“అఖండ 2” రిలీజ్ ఆపేయటం వెనక షాకింగ్ రీజన్?
x

“అఖండ 2” రిలీజ్ ఆపేయటం వెనక షాకింగ్ రీజన్?

“దూకుడు” సినిమా అప్పు వల్లేనా!


బాలకృష్ణ (Balakrishna)- బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబోలో రూపొందిన తాజా చిత్రం ‘అఖండ 2’ (Akhanda 2) వాయిదా పడటం అభిమానులకే కాక సినిమా ప్రేమికులకు కూడా షాక్ ఇచ్చింది. ఈ సినిమా విడుదలపై నిన్నటి నుంచి సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సమస్యల్లో చిక్కుకున్నట్లు వార్తలొచ్చాయి. గురువారం రాత్రి ప్లాన్‌ చేసిన ప్రీమియర్స్‌ను చిత్ర టీమ్ రద్దు చేయడంతో.. ఆ వార్తలు నిజమే అని తేలింది. తాజాగా చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్‌ ప్లస్‌ ప్రకటించింది. షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 5న థియేటర్లలో ఈ చిత్రం విడుదల కావాల్సిఉంది.

ఈ మేరకు 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థ ఎక్స్‌ వేదికగా పోస్టు చేసింది. ‘‘అనివార్య కారణాల వల్ల ‘అఖండ 2’ షెడ్యూల్‌ ప్రకారం విడుదల కావడం లేదు. ఈ విషయం పట్ల చింతిస్తున్నాం. ఈ క్షణం మాకు చాలా బాధాకరమైనది. ప్రతి అభిమాని, సినీ ప్రేమికుడికి ఇది కలిగించే నిరాశను మేము అర్థం చేసుకుంటాము. ఈ విషయాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాము. ఈ నిర్ణయం పట్ల కలిగిన అసౌకర్యానికి మా హృదయపూర్వక క్షమాపణలు. ఈ సమయంలో మీ మద్దతు మాకు చాలా అవసరం. అతి త్వరలో సానుకూల నిర్ణయంతో మీ ముందుకు వస్తాం’’ అని నిర్మాణ సంస్థ పేర్కొంది.
10 ఏళ్ల క్రితం మొదలైన గొడవ ఇప్పుడు ఒక్కసారిగా బాలయ్య సినిమా విడుదలను అడ్డుకుంది. అసలేం జరిగిందో చూద్దాం.
అసలు సమస్య “దూకుడు” దగ్గర ప్రారంభం
2015లో Eros International మరియు 14 Reels Entertainment మధ్య పెద్ద ఫైనాన్షియల్ డీల్ జరిగింది. తర్వాత పేమెంట్లు, టైటిల్ డాక్యుమెంట్లు, ఒప్పందాలు అన్నీ తారుమారు అయ్యాయి. వెంటనే అర్బిట్రేషన్.
2019లో తీర్పు:

₹11.23 కోట్లు (ఇంటరెస్ట్‌తో) చెల్లించాలి
“దూకుడు” టైటిల్ డాక్యుమెంట్లు అందజేయాలి
అప్పు క్లియర్ అయ్యే వరకు కొత్త సినిమాలు డీల్ చేయొద్దు
14 Reels కోర్ట్ లో ఛాలెంజ్ చేసింది –
హై కోర్టు → డివిజన్ బెంచ్→ సుప్రీం కోర్ట్
అన్ని చోట్ల ఓడిపోయింది.
అంతిమ తీర్పు: 6 Aug 2021
డబ్బు మాత్రం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు.
నాలుగేళ్లు నిశ్శబ్దం
2021 నుండి 2025 వరకు Eros ఎలాంటి అమలు చర్యలు చేయలేదు. ఈ డిలే తో కోర్టులో విపరీతంగా మైనస్ అయ్యింది.
2025లో షాకింగ్ ట్విస్ట్: Akhanda 2 రిలీజ్ ఆగస్ట్ 2025లో Eros తెలుసుకుంది:
“అఖండ 2” రిలీజ్ అవుతోంది. కానీ 14 Reels Entertainment ద్వారా కాదు. కొత్త సంస్థ: 14 Reels Plus LLP
Eros అనుమానం:
ఇదంతా డబ్బు తప్పించుకోవడానికి ప్లాన్
కుటుంబ సభ్యులే నియంత్రణ
“ఆల్టర్ ఈగో కంపెనీ”
Eros వెంటనే కేసులు పెట్టింది:
Section 9 పిటిషన్లు
Akhanda 2 రిలీజ్ బ్లాక్ చేయండి
₹11.23 కోట్లు ముందు చెల్లిస్తేనే విడుదల
కోర్టులో రెండు వైపుల మాటలు
Eros:
మా డబ్బు చెల్లించలేదు
LLP అనేది façade/alter ego
రిలీజ్ ఆపకపోతే మా రికవరీ అసాధ్యం
14 Reels:
4 ఏళ్లు మీరు ఏమీ చేయలేదు
ఇప్పుడు Section 9 కుదరదు
అమలు మాత్రం ఎగ్జిక్యూషన్ కోర్ట్‌లోనే
14 Reels Plus LLP:
మేము అప్పటి ఒప్పందంలో పార్టీ మి కాదు
మా రిలీజును బ్లాక్ చేయడం అన్యాయం
సాక్ష్యాలు కూడా లేదు
తీర్పు: Single Judge (30 Oct 2025)
పిటిషన్ డిస్మిస్
Section 9 misuse
LLP alter ego అని నిరూపణ లేదు
అఖండ 2 రిలీజ్‌కి గ్రీన్ సిగ్నల్
అసలు బాంబ్: Division Bench (3 Dec 2025)
Appeal లో కంప్లీట్ రివర్స్!
'అఖండ 2' విడుదలపై ఎరోస్ స్టే కోరగా... 14 రీల్స్ ప్లస్ సంస్థపై తీసిన సినిమా అని నిర్మాతలు కోర్టుకు తెలిపారు. అయితే... 14 రీల్స్, 14 రీల్స్ ప్లస్ వేర్వేరు కాదని, రెండు సంస్థల్లో భాగస్వాములు రామ్ ఆచంట, గోపి ఆచంట అని ప్రూవ్ చేయడంలో ఎరోస్ సక్సెస్ అయ్యింది.
Single Judge ఆర్డర్ రద్దు
కేసు మళ్లీ విచారణకు
భారీ ఇంజంక్షన్ ఆర్డర్:
₹11.23 కోట్లు వడ్డితో సహా పూర్తిగా చెల్లిస్తేనే రిలీజ్. దాంతో దాదాపు 28 కోట్ల రూపాయలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఇప్పుడు ఆ డబ్బులు కట్టడంతో పాటు లోకల్ ఫైనాన్షియర్లకు సెటిల్ చేస్తే సినిమా విడుదల అవుతుంది.
అప్పటివరకు అఖండ 2 - స్టాప్!
ఇప్పుడు పరిస్థితి
సినిమా సమస్య కాదు. “దూకుడు” అప్పు సమస్య
“అఖండ 2” ఆదాయంతో అప్పు రికవరీ చాన్స్ ఉన్నా కోర్టు రిలీజ్‌ను క్లియర్‌గా బ్లాక్ చేసింది, ముందు సెటిల్ చేసుకోమని చెప్పింది. అలా “అఖండ 2” రిలీజ్ ఆగింది ... దూకుడు అప్పు వల్ల!


Read More
Next Story