‘మహారాష్ట్ర కంటే గుజరాత్ ఉల్లి రైతులపైనే మోదీకి ప్రేమ ఎక్కువ’
x

‘మహారాష్ట్ర కంటే గుజరాత్ ఉల్లి రైతులపైనే మోదీకి ప్రేమ ఎక్కువ’

‘‘2023 డిసెంబర్ నుంచి ఉల్లి ఎగుమతులపై మోదీ ప్రభుత్వం విధించిన ఆంక్షలతో మహారాష్ట్ర ఉల్లి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.’’ - జైరాం రమేష్


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ ప్రధాని మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. మహారాష్ట్ర ఉల్లి రైతుల కంటే గుజరాత్‌ ఉల్లి రైతులపైనే మోదీకి ప్రేమ ఎక్కువని విమర్శించారు. ధూలే, నాసిక్‌లో ప్రధాని మోదీ ర్యాలీల్లో పాల్గొనడానికి ముందు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ జైరాం రమేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2023 డిసెంబర్ నుంచి ఉల్లి ఎగుమతులపై మోదీ ప్రభుత్వం విధించిన ఆంక్షలతో మహారాష్ట్ర ఉల్లి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఉల్లి ఎగుమతులపై 20 శాతం సుంకం అమలులో ఉండడంతో ఎర్ర ఉల్లిని పండించే మహారాష్ట్ర రైతులు వ్యవసాయానికి దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వారి హక్కులు అటకెక్కించారు..

మహారాష్ట్రలో ఆదివాసీల అటవీ హక్కులను బీజేపీ ఎందుకు అటకెక్కించిందని మరో అస్త్రం సంధించారు. ఆదివాసీలు ప్రయోజనార్థం 2006లో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని (ఎఫ్‌ఆర్‌ఎ) బీజేపీ ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు. ‘‘ఆదివాసీలకు హక్కులను కల్పించడంలో మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వం ఎందుకు విఫలమైంది? నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్‌తో సహా రాష్ట్రంలోని మునిసిపల్ కార్పొరేషన్‌లకు మహాయుతి సర్కారు ఎందుకు ఎన్నికలు నిర్వహించడం లేదు. ఓబీసీ రిజర్వేషన్లు, వార్డుల విభజన అంటూ సాకులు చెబుతూ ఎన్నికల వాయిదా వేస్తున్నారు. వాస్తవమేమిటంటే..తమకు ఎదురుగాలి వీస్తుందనే భయంతోనే ఎన్నికల జోలికి వెళ్లడం లేదు. దీంతో నాసిక్ ప్రజల సమస్యలను పట్టించుకునే వారెవరు’’ అని రమేష్ ప్రశ్నించారు.

మహారాష్ట్రలో నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. కౌంటింగ్ 23న జరుగుతుంది.

Read More
Next Story