ దేశ్‌పాండే, మనోజ్ ప్రసాద్ తమ ఓపెనీయన్స్ షేర్ చేసుకున్నారు.

Read More
Next Story