మన్మోహన్ సింగ్ ఓటర్లను ఏమని కోరారు?
ఈ లోక్ సభ ఎన్నికలలో రాష్ట్రాభివృద్ధికి కృషి చేసే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పంజాబ్ ఓటర్లను కోరారు. జూన్ 1న పంజాబ్‌లో ఎన్నికలు జరనున్నాయి.
ఈ లోక్ సభ ఎన్నికలలో రాష్ట్రాభివృద్ధికి కృషి చేసే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పంజాబ్ ఓటర్లను కోరారు. జూన్ 1న పంజాబ్‌లో ఎన్నికలు జరనున్నాయి.
ప్రధాని మోదీ ద్వేషపూరిత ప్రసంగాలకు పాల్పడుతున్నారని, బీజేపీ తన పాలనలో వర్గాలను పోలరైజ్ చేస్తోందని ఆరోపించారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం నిరసన తెలిపే రైతుల పట్ల మోదీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు.
కేంద్రం ఇప్పుడు ఉపసంహరించుకున్న వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020-21లో ఢిల్లీ సరిహద్దుల దగ్గర భారీ రైతుల నిరసనను ఉదహరిస్తూ.. 750 మంది రైతులు మరణించారని, రైతులను పరాన్నజీవులు అని పిలిచి మోదీ అన్నదాతలను అవమానించారని సింగ్ అన్నారు.
'అగ్నివీర్ పథకాన్ని కాంగ్రెస్ రద్దు చేస్తుంది'
పంజాబీ కుటుంబాలు తమ కుమారులను సాయుధ దళాలకు పంపే పురాతన సంప్రదాయాన్ని ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దవుతుందన్నారు.