ఓవర్ యాక్షన్ చేయవద్దని విలేజ్ వాలంటీర్లకు హెచ్చరిక
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సెర్ఫ్ ఆదేశాలు ఇచ్చింది. ఏమేమి చేయాలో స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో పింఛన్ల పంపిణీ పేరిట ఎన్నికల ప్రచారం చేస్తే తిప్పలు తప్పవని హెచ్చరించింది గ్రామీణ పేదరిర నిర్మూలన సంస్థ (సెర్ఫ్) హెచ్చరించింది. ఎన్నికల కోడ్ దృష్ట్యా బ్యాంకుల నుంచి నగదు తీసుకువెళ్లేటపుడు తప్పని సరిగా అధికారిక ధృవీకరణ పత్రాలు దగ్గర ఉంచుకోవాలని ఆదేశించింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు బ్యాంకుల నుంచి ఎంతమేరకు నగదు విత్ డ్రా చేశారో, ఎక్కడికి తీసుకువెళుతున్నారో స్పష్టంగా ఎటువంటి అవకతవకలకు తేడా లేకుండా ఉండాలని విజ్ఞప్తి చేసింది.
ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయితీ కార్యదర్శి అథరేషన్ పత్రాలను ఇవ్వాలని కోరింది. పింఛన్ల పంపిణీ చేసేటపుడు ఎలాంటిప్రచారం నిర్వహించవద్దని ఆదేశించింది. పింఛన్లు ఇచ్చినట్టుగా ఫోటోలు, వీడియోలు తీయవద్దని ఆదేశించింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఇప్పటికే వాలంటీర్లపై తెలుగుదేశం పార్టీ అనేక ఆరోపణలు చేసింది. అధికార పార్టీ వాలంటీర్లను ప్రభావితం చేస్తోందని, తమ వైపు తిప్పుకుంటోందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో సెర్ఫ్ ఈ ఆదేశాలు ఇచ్చింది.