
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఆర్థిక సర్వే: వచ్చే ఏడాది దేశ వృద్ధిరేటు అంచనా ఎంతంటే?
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సవాళ్లు ఉన్నాయని హెచ్చరిక
వచ్చే ఆర్థిక సంవత్సరంలో(2027) దేశ వృద్ధిరేటు 6.8 శాతం నుంచి 7.2 శాతం మధ్యలో ఉంటుందని ఆర్థిక సర్వే 2025-26 అంచనావేసింది. బలమైన ఆర్థిక మూలాలు, వరుసగా ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు ఈ వృద్ధికి చోదకాలుగా పనిచేస్తున్నాయని పేర్కొంది.
ప్రపంచ ఆర్థిక పరిస్థితులు అనిశ్చితంగా ఉన్నప్పటికీ దేశీయ డిమాండ్ మాత్రం స్థిరంగా ఉందని వివరించింది. ఇది వృద్ధి ఊతమిస్తాయని అంచనా వేసింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్ ఉభయ సభల్లో 2025-26 ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. అమెరికా, భారత్ పై సుంకాలు విధిస్తూ ఒత్తిడి చేస్తున్నప్పటికీ ప్రపంచ ఆర్థిక వాతావరణాన్ని నావిగేట్ చేయడాన్ని వ్యూహాత్మక విధానాన్ని అనుసరిస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంచనాలు మధ్యస్థ కాలంలో అస్పష్టంగానే ఉన్నాయని, ప్రతికూల పరిస్థితులు కొనసాగుతున్నాయని కూడా ఆర్థిక సర్వే విశదీకరించింది. దేశంలో ద్రవ్యోల్భణం అదుపులోనే ఉందని దీనివల్ల ద్రవ్య విధానాలు అనుకూలంగా మార్చుకుని వృద్ధికి సహాయకారిగా ఉంటుందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం ఆర్థిక సర్వే 2024-25 ప్రకారం 2026 లో ఆర్థిక వృద్ధి 6.3 శాతం నుంచి 6.8 శాతం మధ్యలో ఉంటుందని పేర్కొంది.
ప్రపంచంలో తీవ్రమైన ఆర్థిక సవాళ్లు కూడా ఎదురబోతున్నాయని కూడా ఆర్థిక సర్వే అంచనావేసింది. ‘‘ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఊహించిన లాభాలు అందించడంలో విఫలం అయితే ఆస్థి విలువలో దిద్దుబాటు చర్యలకు దారితీస్తుంది, ఆర్థిక హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం ఉంటుంది’’ అని హెచ్చరించింది.
ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ప్రధాన ఆర్థిక సలహదారు వి. అనంత నాగేశ్వరన్, ఆయన బృందం రూపొందించిన ఈ సర్వే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన సంస్కరణలను వివరించింది. ఆదాయపు పన్ను, జీఎస్టీ ఉపశమనం, ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్న సరళీకృత ప్రత్యక్ష పన్ను చట్టం, ఎఫ్డీఐ నిబంధనలు, దివాలా చట్టంలోని మార్పులు ప్రస్తావించారు.
ప్రపంచ వాణిజ్యం గందరగోళంలో ఉన్న నేపథ్యంలో తయారీ రంగాన్ని బలోపేతం చేయడానికి వైవిధ్యీకరణ, అధిక ఉత్పత్తి నాణ్యత, లోతైన ఆర్థిక సంబంధాలు, సెమీ కండక్టర్స్ వంటి కీలక రంగాలలో స్వావలంబనను నిర్మించడానికి ఈ సర్వే రోడ్ మ్యాప్ ను కూడా నిర్దేశించింది.
Next Story

