‘అబద్దాలు చెప్పేవారిని మహారాష్ట్ర ప్రజలు ఎప్పటికీ నమ్మరు’
x

‘అబద్దాలు చెప్పేవారిని మహారాష్ట్ర ప్రజలు ఎప్పటికీ నమ్మరు’

ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో శనివారం రాత్రి మోదీ ప్రసంగించారు. తాజా ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధి వైపు నిలబడ్డారని చెపారు.


‘అబద్దాలు చెప్పేవారిని మహారాష్ట్ర ప్రజలు ఎప్పటికీ నమ్మరు’మహారాష్ట్రలో మహాయుతి కూటమి మళ్లీ అధికారంలోకి రానుంది. చాలాచోట్ల కూటమి అభ్యర్థులు గెలుపొందడంతో కూటమి పార్టీల్లో ఆనందం వెల్లివిరిసింది. శనివారం రాత్రి ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో మోదీ ప్రసంగించారు. తాజా ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధి వైపు నిలబడ్డారని చెపారు. అబద్ధాలు, వంచన రాజకీయాలకు పాల్పడిన కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలను ఓడించారని చెప్పారు. మహారాష్ట్ర అన్ని రికార్డులను బ్రేక్‌ చేసిందన్నారు. గడిచిన 50 ఏళ్లలో ఏ పార్టీ గానీ, ఎన్నికల ముందు ఏర్పాటైన కూటమిగానీ ఇంతటి ఘన విజయం సాధించలేదని చెప్పారు. ‘ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటాం (ఏక్‌ హై తో సేఫ్‌ హై)’ అనే నినాదమే ఇప్పుడు దేశానికి మంత్రంగా మారిందని చెప్పారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ అధికారం కోసం కులతత్వం అనే విషాన్ని వ్యాపింపజేస్తోందని మండిపడ్డారు. మహారాష్ట్రలో అస్థిరతను సృష్టించేందుకు యత్నించిన, ద్రోహానికి పాల్పడిన కొందరిని ఓటర్లే శిక్షించారని ప్రధాని మోదీ చెప్పారు. ‘ ప్రపంచంలోని ఏ శక్తీ ఆర్టికల్‌ 370ను పునరుద్ధరించలేదని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్‌ బుజ్జగింపు రాజకీయాలకు వక్ఫ్‌బోర్డే ఉదాహరణ అన్నారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీ బుజ్జగింపుల కోసమే చట్టాలు చేసింది. వక్ఫ్‌ చట్టమే దానికి ఉదాహరణ. 2014లో ఢిల్లీ సమీపంలోని చాలా ఆస్తులను వక్ఫ్‌ బోర్డుకు కట్టబెట్టారు. రాజ్యాంగంలో వక్ఫ్‌ చట్టానికి చోటే లేదు. కానీ, ఇప్పటికీ ఈ సదుపాయాన్ని కాంగ్రెస్‌ పార్టీ తమ కుటుంబ ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అసలైన లౌకికవాదాన్ని చంపేసే ప్రయత్నం చేస్తోంది’’ అని మోదీ ధ్వజమెత్తారు.


Read More
Next Story