సీపీపీ చైర్‌పర్సన్‌గా సోనియా..
x

సీపీపీ చైర్‌పర్సన్‌గా సోనియా..

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) చైర్‌పర్సన్‌గా సోనియా గాంధీ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం జరిగిన సిపిపి సమావేశంలో ఆమె ఎన్నిక జరిగింది.


కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) చైర్‌పర్సన్‌గా సోనియా గాంధీ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం జరిగిన సిపిపి సమావేశంలో ఆమె ఎన్నిక జరిగింది. మొదట సోనియాగాంధీ పేరును కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రతిపాదించగా.. నేతలు గౌరవ్ గొగోయ్, తారిఖ్ అన్వర్‌ ఆయనకు మద్దతు తెలిపారు. తర్వాత లోక్‌సభ, రాజ్యసభ ఎంపీల మద్దతు లభించింది.

ఈ సందర్భంగా పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో కొత్తగా ఎన్నికైన ఎంపీలను ఉద్దేశించి సోనియా మాట్లాడారు. నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వాన్ని జవాబుదారీగా పని చేయించడంలో చురుకుగా ఉండాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

గత లోక్‌సభలో కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ అధినేతగా పనిచేసిన ఆమె మళ్లీ ఈ పదవికి ఎన్నికయ్యారు. 20ఏళ్ల పాటు లోక్‌సభ సభ్యురాలిగా ఉన్న సోనియా ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

“బీజేపీకి మెజార్టీ స్థానాలు సాధించలేకపోయింది. ఆ పార్టీ నైతికంగా ఓటమి చెందింది. వాస్తవానికి మోదీ నాయకత్వ హక్కును కోల్పోయారు. వైఫల్యానికి బాధ్యత వహించకుండా, మళ్లీ ప్రమాణ స్వీకారానికి సిద్ధమయ్యారు. పాలనలో పెను మార్పులు తీసుకొస్తాడని భావించడం లేదు’’ అని సోనియా పేర్కొన్నారు.

రాహుల్‌కు ప్రశంసలు..

భారత్ జోడో యాత్రలను "చారిత్రక ఉద్యమాలు"గా అని సోనియా పేర్కొన్నారు. ఈ సందర్బంగా పలువురు పార్టీ నేతలు రాహుల్ ను అభినందించారు.

Read More
Next Story