
పెరిగిన చమురు ధరలు, 2,700 పతనమైన సెన్సెక్స్
పశ్చిమాసియాలో తీవ్రతరం అయిన యుద్ధం
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో సోమవారం ప్రారంభ ట్రేడింగ్ లో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు కుప్పకూలాయి. ప్రారంభ ట్రేడింగ్ లో 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 2,743. 46 పాయింట్లు లేదా 3.37 శాతం నష్టపోయి 78,543 73 వద్ద ట్రేడవుతోంది.
50 షేర్ల ఎన్ఎస్ఈ నిఫ్టీ 533.55 పాయింట్లు లేదా 2.11 పాయింట్లు నష్టపోయి 24,645.10 వద్ద నడుస్తోంది. సెన్సెక్స్ ప్యాక్ లో ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, లారెన్స్ అండ్ టూబ్రో, ఎటర్నల్, అదానీ పోర్ట్స్, ఆసియన్ పెయింట్స్ అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ నష్టాలలో ముగిశాయి. భారత్ ఎలక్ట్రానిక్స్ మాత్రమే లాభపడింది. ప్రపంచ చమురు బెంచ్ మార్క్ బ్రెంట్ చమురు బ్యారెల్ కు 5.38 శాతం తగ్గి 76.79 డాలర్లకు చేరుకుంది.
ఇరాన్ నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ శనివారం తెల్లవారుజామున టెహ్రన్ పై అమెరికా- ఇజ్రాయెల్ దాడులుచేయడంతో ఆయన మరణించారు. ఇరాన్ రాష్ట్ర మీడియా ఆదివారం ప్రకటించింది. ఈ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఈ ప్రాంతంలో అమెరికా బేస్ లకు ఆశ్రయం ఇస్తున్న అరబ్ దేశాలపై క్షిపణులు ప్రయోగించడం ప్రారంభించింది.
ఆసియా మార్కెట్లలో జపాన్ కు చెందిన నిక్కీ 225, హాంకాంగ్ కు చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ తక్కువ లాభాలతో ప్రారంభం అయింది. షాంఘైకి చెందిన ఎస్ఎస్ఈ కాంపోజిట్ ఇండెక్స్ సానుకూలంగా ట్రేడయింది.
అయితే అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ‘‘పశ్చిమాసియా లో యుద్ధానికి సంబంధించిన అనిశ్చిత పరిస్థితులు అమెరికాలో ఎక్కువగా ప్రభావం చూపింది. మార్కెట్ కోణం నుంచి చూస్తే చమురు ధరలు పెరుగుదల వల్ల ఉత్పన్నమయ్యే ఇంధన ప్రమాదం ప్రధానమైనది’’ అని జియోజిత్ ఇన్వెస్ట్ మెంట్ లిమిటెడ్ చీఫ్ ఇన్వెస్ట్ మెంట్ స్ట్రాటజిస్ట్ వికే విజయ్ కుమార్ అన్నారు.
శుక్రవారం నాడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(ఎఫ్ఐఐ) రూ. 7,536 కోట్ల విలువైన ఈక్విటీలను ఆఫ్ లోడ్ చేశారని స్టాక్ ఎక్స్ ఛేంజ్ డేటా తెలిపింది. అయితే దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు రూ. 12,292.81 కోట్ల విలువైన స్టాక్ లను కొనుగోలు చేశారు.
‘‘పెట్టుబడిదారులకు అంతటా అనిశ్చిత పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక ప్రాంతీయ అస్థిరత వాణిజ్య మార్గాలను దెబ్బతీస్తుంది. సరఫరా గొలుసులను దెబ్బతీస్తుంది. ద్రవ్యోల్భణ అంచనాలు తిరిగి వేగవంతమైతే ప్రపంచ ఆర్థిక పరిస్థితులను కఠినతరం చేస్తుంది’’ అని ఆన్ లైన్ ట్రేడింగ్, సంపద సాంకేతిక సంస్థ ఎన్ రిచ్ మనీ సీఈఓ పొన్ముడి తీర్ అన్నారు. శుక్రవారం సెన్సెక్స్ 961. 42 పాయింట్లు లేదా 1.17 శాతం నష్టపోయింది. 81,287 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 317.90 పాయింట్లు లేదా 1.25 శాతం నష్టపోయి 25,178.65 వద్ద ముగిసింది.
Next Story

