‘జూన్ 24 నుంచి జూలై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు’
x

‘జూన్ 24 నుంచి జూలై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు’

18వ లోక్‌సభ తొలి సెషన్‌ జూన్‌ 24న ప్రారంభమవుతుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్‌ రిజిజు తెలిపారు. ఈ సెషన్‌ మూడు రోజుల పాటు కొనసాగుతుంది.


18వ లోక్‌సభ తొలి సెషన్‌ జూన్‌ 24న ప్రారంభమవుతుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్‌ రిజిజు తెలిపారు. ఈ సెషన్‌ మూడు రోజుల పాటు కొనసాగుతుంది. కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయడం, లోక్‌సభలో వారి సభ్యత్వాన్ని ధృవీకరించడం, స్పీకర్‌ను ఎన్నుకోవడం ఈ సమయంలో జరుగుతోంది.
రాజ్యసభ 264వ సమావేశాలు కూడా జూన్ 27న ప్రారంభమై జూలై 3న ముగుస్తాయని, జూన్ 27న రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ప్రధాని మోదీ తన మంత్రి మండలిని పార్లమెంటుకు పరిచయం చేస్తారని కిరెన్‌ రిజిజు పేర్కొన్నారు.
భాగస్వామ్య పక్షాలతో కలిసి ..
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 240 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు 272 మార్క్‌ దాటాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను కలుపుకుని బీజేపీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
దూకుడుగా ఇండియా కూటమి
అయితే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమికి ఫలితాలు పెరిగిన నేపథ్యంలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో ఇండియా కూటమి దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది. వివిధ సమస్యలపై ఎన్డీయే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించవచ్చు. దీంతో పార్లమెంటు ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధాని మోదీ సమాధానం ఇవ్వనున్నారు.
Read More
Next Story