తెరుచుకున్న ఒడిషా పూరీ జగన్నాథుని నాలుగు ఆలయ ద్వారాలు
x

తెరుచుకున్న ఒడిషా పూరీ జగన్నాథుని నాలుగు ఆలయ ద్వారాలు

ఒడిషా కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం ఎన్నికల హామీ నిలబెట్టుకుంది. పూరీ జగన్నాథ ఆలయ నాలుగు ద్వారాలను తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.


ఎట్టకేలకు ఒడిషాలోని పూరీ జగన్నాథాలయ ద్వారాలు తెరుచుకున్నాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం వెంటనే ఆలయ నాలుగు ద్వారాలను తెరిచి ఉంచాలని ఆదేశించింది. దాంతో ఆలయ అధికారులు గురువారం (జూన్ 13) ఉదయం 6.30 గంటలకు తెరిచారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, బిజెపి ఎమ్మెల్యేలు ఆలయ ద్వారం దగ్గర "మంగళ హారతి" ఇస్తూ కనిపించారు.

గతంలో మూడు గేట్లు మూసేసిన బీజేడీ సర్కారు..

COVID-19 కారణంగా మునుపటి BJD ప్రభుత్వం ఆలయం మూడు గేట్లను మూసివేసింది. ఒక ద్వారం గుండా లోపలికి వెళ్లి స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఇబ్బందులు పడేవారు. ప్రత్యేకించి 'దర్శనం' కోసం గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సిన వృద్ధులకు చాలా అసౌకర్యంగా ఉండేది. అన్ని గేట్లు తెరవాలని గతంలో భక్తులు డిమాండ్ చేసిన నవీన్ పట్నాయక్ సర్కార్ పట్టించుకోలేదు.

మాట నిలుపుకున్న మోహన్ చరణ్ సర్కార్ ..

ఎన్నికల హామీల అమలులో భాగంగా మోహన్ చరణ్ సర్కార్ వెంటనే జగన్నాథాలయం ద్వారాలను తెరిపించింది. ఆలయ పరిరక్షణ కోసం రూ. 500 కోట్ల కార్పస్ ఫండ్‌ను కేటాయించాలని క్యాబినెట్ నిర్ణయించింది.

సీఎం మోహన్ చరణ్ మాట్లాడుతూ..“నిన్నటి కేబినెట్ సమావేశంలో జగన్నాథ ఆలయం నాలుగు ద్వారాలను తెరవాలనే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈరోజు ఉదయం 6.30 గంటలకు మంగళ హారతి కార్యక్రమానికి హాజరయ్యారు. ఆలయ అభివృద్ధికి, ఇతర పనులకు వచ్చే రాష్ట్ర బడ్జెట్‌లో కార్పస్ ఫండ్ కేటాయిస్తాం.’’ అని చెప్పారు.

వరికి కనీస మద్దతు ధర పెంచుతాం..

వరికి కనీస మద్దతు ధర (MSP) క్వింటాల్‌కు రూ. 3,100 కు పెంచడానికి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుందని సీఎం చెప్పారు. ఈ ప్రతిపాదన అమలు కోసం త్వరలో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

రైతుల ఇతర సమస్యలను పరిష్కరించడానికి "సృద్ధ క్రుషక్ నీతి యోజన" అనే ప్రత్యేక విధానాన్నిత్వరలో తీసుకువస్తామన్నారు.

మహిళలకు నగదు వోచర్లు..

మహిళా సాధికారత, శిశు సంక్షేమం కోసం మునుపటి BJD పాలకులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని సీఎం మోహన్ చరణ్ చెప్పారు. కొత్త ప్రభుత్వం 100 రోజుల్లో సుభద్ర యోజనను అమలు చేస్తుందని, ఈ పథకం కింద మహిళలకు ఒక్కొక్కరికి రూ. 50వేలు అందుతాయని చెప్పారు.

Read More
Next Story