భారీ నష్టాల నుంచి కోలుకుంటున్న స్టాక్ మార్కెట్లు
x

భారీ నష్టాల నుంచి కోలుకుంటున్న స్టాక్ మార్కెట్లు

ప్రారంభ ట్రేడింగ్ లో లాభాల బాట


బడ్జెట్ ప్రవేశపెట్టడంతో డీలాపడిన స్టాక్ మార్కెట్ సోమవారం మళ్లీ ఫుంజుకుంది. ఈ రోజు ఉదయం ట్రేడింగ్ ప్రారంభం కాగానే సెన్సెక్స్, నిఫ్టీ రెండు లాభాల్లోకి దూసుకెళ్లాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో 30-షేర్ల BSE సెన్సెక్స్ 302 పాయింట్లు పెరిగి 81,024.94కి చేరుకుంది. 50-షేర్ల NSE నిఫ్టీ 59.25 పాయింట్లు పెరిగి 24,884.70కి చేరుకుంది.

సెన్సెక్స్ సంస్థలలో అదానీ పోర్ట్స్, లార్సెన్ & టూబ్రో, ఆసియన్ పెయింట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఎటర్నల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, పవర్ గ్రిడ్, HDFC బ్యాంక్ షేర్లు లాభాలు ఆర్జించాయి. ట్రెంట్, టైటాన్, ITC, హిందూస్తాన్ యూనిలీవర్ వెనుకబడి ఉన్నాయి.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం తయారీ రంగాన్ని పెంచే చర్యలను ప్రకటించారు. ఇందులో భాగంగా ప్రపంచ డేటా సెంటర్లకు దీర్ఘకాలిక పన్ను ప్రోత్సాహకాలను అందించారు.

2026-27 సంవత్సరానికి రూ. 53.5 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్‌ను ఆవిష్కరించింది. ఇది పెరుగుతున్న ప్రపంచ ప్రమాదాల మధ్య స్థిరమైన వృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళికలకు ప్రాధాన్యం ఇచ్చింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడుతో సహా ఐదు కీలక రాష్ట్రాలు ఎన్నికలకు వెళుతున్నప్పటికీ, ప్రజాకర్షక పథకాలు, విప్లవాత్మక సంస్కరణల జోలికి వెళ్లలేదు.
కానీ బడ్జెట్ ప్రకటన ఈక్విటీ డెరివేటివ్స్‌పై సెక్యూరిటీ లావాదేవీల పన్ను పెంపు ఈక్విటీ మార్కెట్లను కుదిపేసింది. ప్రత్యేక బడ్జెట్-రోజు ట్రేడింగ్ సెషన్‌లో కీలక సూచీలు 2 శాతం వరకు పడిపోయాయి.
కానీ తాజాగా జరుగుతున్న ట్రేడింగ్ లో తిరిగి లాభాల బాట పడుతున్నాయి. ఆదివారం, బిఎస్‌ఇ బెంచ్‌మార్క్ 1,546.84 పాయింట్లు లేదా 1.88 శాతం తగ్గి 80,722.94 వద్ద ముగిసింది. నిఫ్టీ 495.20 పాయింట్లు లేదా 1.96 శాతం తగ్గి 24,825.45 వద్ద స్థిరపడింది.
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఆదివారం రూ 588.34 కోట్ల విలువైన ఈక్విటీలను ఆఫ్‌లోడ్ చేసినట్లు ఎక్స్ఛేంజ్ డేటా తెలిపింది. ఆసియా మార్కెట్లలో, దక్షిణ కొరియా కోస్పి 4 శాతానికి పైగా పడిపోయింది.
జపాన్ నిక్కీ 225 ఇండెక్స్, షాంఘై ఎస్‌ఎస్‌ఇ కాంపోజిట్ ఇండెక్స్, హాంకాంగ్ హాంగ్ సెంగ్ ఇండెక్స్ కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. శుక్రవారం యుఎస్ మార్కెట్లు కూడా పతనమయ్యాయి. ప్రపంచ చమురు బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ 4.14 శాతం తగ్గి బ్యారెల్‌కు 66.45 డాలర్లకు చేరుకుంది.
Read More
Next Story