వాట్సప్ లో హాల్ టికెట్ ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో తెలుసా ?
x

వాట్సప్ లో హాల్ టికెట్ ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో తెలుసా ?

పదవతరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్దుల హాల్ టికెట్లను వాట్సప్ లో కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఎస్ఎస్సీ బోర్డు ప్రకటించింది.


తొందరలో 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్ధులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పదవతరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్దుల హాల్ టికెట్లను వాట్సప్ లో కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఎస్ఎస్సీ బోర్డు ప్రకటించింది. మొదటిసారిగా వాట్సప్ లో విద్యార్దుల హాల్ టికెట్లను అందుబాటులోకి తెచ్చినట్లు బోర్డు ఉన్నతాధికారులు చెప్పారు. వాట్సప్ లో హాల్ టికెట్ ను క్యూఆర్ కోడ్ తో డౌన్ లోడ్ చేసుకుంటే అందులోనే పరీక్షల సెంటర్ల వివరాలు, పరీక్షల సమయం కూడా ఉంటుందని చెప్పారు. తాజా డెవలప్మెంట్ కారణంగా హాల్ టికెట్ల కోసం విద్యార్ధులు స్కూళ్ళచుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఈనెల 14వ తేదీనుండి ఏప్రిల్ 16వ తేదీవరకు 10వ తరగతి పరీక్షలు జరగబోతున్న విషయం తెలిసిందే.

స్కూళ్ళ ఫీజులను కట్టని విద్యార్ధుల హాల్ టికెట్లను స్కూళ్ళ యాజమాన్యాలు హోల్డులో ఉంచుతున్న విషయం తెలిసిందే. పరీక్షలు రాయాలంటే హాల్ టికెట్ ఉండాల్సిందే. హాల్ టికెట్ కావాలంటే పెండింగ్ స్కూల్ ఫీజును విద్యార్ధి కట్టితీరాలి. ఫీజు కట్టకపోతే యాజమాన్యం హాల్ టికెట్ ఇవ్వదు. ఇందులో ఎవరిది తప్పని చెప్పేందుకు లేదు. ఎందుకంటే ఫీజులు కట్టకపోవటం విద్యార్ధి తప్పు. ఫీజు కట్టలేదని హాల్ టికెట్ ను హోల్డులో ఉంచి విద్యార్ధి భవిష్యత్తును దెబ్బతీయటం యాజమాన్యం తప్పు. ఫీజులు కట్టలేమని తెలిసీ వేలల్లో ఫీజులు వసూళ్ళు చేస్తున్న స్కూళ్ళల్లో పిల్లలను చేర్పిస్తున్న తల్లి, దండ్రులది తప్పు. హాల్ టికెట్లను యాజమాన్యాలు హోల్డులో ఉంచటంతో ప్రతిసారి పరీక్షల ముందు ఈ అంశం పెద్ద వివాదంగా మారుతోంది. ఫీజుల కోసం యాజమాన్యాలు, హాల్ టికెట్ల కోసం విద్యార్ధులు, భవిష్యత్ దెబ్బతింటుందని తల్లి, దండ్రులు ఆందోళన పడటం మామూలైపోయింది. ఈ విషయాలన్నీ గమనించిన బోర్డు విద్యార్ధులకు హాల్ టికెట్లు ఇప్పించటం మీదే దృష్టిపెట్టింది. అందుకనే నేరుగా స్కూళ్ళకు వెళ్ళి మాల్ టికెట్లను తెచ్చుకోవటం కాకుండా వాట్సప్ లో కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చని చెప్పింది.

ఈ పరీక్షలకు 5.30 లక్షల మంది విద్యార్ధులు హాజరవుతున్నారు. ఉదయం 9.30 గంటలకు మొదలయ్యే పరీక్షలు మధ్యాహ్నం 12.30కి పూర్తవుతాయి. 11,674 స్కూళ్ళ నుండి 5.30 లక్షల మంది విద్యార్ధులు పరీక్షలు రాయబోతున్నారు. వీరిలో విద్యార్ధులు 2,68,960 మంది, విద్యార్ధినులు 2,60, 285 మంది ఉన్నారు. వీళ్ళు కాకుండా ప్రైవేటుగా పరీక్షలు రాస్తున్న విద్యార్ధులు మరో 10,512 మంది కూడా ఉన్నారు. వీళ్ళ కోసం అధికారులు 2,676 పరీక్షా కేంద్రాలను సిద్ధంచేశారు. పరీక్షా కేంద్రాలు, హాల్ టికెట్లు, షెడ్యూల్ కు సంబంధించి ఏవైనా సందేహాలుంటే విద్యార్ధులు కంట్రోల్ రూమ్ నెంబర్ 040 23230942కి ఫోన్ చేయవచ్చని బోర్డు అధికారులు ప్రకటించారు.

బోర్డ్ అధికారిక వెబ్ సైట్ WWW.bse.telangana.gov.in నుండి విద్యార్ధులు తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్లలో విద్యార్ధి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, ఫొటో, సంతకం వంటి వివరాల్లో ఏవైనా తప్పులుంటే సవరించుకోవటానికి బోర్డు ఈనెల 12 నుండి 26 వరకు గడువిచ్చింది. స్కూల్ అడ్మిషన్ ఆధారంగా హెడ్ మాస్టర్ల ఆన్ లైన్ లో ఈ సవరణలు చేస్తారని బోర్డు తెలిపింది.

*80969 58096 నంబర్ కు వాట్సప్ ద్వారా హాయ్ అని మెసేజ్ పెట్టాలి. తర్వాత ‘‘SSC Hall Ticket March 2026’’ అని పంపాలి.

*వెంటనే వెల్ కమ్ టు మీ సేవ అని రిప్లై వస్తుంది.

*తర్వాత పైన చెప్పినట్లుగా ఎస్ఎస్ సీ హాల్ టికెట్ మార్చ్ 2026 అని పంపిస్తే ఒక లింక్ వస్తుంది.

* లింక్ ను ఓపెన్ చేసి జిల్లా, మండలం, స్కూలు పేరు ఎంటర్ చేయాలి.

*విద్యార్ధి పేరు, పుట్టిన తేదీ నమోదు చేస్తే హాల్ టికెట్ కనబడుతుంది.

*మొబైల్ లో కనిపించిన హాల్ టికెట్ ను ఇంటర్ నెట్ సెంటర్ లేదా మీసేవా కేంద్రానికి వెళ్ళి ప్రింట్ తీసుకోవచ్చు. లేదా బోర్డు పరీక్షల విభాగం వెబ్ సైట్ నుండి కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చని బోర్డు చెప్పింది.

Read More
Next Story