ఆల్ టైం కనిష్టానికి పడిపోయిన రూపాయి విలువ
x

ఆల్ టైం కనిష్టానికి పడిపోయిన రూపాయి విలువ

ఒక డాలర్ కు 92 రూపాయలు


ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు, వాణిజ్య గందరగోళం నేపథ్యంలో భారత కరెన్సీ అసాధారణంగా పతనం అయింది. గురువారం ప్రారంభ ట్రేడింగ్ లో అమెరికన్ కరెన్సీతో పోలిస్తే రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి 92.00కి చేరుకుంది.

డాలర్ విలువ స్థిరంగా ఉండటం, వడ్డీరేట్లను మార్చబోమని ఫెడ్ ప్రకటించడంతో రూపాయి విలువ పడిపోయిందని ఆర్థిక నిఫుణులు చెబుతున్నారు. ఇది నాలుగున్నర సంవత్సరాల కనిష్ట స్థాయి. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఆర్థిక రిస్క్ ను పెంచింది.

ఇవి అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్‌లో, రూపాయి 91.95 వద్ద ప్రారంభమైంది. గ్రీన్‌బ్యాక్‌తో పోలిస్తే 92 వద్ద ట్రేడింగ్‌ ముగిసింది.

నెలాఖరు డాలర్ డిమాండ్ పెరగడంతో మునుపటి ముగింపు కంటే 1 పైసా తగ్గింది. బుధవారం, రూపాయి 31 పైసలు క్షీణించి, గ్రీన్‌బ్యాక్‌తో పోలిస్తే దాని అత్యల్ప ముగింపు స్థాయి 91.99ని నమోదు చేసింది.

జనవరి 23న US డాలర్‌తో పోలిస్తే రూపాయి ఆల్‌టైమ్ ఇంట్రాడే కనిష్ట స్థాయి 92కి చేరుకుంది. "ఈ స్థిరమైన మూలధన ప్రవాహం డాలర్ డిమాండ్‌ను పెంచింది" అని CR ఫారెక్స్ అడ్వైజర్స్ MD - అమిత్ పబారి అన్నారు.

"ఈ వారం చమురు ధరలు 4 శాతానికి పైగా పెరిగాయి. ఇరాన్ అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో విఫలమైతే సైనిక చర్యకు అవకాశం ఉందని అమెరికా హెచ్చరికల నేపథ్యంలో కరెన్సీలు తీవ్ర పతనాన్ని ఎదుర్కొన్నాయి.
చమురు సరఫరాకు అంతరాయాలు ఉంటుందని ఆందోళన పెరిగాయి" అని పబారి అన్నారు. భారత్ చమురును విదేశాల నుంచి భారీ స్థాయిలో దిగుమతి చేసుకుంటుందని ధరల పెరుగుదల వల్ల ఆర్థిక ఒడిదుడికులు ఉంటాయని అంచనాలు ఉన్నాయి.
ఆరు కరెన్సీల బాస్కెట్‌తో గ్రీన్‌బ్యాక్ బలాన్ని కొలిచే డాలర్ ఇండెక్స్ 0.29 శాతం తగ్గి 96.16 వద్ద ట్రేడవుతోంది. ప్రపంచ చమురు బెంచ్‌మార్క్ అయిన బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్స్ ట్రేడ్‌లో బ్యారెల్‌కు 1.32 శాతం పెరిగి USD 69.30 వద్ద ట్రేడవుతోంది. ఆర్బీఐ మద్దతుతో రూపాయ్ పతనం కాస్త మందగించవచ్చని పబారీ అంచనా వేశారు.
దేశీయ ఈక్విటీ మార్కెట్ ముందు, సెన్సెక్స్ ప్రారంభ వాణిజ్యంలో 343.67 పాయింట్లు క్షీణించి 82,001.01కి చేరుకోగా, నిఫ్టీ 94.2 పాయింట్లు తగ్గి 25,248.55కి చేరుకుంది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు బుధవారం రూ.480.26 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేసినట్లు ఎక్స్ఛేంజ్ డేటా తెలిపింది.
తయారీ, మైనింగ్, విద్యుత్ రంగాలలో బలమైన ఉత్పత్తి నేపథ్యంలో డిసెంబర్ 2025లో భారతదేశ పారిశ్రామిక ఉత్పత్తి రెండేళ్ల గరిష్ట స్థాయిలో 7.8 శాతం వృద్ధి చెందిందని బుధవారం విడుదల చేసిన ప్రభుత్వ డేటా తెలిపింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (IIP) పరంగా కొలిచే ఫ్యాక్టరీ ఉత్పత్తి డిసెంబర్ 2024లో 3.7 శాతం పెరిగింది.
Read More
Next Story