భారీ సినిమాల రిలీజ్ ముందు ఎందుకు థియేటర్లు ఖాళీ ?
x

భారీ సినిమాల రిలీజ్ ముందు ఎందుకు థియేటర్లు ఖాళీ ?

ట్రేడ్ సీక్రెట్!


సినిమా ట్రేడ్‌లో ఒక సూపర్ క్లాసిక్ ట్రెండ్ ఉంది — పెద్ద చిత్రాలు బాక్సాఫీస్‌ ముందుకు కి రాబోయేటప్పుడు, ముందుగా మార్కెట్ ఒక్కసారిగా స్లోగా, డల్‌గా మారిపోతుంది. భారీ వాహనాలు వచ్చేటప్పుడు రోడ్డు ఖాళీ చేసుకోవడం లాంటిది ఈ పరిస్దితి. ఈ గ్యాప్ లో థియేటర్లు, ప్రేక్షకుల డబ్బులు, ఎమోషన్ అన్ని వదిలిపెట్టి ఎదురుసే సమయం .

ఇది ఓ మైండ్‌సెట్ కూడా — “ఫోకస్ ఎలివేట్ చేసుకోవటానికి, పాథ్ క్లియర్ చేసుకోవటానికి మార్కెట్ లో ఒక చిన్న విరామం అవసరం” అన్నట్లు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే “Before the storm, the calm is the market’s way to recharge its energy.” ఇప్పుడు అదే పరిస్దితి టాలీవుడ్ లో ఈ వారం కనిపిస్తోంది.

వార్ 2, కూలి ఈ పెద్ద సినిమాలు ఆగస్ట్ 14 న అంటే వచ్చే వారం పోటాపోటీగా థియేటర్స్ లో దిగుతున్నాయి. పెద్ద సినిమాలు అంటే భారీ ఇన్వెస్ట్‌మెంట్ — బడ్జెట్, ప్రమోషన్, హైప్. అందుకే, ఆ సినిమా కోసం ప్రేక్షకులు, థియేటర్ యజమానులు కూడా ప్రిపేర్ అవుతూంటారు. ప్రేక్షకులు అయితే మా డబ్బులు,సమయం,, రాబోయే మా పెద్ద సినిమా కోసం నిల్వ పెట్టుకోవాలి అని భావిస్తారు.

ట్రేడ్ బిజినెస్ పరంగా చూస్తే... పెద్ద మూవీలు విడుదలకు ముందు వారం లేదా రెండు వారాలు గ్యాప్ ఉండడం ఒక వ్యూహం కూడా. ఈ గ్యాప్‌లో సినిమాలు రిలీజ్ అయితే అవి మంచి వసూళ్లు తెచ్చుకున్నా , హిట్ అయినా సరే వాటిని పక్కకు పెట్టి పెద్ద సినిమాకి ఇచ్చేయాలి. అందుకే పెద్ద సినిమాల రిలీజ్ కు ముందు వేరే సినిమాలు రిలీజ్ లు పెట్టుకోరు మీడియం సినిమా వాళ్లు. మరీ చిన్న సినిమా వాళ్లే ఆ వారం గ్యాప్ ని తమ సినిమాకు వాడుకోవాలనుకుంటారు. అందుకే ఓ చిన్న సినిమా, డబ్బింగ్ సినిమా మాత్రమే ఈ వారం థియేటర్స్ లోకి వచ్చాయి.

ఏదైమైనా వేసవి తర్వాత హిట్, ఫ్లాఫ్ కు సంభదం లేకుండా గ్యాప్ లేకుండా ప్రతి వారం నాలుగైదు సినిమాలు థియేటర్స్‌లోకి వస్తూనే ఉన్నాయి. హంగామా చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా జూన్, జూలైలో రిలీజ్‌లతో థియేటర్స్ కి చెప్పుకోదగ్గ సినిమాలతో ఫుల్ హడావిడి. కానీ ఆగస్టు 8న పెద్దగా చెప్పుకోదగ్గ సినిమా లేదు.

ఈ వారం కన్నడ సూపర్‌హిట్ Su From So తెలుగు డబ్బింగ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ వంటి పెద్ద బ్యానర్ రెండు రాష్ట్రాల్లో భారీగా రిలీజ్ చేసినా, ఓపెనింగ్ రెస్పాన్స్ లేదు. అలాగే చిన్న సినిమా ‘బకాసుర రెస్టారెంట్’ ఈ శుక్రవారం రిలీజ్ అయ్యింది. దాంతో ఈ వీకెండ్ మొత్తానికి మార్కెట్ వైబ్ డల్ గానే ఉంది.

ఈ క్రమంలో ఈ వీకెండ్ కింగ్ మాత్రం మహావతార్ నరసింహ అని చెప్పాలి. ఏపీ, తెలంగాణలో శుక్రవారం సెలవు కావడంతో, "హాలిడే అడ్వాంటేజ్‌తో కలెక్షన్స్ బూస్ట్ అవుతాయి" అనేది ట్రేడ్ టాక్.

దాంతో విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ కూడా డీసెంట్ రేంజ్ నంబర్స్ తెచ్చే అవకాశం ఉంది. మరోవైపు మహేష్ బాబు క్లాసిక్ ‘అతడు’ రేపు రీ-రిలీజ్ అవుతుంది. అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే ఉన్నాయి కాబట్టి, రేపు థియేటర్స్‌లో మంచి గిరాకీ కనపడచ్చు.

అయితే… నెక్స్ట్ వీక్ బాక్సాఫీస్ బూమ్ ఖాయం! రజినీకాంత్ ‘కూలీ’ మరియు ఎన్‌టీఆర్ ‘వార్ 2’ ఒకేసారి వచ్చేస్తున్నాయి. ఓపెనింగ్ కలెక్షన్స్‌పై కౌంటర్స్ దగ్గర ఫుల్ ఫైర్ వర్క్స్ గ్యారెంటీ!

Read More
Next Story