బడ్జెట్ పై రాహుల్ గాంధీ ఏమన్నారంటే?
x
రాహుల్ గాంధీ

బడ్జెట్ పై రాహుల్ గాంధీ ఏమన్నారంటే?

ఉద్యోగాల కల్పన లేదు, తయారీ రంగం ప్రస్తావన లేదని విమర్శలు


Click the Play button to hear this message in audio format

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ పై లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. బడ్జెట్ దేశంలోని సంక్షోభాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

యువతకు ఉద్యోగాల కొరత ఉందని, తయారీ రంగం కుంటుపడుతుందని, రైతుల దుస్థితి దీనాతిదీనంగా ఉందని వీటిని బడ్జెట్ లో ఎక్కడా ఉపశమన చర్యలు తీసుకోవడం లేదని గాంధీ విమర్శించారు.

‘‘యువతకు ఉద్యోగాలు లేవు, తయారీ రంగం కుంటుపడుతోంది. పెట్టుబడిదారులు వెళ్లిపోతున్నారు. గృహరంగ పొదుపులు క్షీణిస్తున్నాయి. రైతులు బాధలో ఉన్నారు. ప్రపంచం మొత్తం గందరగోళంలో ఉంది’’ అని రాహుల్ గాంధీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

విధానాలు సరిగా లేవు..

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా రాహుల్ గాంధీ ఆరోపణలను సమర్థిస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. బడ్జెట్ దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ సవాళ్లను పరిష్కరించడానికి విధాన దృష్టి, రాజకీయ సంకల్పం లేకపోవడాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు.
మోదీ ప్రభుత్వానికి ఆలోచనలు అడుగంటి పోయాయని, 2026 బడ్జెట్ జాతీయ సమస్యలకు ఎటువంటి పరిష్కారాలను అందించలేదని ఆయన ఆరోపించారు. మోదీ బడ్జెట్ పై పేర్కొన్న రిఫార్మ్ ఎక్స్ ప్రెస్ పై ఆయన స్పందిస్తూ.. మిషన్ మోడ్ ఇప్పుడు విఫలమైందని, ఇది రిఫార్మ్ జంక్షన్ లో ఆగిపోయిందని వ్యంగ్యంగా చెప్పారు.
బడ్జెట్ లో విధాన దృక్ఫథం కొరవడిందని పేర్కొన్నారు. రైతులు సంక్షేమ చర్యలు లేదా ఆదాయ భద్రత కోసం ఎదురుచూస్తూనే ఉన్నారని, పెరుగుతున్న అసమానత పరిష్కరించబడలేదని ఆయన అన్నారు.
"అసమానత బ్రిటిష్ రాజ్ కింద కనిపించిన విధంగానే ఉంది. కానీ బడ్జెట్ మాత్రం దీన్ని ప్రస్తావించలేదు’’ అని ఖర్గే ఎక్స్ లో విమర్శించారు. SC, ST, OBC, EWS మరియు మైనారిటీ వర్గాలకు ఎటువంటి మద్దతు ఇవ్వలేదని అన్నారు.

బడ్జెట్ లో పరిష్కారాలు లేవు..

ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని, ఆర్థికంగా ఒత్తిడిలో ఉన్న రాష్ట్రాలకు తక్కువ ఉపశమనం అందిస్తున్నట్లు కనిపించిందని, సమాఖ్యవాదం మచ్చుకైన కానరావడం లేదని ఖర్గే అన్నారు.
తయారీ రంగం పునరుద్దరణ వ్యూహం లేకపోవడం, విశ్వసనీయ ఉద్యోగాల ప్రణాళిక, ఎగుమతి, వాణిజ్య సవాళ్లకు ప్రతిస్పందనలు, పేదలు, మధ్యతరగతి ప్రజలకు ద్రవ్యోల్భణ ఉపశమనం వంటివి ప్రస్తావించలేదని చెప్పారు.

సీతారామన్ ఏమన్నారంటే..

దేశంలోని టైర్-2, టైర్-3 నగరాలతో సహా మౌలిక సదుపాయాలను పెంచడానికి ఆమె అనేక చర్యలు తీసుకుంటామని బడ్జెట్ లో కేంద్రం ప్రతిపాదించింది. రెవెన్యూ వ్యయం కూడా 11.2 లక్షల కోట్ల నుంచి 12.2 లక్షలకు పెంచుతున్నట్లు పేర్కొంది. ప్రపంచ అనిశ్చితులు, వాణిజ్య ఘర్షణలు, US సుంకాలు, ఎగుమతుల్లో మందగమనం నేపథ్యంలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. బిజెపి నేతృత్వంలోని NDA ప్రభుత్వం తన మూడవ పదవీకాలంలో మూడవ బడ్జెట్ ఇది.


Read More
Next Story