‘ప్రశ్నపత్రాల లీకేజీపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది’
x

‘ప్రశ్నపత్రాల లీకేజీపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది’

"ఇటీవలి పేపర్ లీక్ ఘటనలో దోషులకు న్యాయమైన విచారణను ప్రభుత్వం కట్టుబడి ఉంది. న్యాయస్థానం దోషులకు కఠిన శిక్ష విధిస్తుంది." అని రాష్ట్రపతి పేర్కొన్నారు.


ప్రశ్నపత్రం లీకేజీ ఘటనపై విచారించి దోషులకు శిక్ష పడేలా చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అధ్యక్షుడు ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. 18వ లోక్‌సభ తొలిసమావేశంలో ఆమె ఉభయసభలనుద్దేశించి ప్రసంగించారు. విద్యారంగంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను రాష్ట్రపతి ప్రస్తావించారు. ఆమె మాట్లాడుతుండగా కొందరు విపక్ష సభ్యులు ‘నీట్’.. ‘నీట్’.. అంటూ నినాదాలు చేశారు. ఏ కారణం చేతనైనా పోటీ పరీక్షలకు ఆటంకం కలగడం సరికాదని, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, పరీక్షల్లో పారదర్శకత. అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి సూచించారు.

"ఇటీవలి పేపర్ లీక్ ఘటనలో దోషులకు న్యాయమైన విచారణను ప్రభుత్వం కట్టుబడి ఉంది. న్యాయస్థానం దోషులకు కఠిన శిక్ష విధిస్తుంది." అని రాష్ట్రపతి పేర్కొన్నారు.

పునరావృతం కాకూడదు..

నీట్ పరీక్షలో అవకతవకలను పరిశీలించడానికి ప్రభుత్వం నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసిందని గుర్తుచేస్తూ.. ఇంతకుముందు కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయని, ఇకపై పునరావృతం కాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి ఉద్ఘాటించారు.పరీక్షల విధానాన్ని సంస్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆమె తెలిపారు.

ఖరోలాకు ఇన్‌ఛార్జి బాధ్యతలు..

నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్‌ను కేంద్రం తప్పించింది. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. కొత్త డైరెక్టర్ జనరల్ వచ్చే వరకు ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ITPO) ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ సింగ్ ఖరోలాకు NTA ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.

పలువురి అరెస్టు..

నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి జార్ఖండ్‌లోని డియోఘర్ జిల్లాకు చెందిన మరో ఆరుగురిని బీహార్ పోలీసులు శుక్రవారం (జూన్ 21) రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు ఒక అధికారి తెలిపారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు సికందర్ యాదవెందుతో సహా 13 మందిని గత నెలలో అరెస్టు చేశారు.

అమల్లోకి కొత్త చట్టం ..

పేపర్ లీకులతో సతమతమవుతోన్న కేంద్రం యుద్ధప్రాతిపదికన 'ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్(ప్రివెన్షన్ ఆఫ్ అన్ ఫెయిర్ మీన్స్)యాక్ట్-2024ను అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ బిల్లును ఫిబ్రవరి 6న లోక్ సభ, 9న రాజ్యసభ ఆమోదించగా.. 12వ తేదీన రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.

యాక్టు ఏం చెబుతుంది?

‘పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్-2024’ ప్రకారం ఎవరైనా ప్రశ్నపత్రం లీక్ చేసినా, పరీక్ష రాసే వారికి సహకరించినా, కంప్యూటర్ నెట్‌వర్క్‌ను ట్యాంపరింగ్ చేసినా, నకిలీ పరీక్షలు నిర్వహించినా, నకిలీ ప్రవేశపరీక్ష కార్డులు జారీ చేసినా నేరంగా పరిగణిస్తారు. లీకేజీకి పాల్పడే వారికి 5 నుంచి 10 సంవత్సరాల వరకు జైలుశిక్షతో పాటు రూ.కోటి వరకు జరిమానా విధిస్తారు. ఒకవేళ వ్యవస్థీకృత నేరానికి పాల్పడినట్లు రుజువైతే..ఆస్తులనూ కూడా జప్తు చేస్తారు. పరీక్ష నిర్వహణకు అయిన ఖర్చునూ వారినుంచే వసూలు చేస్తారు.

Read More
Next Story