రాయ్‌బరేలీ లేదా వాయనాడ్.. రాహుల్ దేన్ని వదులుకుంటారు?
x

రాయ్‌బరేలీ లేదా వాయనాడ్.. రాహుల్ దేన్ని వదులుకుంటారు?

గెలిచిన రెండు స్థానాల్లో ఒకదానిని రాహుల్ గాంధీ వదులుకోవాలి. అయితే ఈ రెంటిలో దేన్ని వదులుకుంటా రన్నేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.


ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో (వాయనాడ్‌, రాయ్‌బరేలీ) గెలుపొందారు. ఇందులో ఏదో ఒకదాని నుంచే మాత్రమే లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. రెండు స్థానాల్లో దేనికి ప్రాతినిధ్యం వహించాలనేది మూడు, నాలుగు రోజుల్లో రాహుల్ నిర్ణయించుకోనున్నారు. 18వ లోక్‌సభ తొలి సెషన్‌ జూన్‌ 15న ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున, రాహుల్ త్వరలో నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ మాజీ చీఫ్ కేరళలోని వయనాడ్ నుంచి రెండవసారి ఎన్నికయ్యారు. రాహుల్ 6,47,445 ఓట్లు సాధించారు. సమీప ప్రత్యర్థి సీపీఐకి చెందిన అన్నీ రాజా గెలుపొందారు.

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గంలో రాహుల్‌కు 6,87,649 ఓట్లు రాగా, అతని సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన దినేష్ ప్రతాప్ సింగ్ 2,97,619 ఓట్లు సాధించారు. రాహుల్ తల్లి, ఐదుసార్లు ఎంపీగా ఎన్నికైన సోనియా గాంధీ తన స్థానాన్ని ఖాళీ చేయడంతో రాయ్‌బరేలీ నుండి పోటీ చేశారు. ఆరోగ్య కారణాల వల్ల ఫిబ్రవరిలో రాజ్యసభకు సోనియా ఎన్నికయిన విషయం తెలిసిందే.

2019 సార్వత్రిక ఎన్నికలలో రాహుల్ గాంధీ యుపిలోని అమేథీతో పాటు వాయనాడ్ నుండి పోటీ చేశారు. 2004, 2009, 2014 ఎన్నికల్లో అమేథీలో బిజెపికి చెందిన స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయాడు.

Read More
Next Story