ఇందిరాగాంధీని ‘భారతమాత’గా అభివర్ణించిన బీజేపీ కేంద్ర మంత్రి
x
శనివారం కె కరుణాకరన్ స్మారక చిహ్నం వద్ద రాజకీయ నాయకుడుగా మారిన నటుడు సురేష్ గోపి | ఫోటో కర్టసీ: X/@TheSureshGopi

ఇందిరాగాంధీని ‘భారతమాత’గా అభివర్ణించిన బీజేపీ కేంద్ర మంత్రి

ఇటీవల బాధ్యతలు చేపట్టిన బీజేపీ కేంద్ర మంత్రి సురేష్ గోపి కేరళలోని కాంగ్రెస్ మాజీ సీఎం కరుణాకరన్ స్మారకాన్ని సందర్శించారు. అక్కడ ఇందిరాగాంధీ గురించి ఏమన్నారంటే..


మాజీ ప్రధాని ఇందిరాగాంధీని 'భారతమాత'గా దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి కె కరుణాకరన్ 'ధైర్యవంత పాలకుడు'గా అభివర్ణించారు కేంద్ర మంత్రి సురేష్ గోపి.

కరుణాకరన్‌, మార్క్సిస్ట్ అనుభవజ్ఞుడైన ఇకె నయనార్‌ తన "రాజకీయ గురువులు" అని చెప్పారు కూడా. కేరళలోని పున్‌కున్నంలోని కరుణాకరన్‌ స్మారకం మురళీ మందిరాన్ని సందర్శించిన తర్వాత సురేష్ గోపి విలేఖరులతో మాట్లాడారు.

ఆసక్తికర విషయం ఏమిటంటే..ఏప్రిల్ 26న జరిగిన ఎన్నికల్లో కరుణాకరన్ కుమారుడు, కాంగ్రెస్ నాయకుడు అయిన కె మురళీధరన్‌పై పోటీ చేసి త్రిసూర్ లోక్‌సభ నియోజకవర్గాన్ని చేజిక్కించుకున్నారు సురేష్ గోపి.

కరుణాకరన్ స్మారకానికి, తన సందర్శనకు రాజకీయాలతో ముడిపెట్టోదని మీడియా ప్రతినిధులను కోరారు. కేవలం తన "గురువు"కు నివాళి అర్పించేందుకు మాత్రమే వచ్చానని స్పష్టం చేశారు.

నయనార్ ఆయన భార్య టీచర్ శారదలాగా కరుణాకరన్, ఆయన భార్య కల్యాణికుట్టి అమ్మతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. జూన్ 12న కన్నూర్‌లోని నాయనార్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు కూడా.

కరుణాకరన్‌ను కేరళలో కాంగ్రెస్‌కు "తండ్రి"గా అభివర్ణించడం.. దక్షిణాది రాష్ట్రంలోని గ్రాండ్ ఓల్డ్ పార్టీ వ్యవస్థాపకులు లేదా సహ వ్యవస్థాపకులను అగౌరవపరచడం కాదని సురేష్ గోపి క్లారిటీ ఇచ్చారు.

నటుడిగా మారిన రాజకీయవేత్త కూడా కాంగ్రెస్ అనుభవజ్ఞుని పరిపాలనా సామర్థ్యాలను ప్రశంసించారు.తన తరానికి చెందిన "ధైర్యవంతమైన నిర్వాహకుడు" అని పిలిచారు.

2019లో కూడా తాను కరుణాకరన్ స్మారకాన్ని సందర్శించాలనుకున్నానని, అయితే రాజకీయ కారణాల వల్ల ఆయన కుమార్తె పద్మజ వేణుగోపాల్ తనను నిరుత్సాహ పరిచిందని చెప్పారు. అనంతరం నగరంలోని ప్రముఖ లూర్ద్ మాతా చర్చిని కూడా సురేష్ గోపి సందర్శించి ప్రార్థనలు చేశారు.

ఆయన, తన కుటుంబసభ్యులు కలిసి తన కుమార్తె వివాహం సందర్భంగా సెయింట్ మేరీ విగ్రహానికి బంగారు కిరీటాన్ని బహూకరించారు. అయితే అగి రాగితో తయారు చేయించినదని సురేష్ గోపి రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.

త్రిసూర్ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ మధ్య హోరాహోరీ పోరు సాగింది. చివరకు కేరళలో బీజేపీ ఖాతా తెరిచిన ఘనత సురేష్ గోపికి దక్కింది.

Read More
Next Story