
రక్షణ రంగంపై భారీగా పెరిగిన కేటాయింపులు
ఈ ఏడాది ఏడు లక్షల కోట్లకు చేరిన రక్షణ రంగ వ్యయం, జీడీపీ లో పదకొండు శాతంగా..
ఆపరేషన్ సిందూర్ తరువాత భారత రక్షణ రంగ వ్యయం బడ్జెట్ లో అమాంతం పెరిగాయి. దేశ రక్షణకు 2026-27 బడ్జెట్ లో రూ. 7.85 లక్షల కోట్లు కేటాయించారు. గత ఏడాది రక్షణ రంగ వ్యయం రూ. 6.81 లక్షల కోట్లుగా ఉంది. సైనిక సంసిద్ధత, ఆధునీకరణ, సిబ్బంది సంక్షేమంపై బడ్జెట్ కేటాయింపులలో ఎక్కువ మొత్తం ఖర్చు అవుతున్నాయి.
బడ్జెట్ పత్రాల ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరం రక్షణ మంత్రిత్వ శాఖకు మొత్తం కేటాయింపులో రక్షణ సేవల, మూలధన వ్యయం, రక్షణ పెన్షన్లు వివిధ మంత్రిత్వ శాఖ పరిధిలోని పౌర సంస్థలు ఉన్నాయి. రాఫెల్ ఫైటర్ జెట్‌లు, జలాంతర్గాములు, మానవరహిత వైమానిక వాహనాల ఒప్పందాలు వంటి ప్రధాన ప్రాజెక్టులు ఈ కేటాయింపులలో భాగంగా ఉన్నాయి.
సైన్యం రూ.2.19 లక్షల కోట్లు
రక్షణ కేటాయింపులను రంగాల వారీగా అంటే సైన్యం, ఎయిర్ ఫోర్స్, నేవీగా విభజిస్తే సైన్యానికి ఎక్కువ మొత్తంలో నిధులు దక్కాయి. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఆధునీకరణ కోసం సైన్యానికి రూ.2.19 లక్షల కోట్లు కేటాయించారు. ఇది గత ఏడాదితో పోలిస్తే 21.84 శాతం పెరుగుదలకు సమానం. FY26 బడ్జెట్‌లో, రక్షణ మంత్రిత్వ శాఖ మూలధన వ్యయం రూ. 1.8 లక్షల కోట్లుగా ఉంది.
మూలధన వ్యయ కేటాయింపులలో విమానాలు, ఏరో ఇంజిన్‌ల కోసం(వైమానిక దళం) కేటాయించిన మొత్తం రూ. 63,733 కోట్లు ఉన్నాయి. ఇంకా, నిర్వహణ, మందుగుండు సామగ్రి, ఇంధనం, మరమ్మతులు, సహాయక సిబ్బందికి జీతాలు వంటి ఖర్చులతో సహా రోజువారీ కార్యకలాపాల కోసం చేసే కేటాయింపులు 17.24 శాతం పెరిగింది.
పెన్షన్లు 6.53 కేటాయింపుల శాతం
పెన్షన్ల కేటాయింపు 6.53 శాతం పెరిగి రూ. 1.71 లక్షల కోట్లకు చేరుకుంది. మొత్తంమీద, రక్షణ కోసం పెరిగిన బడ్జెట్ GDPలో 11 శాతంగా ఉంది. గత సంవత్సరం జీడీజీలో ఎనిమిది శాతంగా ఉంది.
గత సంవత్సరం బడ్జెట్‌లో రక్షణ కోసం ప్రభుత్వం రూ. 6.81 లక్షల కోట్లు కేటాయించడం అతిపెద్ద మొత్తం అనుకుంటే ఈ ఏడాది ఇది మరో లక్ష కోట్లకు పెరిగింది. బడ్జెట్ కేటాయింపులో జీతాలు, భత్యాలు, నిర్వహణ, కార్యాచరణ సంసిద్ధతపై ఖర్చు ఉన్న రక్షణ సేవల రంగం (ఆదాయం) రూ. 3.12 లక్షల కోట్లుగా ఉన్నాయి.
రక్షణ రంగంలోని యూనిట్లు నిర్వహణ, మరమ్మత్తు లేదా సమగ్ర పరిశీలన కోసం ఉపయోగించే విమాన భాగాల ఉత్పత్తి కోసం తీసుకువచ్చే ముడి పదార్థాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని మినహాయించినట్లు సీతారామన్ ప్రకటించారు.
పెరుగుతున్న భౌగోళిక రాజకీయ సవాళ్ల మధ్య బడ్జెట్ పెంపు ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితి అనిశ్చితంగా మారడంతో పాటు సరిహద్దుల దేశాలపై చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వస్తున్న ముప్పును దృష్టిలో పెట్టుకోవడంతో పాటు గత ఏడాది పహల్గాం దాడి తరువాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని ఈ కేటాయింపులు చేసినట్లు తెలుస్తోంది.
ఈ కేటాయింపులు దీర్ఘకాలిక సంసిద్ధత, మూలధన వ్యయం, సైన్యం ఆధునీకరణ వంటి వాటికి ఉపయోగపడుతుందని అధికారులు వాదిస్తున్నారు.
ముఖ్యంగా గత సంవత్సరం భారతదేశం - పాకిస్తాన్ దళాల మధ్య వైమానిక ఘర్షణల తర్వాత సాయుధ దళాలపై వ్యయం అమాంతం పెంచాల్సి వచ్చింది. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా దాదాపు 25 వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసినట్లు కొన్ని సంస్థలు అంచనా వేశాయి.
రక్షణ మంత్రిత్వ శాఖ బడ్జెట్ కేటాయింపులలో 20 శాతం పెంపును కోరింది. 2025 మే నెలలో ఆపరేషన్ సిందూర్ నిర్వహించినప్పుడు, రూ.50,000 కోట్ల పెంపుదల ప్రతిపాదన ఉందని వర్గాలు తెలిపాయని NDTV నివేదిక తెలిపింది.
'ఆత్మనిర్భరత' లేదా రక్షణ తయారీలో స్వయం సమృద్ధి కోసం రక్షణ మూలధన బడ్జెట్‌లో భారీ కేటాయింపులు కొనసాగుతాయని, వాటికే మొదటి ప్రాధాన్యం ఉంటుందని నరేంద్ర మోదీ సర్కార్ చెబుతూ వస్తోంది. గత త్రైమాసికంలో భారతదేశ రక్షణ వ్యయం 40 శాతానికి పైగా పెరిగిందని నివేదికలు సూచిస్తున్నాయి.
Next Story

