యూపీలో యోగీ బిజెపి ఎందుకలా తయారయింది?
x

యూపీలో యోగీ బిజెపి ఎందుకలా తయారయింది?

యూపీలో బీజేపీకి సీట్లు తగ్గడానికి కారణం ఏమిటి? పార్టీ అంతర్మత కలహాలే కారణమా? నాయకుల మధ్య సఖ్యత కొరవడిందా? రాష్ట్ర నాయకత్వం మిత్రపక్షాలను పట్టించుకోవడం లేదా?


ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ సత్తా చాటలేకపోయింది. ఆశించిన మేర సీట్లు గెలువలేకపోవడంతో పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) మిత్రపక్షాలు కూడా బిజెపి రాష్ట్ర నాయకత్వం నుంచి సరైన మద్దతు లభించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు కేంద్ర, రాష్ట్ర నాయకత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ సీనియర్ నాయకులు భావిస్తున్నారు.

“ప్రశ్నకు జవాబు చాలా తేలిక.. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ పేలవమైన పనితీరుకు ఎవరు బాధ్యులు? లోక్‌సభ ఎన్నికల ఫలితాలు.. కేంద్రం పనితీరుపై ఆధారపడి ఉంటాయని కొందరు నాయకులు భావిస్తున్నారు. బిజెపి కేంద్ర నాయకత్వమే అందుకు బాధ్యత వహించాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పేలవమైన పనితీరు వల్లే సీట్లు తగ్గాయని కేంద్రంలోని నాయకులు భావిస్తున్నారు.” అని లక్నోలో ఉన్న ఒక సీనియర్ బిజెపి నాయకుడు ది ఫెడరల్‌తో అన్నారు.

ఊహాగానాలకు ఆజ్యం పోసిన మౌర్య వ్యాఖ్యలు..

యూపీ మంత్రివర్గంలో ఐక్యత కొరవడిందని, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పరాజయంపై నేతలు ఒకరిపై ఒకరు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారని ఇటీవల ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య చేసిన వ్యాఖ్యలను బట్టి పార్టీలో అంతర్పణ విభేధాలున్నాయని అర్థమవుతోంది.

"ఎవరికైనా ఆశయం ఉండటంలో తప్పు లేదు. ఎందుకంటే అది ప్రేరణగా కూడా పని చేస్తుంది. అయితే ఉత్తరప్రదేశ్ మంత్రివర్గంలోని అంతర్గత పోరు ఆ పార్టీ పరిస్థితిని మరింత దిగజార్చడమే బీజేపీకి ఇబ్బందిగా మారింది. నాయకుల మధ్య విభేదాలు రాష్ట్ర ప్రభుత్వం అస్థిరంగా ఉందనే అభిప్రాయాన్ని బయటపెడుతున్నాయి. కేశవ్ ప్రసాద్ మౌర్య వ్యాఖ్యలు పార్టీలో పరిస్థితిని నియంత్రించడానికి బదులుగా ఆజ్యం పోశామని కేంద్ర నాయకత్వం నమ్ముతుంది.” అని బిజెపి నాయకుడు పేర్కొన్నారు.

కలత చెందిన మిత్రపక్షాలు..

అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) భాగస్వామ్య పక్షాలు కూడా తమ మాట వినడం లేదని రాష్ట్ర నాయకత్వంపై కేంద్రానికి ఫిర్యాదు చేశాయి.

నిషాద్ పార్టీ చీఫ్ సంజయ్ నిషాద్ , సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SBSP) అధ్యక్షుడు ఓం ప్రకాష్ రాజ్‌భర్ కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం నుంచి తాము ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదని పేర్కొంటున్నారు. రెండు ఎన్డీయే భాగస్వాములు రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, దాని అగ్ర నాయకత్వంపై ఫిర్యాదు చేశారు.

ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీలు), షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు) షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) సీట్లను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయడం లేదని ఆరోపిస్తూ అప్నా దళ్ (సోనీలాల్) అధినేత్రి, కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ ఇటీవల యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశారు.

‘‘ఓబీసీ, ఎస్సీ నేతల నుంచి ఫిర్యాదులు వస్తున్నందున మా నాయకుడు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. కమ్యూనిటీ సభ్యులలో ముఖ్యంగా యువతలో పెరిగిపోతున్న ఆగ్రహాన్ని సిఎం దృష్టికి తీసుకెళ్లడం, ప్రధానికి కూడా తెలియజేయడం మా కర్తవ్యం. ”అని అప్నా దళ్ (సోనీలాల్) సీనియర్ నాయకుడు డాక్టర్ సునీల్ పటేల్ ది ఫెడరల్‌తో అన్నారు.

కేవలం OBCలు మాత్రమే కాదు. SC/STలు కూడా నెమ్మదిగా బిజెపికి దూరమవుతున్నారని NDA భాగస్వామ్య పార్టీలు భయపడుతున్నాయి

యోగికి ఉప ఎన్నికలు కీలకం..

త్వరలో జరగనున్న 10 నియోజకవర్గాల అసెంబ్లీ ఉపఎన్నికలు.. సీఎం యోగి ఆదిత్యనాథ్ పనితనానికి అద్దం పట్టనున్నాయి. 2022 రాష్ట్రంలో ఉపఎన్నికలు జరిగితే.. 10 స్థానాలను ఐదు సమాజ్‌వాదీ పార్టీ (SP) గెలుచుకోగా, బిజెపి 3, NDA భాగస్వామ్య పక్షాలు రెండు గెలుచుకున్నాయి.

'బీజేపీలో అనవసర గొడవలు జరుగుతున్నాయి. ఉప ఎన్నికలు కూడా ప్రతిష్టాత్మకంగా మారే పరిస్థితులొచ్చాయి. లోక్‌సభ ఎన్నికలు ఫలితాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏదో సాకులు చెప్పి తప్పించుకోవచ్చు. కాని ఉప ఎన్నికల ఫలితాలు మాత్రం యోగి ఆదిత్యనాథ్, అతని ప్రభుత్వానికి రెఫరెండంగా పరిగణించాల్సిందే”అని బీజేపీ నాయకుడు అన్నారు.

'యోగి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు'

అంతర్గత పోరు పార్టీకి హాని చేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. “బీజేపీలో సమస్య ఏమిటంటే.. ఆత్మపరిశీలన చేసుకోకపోవడం, సమిష్టి నాయకత్వం గురించి మాట్లాడకపోవడం. ఎన్నికల ఫలితాలపై ఒకరిని నిందించడం అన్యాయం. ఎందుకంటే ఆ ఫలితాలు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌కు ఉన్న ప్రజాదరణను ఏ బిజెపి లేదా ఎన్‌డిఎ నాయకుడు కాదనలేరు. నాయకత్వ మార్పు గురించి మాట్లాడితే అది బిజెపికి వ్యతిరేకంగా మాత్రమే పని చేస్తుంది.” అని లక్నో విశ్వవిద్యాలయంలో మాజీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్‌కె ద్వివేది ఫెడరల్‌తో అన్నారు.

Read More
Next Story