
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
పశ్చిమాసియాలో యుద్దమే కారణం
పశ్చిమాసియాలో ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత రంగాల వైపు తమ పెట్టుబడులను మళ్లీస్తున్నారు. దీనితో సోమవారం బంగారం, వెండి ధరలు ఆకాశానంటాయి.
రిస్క్ తీసుకునే కోరిక తగ్గడంతో ఈక్విటీలు, ఇతర అస్థిర సాధనాలు నిధులు ఉపసంహరించుకుని దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బులియన్ మార్కెట్లలోకి మళ్లించారు. ఇజ్రాయెల్ లోని ప్రాంతాలతో పాటు, ఖతార్, యూఏఈ, కువైట్, బహ్రెయిన్ లోని యూఎస్ సైనిక బేస్ లే లక్ష్యంగా ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. దీనితో విస్తృత ప్రాంతీయ సంఘర్షణలను సృష్టించింది.
భారత్ లో బంగారం, వెండి ధరలు..
భారత్ లో బంగారం ధరలు బాగా పెరిగాయి. సోమవారం నాడు పది గ్రాములకు రూ. 1,73,090 పెరిగింది. ఇంతకుముందు సెషన్ లో ఈ ధర 1,62,490 గా ఉంది. బులియన్ మార్కెట్ డేటా ప్రకారం వెండి ధర కూడా బాగా పెరిగింది. కిలోకు రూ. 2,82, 140 గా ఉంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలన వచ్చాక భౌగోళిక రాజకీయ, ఉద్రిక్తతలు మారుతున్న దౌత్యపరమైన ఒత్తిడులు, ప్రపంచ అనిశ్చితుల కారణంగా ఇటీవల నెలల్లో బంగారం ధర నిరంతరం పెరుగుతూనే ఉంది.
సరఫరా అంతరాయాలు..
భౌగోళిక రాజకీయ ప్రమాదాలకు మించి సరఫరాలో అంతరాయాలు కలగడంతో ధరలు పెరుగుతున్నాయి. భారత్ కు దుబాయ్ నుంచి బంగారం దిగుమతులు వస్తుంటాయి. అయితే విమాాన సర్వీసులు అంతరాయం కలగడం కూడా బంగారం ధరలు పెరగడానికి ఒక కారణంగా చెప్పవచ్చు.
విదేశీ మార్కెట్లు పెరుగుదల..
అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఇదే విధమైన ధరలు కొనసాగుతున్నాయి. సోమవారం ప్రారంభంలో స్పాట్ గోల్డ్ ఔన్స్ కు 2 శాతం పెరిగి 5,368.60 డాలర్లకు చేరుకుంది. ఇది నాలుగు వారాల అత్యధిక స్థాయి. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 2.58 శాతం పెరిగి5,382 డాలర్లకు పెరిగింది.
Next Story

