ఫడ్నవీస్‌ మహారాష్ట్ర రాజకీయాల్లో విలన్
x

ఫడ్నవీస్‌ మహారాష్ట్ర రాజకీయాల్లో 'విలన్'

మహారాష్ట్రలో బీజేపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. గత ఎన్నికలలో 23 స్థానాలుండగా, ఆ సంఖ్య ఈ సారి 9కి పడిపోయింది.


మహారాష్ట్రలో బీజేపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. గత ఎన్నికలలో 23 స్థానాలుండగా, ఆ సంఖ్య ఈ సారి 9కి పడిపోయింది. ఈ దుస్థితికి దేవేంద్ర ఫడ్నవీసే కారణమని శివసేన (యుబిటి) నాయకుడు, రాజ్యసభ సభ్యుడు రౌత్ ఆరోపించారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మహారాష్ట్ర రాజకీయాల్లో విలన్ ఎవరైనా ఉన్నారంటే అది దేవేంద్ర ఫడ్నవీస్ అని, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి ఆయనదే పూర్తి బాధ్యత అని పేర్కొన్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఫడ్నవీస్‌ను"ఓ విలన్" పేర్కొంటూ ఆయన చాలా కుటుంబాలను నాశనం చేయడంతో పాటు, రాజకీయ ప్రతీకారానికి పాల్పడ్డాడని రౌత్ ఆరోపించారు.

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ.. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేసి, ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ కోసం "పూర్తి సమయం" కేటాయించాలనుకున్న నేపథ్యంలో రౌత్ ఈ విమర్శలు వచ్చాయి.

మోడీ, షాలపై విరుచుకుపడ్డ రౌత్ ..

నరేంద్ర మోదీ మూడోసారి బలవంతంగా ప్రధాని కావాలని ప్రయత్నిస్తే, ఆయన ప్రభుత్వం కొనసాగదని, ఆర్‌ఎస్‌ఎస్ ప్రత్యామ్నాయం చేస్తోందని రౌత్ చెప్పారు.

2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి బ్రూట్ మెజారిటీ వచ్చిన తర్వాత రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ను బానిసలుగా మార్చేందుకు మోదీ, అమిత్ షా ప్రయత్నించారని, అయితే అదే ఆర్‌ఎస్‌ఎస్ మోదీని ఇంటికి పంపే స్థితిలో ఉందని రౌత్ అన్నారు.

మహారాష్ట్రలో మొత్తం స్థానాలు 48. మహాయుతి కూటమి - బిజెపి, శివసేన (ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో), ఎన్‌సిపి (అజిత్ పవార్ నేతృత్వంలో) 17 స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే), ఎన్‌సిపి (మహా వికాస్ అఘాడీ) శరద్‌ పవార్) 30 సీట్లు సాధించారు.

కాంగ్రెస్‌కు 13, శివసేన (యుబిటి) 9, ఎన్‌సిపి (శరద్‌చంద్ర పవార్‌) 8 సీట్లు వచ్చాయి.

బీజేపీ 9 సీట్లు, శివసేన 7 సీట్లు, ఎన్సీపీ కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకోవడంతో మహాయుతి సంఖ్య 17కి చేరుకుంది.

Read More
Next Story