వాణిజ్య ఒప్పందంలో మనకు తెలిసిన ‘పది’ అంశాలేంటీ?
x
ప్రధాని నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్

వాణిజ్య ఒప్పందంలో మనకు తెలిసిన ‘పది’ అంశాలేంటీ?

ఇప్పటి వరకు ఇరు దేశాల నుంచి రాని ఉమ్మడి ప్రకటన


రెండు ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా- భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు ప్రకటన రావడం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ ఒప్పందంలోకి కీలక అంశాలు ఏవి ఇంత వరకూ ఇరుదేశాలు బయటపెట్టలేదు.

ప్రకటన వెలువడిన 12 గంటల తర్వాత కూడా, ఏ ప్రభుత్వమూ ఉమ్మడి ప్రకటనను విడుదల చేయలేదు, ఒప్పందం నిబంధనలను వివరించే ఏ పత్రాలు కూడా ప్రజాస్రవంతిలోకి రాలేదు. ఇది మొత్తం ట్రంప్ ప్రకటన, అమెరికా అధికారుల వివరణపై ఆధారపడి ఉంది.

రెండు దేశాల మధ్య ఏమి ప్రకటించారు, ఒప్పందం ఎలా ఉందనే విషయంపై పాయింట్ల వారిగా చూద్దాం.

1. ప్రకటన..

ఫిబ్రవరి 2న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్ కాల్, తదనంతరం కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించారు.
సుంకాల తగ్గింపులు, విస్తరించిన మార్కెట్ యాక్సెస్, అమెరికా వస్తువులపై సున్న శాతం సుంకాలు విధింపు వంటి ఉన్నాయని ఆయన స్వయంగా వెల్లడించారు.

2. 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గింపు

భారత వస్తువులపై అమెరికా విధించిన 50 శాతం సుంకాలను తక్షణమే 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇందులో ఏ ఉత్పత్తుల పరిధిని వెల్లడించనప్పటికీ, సుంకాలను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తామని అమెరికా అధికారులు తరువాత స్పష్టం చేశారు.

3. ఉత్పత్తి కవరేజ్‌పై కొరవడిన స్పష్టత

ఏ భారతీయ ఎగుమతులు సుంకాల తగ్గింపు వల్ల ప్రయోజనం పొందుతాయనే దానిపై ఇంకా సమాచారం లేదు. కొత్త రేటు ఇప్పటికే అక్కడికి చేరిన వస్తువులపై కూడా అమలు చేస్తారా? లేదా దీనికి ప్రామాణిక తేదీ ఉంటుందా? అనే విషయంలో కూడా స్పష్టత లేదు.

4. కీలకమైన సుంకాలలో మార్పు ఉండదా?

ఈ ఒప్పందం US సెక్షన్ 232 సుంకాలను ప్రభావితం చేస్తుందని ఎటువంటి సూచనలు లేవు. ఉక్కు, అల్యూమినియం, రాగిపై 50 శాతం, కొన్ని ఆటో భాగాలపై 25 శాతం సుంకాలు అలాగే ఉంటాయని భావిస్తున్నారు. ఔషధాలు, విమానాలు, విడిభాగాలు, కొన్ని ఎలక్ట్రానిక్, మెకానికల్ భాగాలకు ఇప్పటికే వర్తించే జీరో-డ్యూటీ విధానం కూడా మారదు.

5. భారత్ జీరో టారిఫ్ అమలు చేస్తుందా?

అమెరికా ఎగుమతి చేసే వస్తువులపై భారత్ ఎలాంటి టారిఫ్ లు విధించదని ట్రంప్ ప్రకటించారు. కానీ ఈ ప్రకటనపై భారత్ ఎలాంటి స్పందన లేదు. ఇది ఏ రంగాలకు లేదా ఉత్పత్తులకు వర్తిస్తుందనే దానిపై స్పష్టత లేదు. వ్యవసాయం, కొన్ని మాంస దిగుమతులు వంటి సున్నితమైన అంశాలు ఏ అధికారిక కమ్యూనికేషన్‌లో ప్రస్తావించలేదు.

6. $500 బిలియన్ల కొనుగోలు

భారత్ కు అవసరమైన ఇంధనం, సాంకేతికత, వ్యవసాయ ఉత్పత్తులు, బొగ్గు వంటి ఖనిజాలను యూఎస్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. వీటి విలువ సుమారు 500 బిలియన్ డాలర్ల ట్రంప్ గర్వంగా ప్రకటిస్తున్నారు. అయితే వీటి కొనుగోలుకు ఎలాంటి టైమ్ జోన్ లేదు. US నుంచి భారత్ చేసుకుంటున్న ఇంధన వనరులు 50 బిలియన్ డాలర్ల కంటే తక్కువగా ఉన్నాయి.

7. రష్యన్ చమురు నుండి వైదొలగడం

భారత్ ప్రస్తుతం రష్యా నుంచి చవకగా కొనుగోలు చేస్తున్న ఆయిల్ దిగుమతులు ఆపేసి, అమెరికా, వెనెజువెలా నుంచి చమురును కొనుగోలు చేయడానికి అంగీకరించిందని ట్రంప్ చెబుతున్నారు. ఈ చర్య భారత ఇంధన వనరుల వ్యూహంలో గణనీయమైన మార్పును సూచిస్తుంది, కానీ న్యూఢిల్లీ దీనిని ధృవీకరించే ప్రకటన చేయలేదు.

8. అధికారిక డాక్యుమెంటేషన్ లేవు

ప్రస్తుతానికి, ఇరువైపుల నుంచి ఉమ్మడి ప్రకటన, చట్టపరమైన టెక్స్ట్ లేదా అమలు కాలక్రమం లేదు. వాణిజ్య ఒప్పందాల ప్రామాణిక అంశాలు - అమలు యంత్రాంగాలు, భద్రతా నిబంధనలు, వివాద పరిష్కార ప్రక్రియలు ఈ ప్రకటనలో లేవు.

9. రాజకీయ ప్రకటన ఒప్పందం కుదిరినట్లు కాదు

అధికారిక పత్రాలు లేనప్పుడు, ప్రకటనలు రావడం కేవలం ఒక రాజకీయ ప్రకటన భావించాల్సి ఉంటుంది. రెండు ప్రభుత్వాలు తమ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాలను బహిర్గతం చేసిన తరువాతే దాని ప్రభావం పూర్తిగా తెలుస్తుంది.

10. పార్లమెంటరీ ప్రక్రియ సూచనలు లేవు

ప్రధాన వాణిజ్య ఒప్పందాలకు సాధారణంగా దేశీయ ఆమోద ప్రక్రియలు అవసరం. వీటిలో యుఎస్‌ చట్టసభ అయిన కాంగ్రెస్ పరిశీలన, భారత్ లో పార్లమెంటరీ పర్యవేక్షణ, నిబద్ధతల పరిధిని బట్టి ఉంటాయి. ఇప్పటివరకు, అటువంటి ప్రక్రియలు ప్రారంభించబడినట్లు లేదా ఆలోచించినట్లు ఎటువంటి సూచనలు లేవు.
Read More
Next Story