పన్ను ఎగ్గొట్టి.. 600 కోట్ల పెనాల్టీ
x
shakira, pop singer

పన్ను ఎగ్గొట్టి.. 600 కోట్ల పెనాల్టీ

వక.. వక అంటూ ప్రపంచాన్ని తన పాప్ సంగీతంతో ఒక ఊపు ఊపిన ప్రముఖ కొలంబియన్ గాయని షకీరా(SHAKIRA) భారీ మొత్తంలో పెనాల్టీ చెల్లించింది. చాలాకాలంగా స్పెయిన్(SPAIN) లో నివాసం ఉంటున్న ఈ గాయని, స్థానిక పన్ను చట్టాలను ఉల్లఘించిందని ప్రభుత్వం గుర్తించి కేసు పెట్టింది.


ఇది షకీరా పై ప్రభుత్వం పెట్టిన రెండో కేసు కావడం గమనార్హం. ప్రస్తుతం 2018 సంవత్సరం నాటి ఆదాయాలను తక్కువ చేసి చూపించి ఆ మొత్తాలను ట్యాక్స్ ఫ్రీ దేశాలకు షకీరా మళ్లించిందని స్థానిక పత్రికలు వార్తలు ప్రచురించాయి. దీనిపై ప్రభుత్వం కేసు నమోదు చేసింది. అయితే ఈ వివాదానికి షకీరా రూ. 6.6 మిలియన్ యూరోలు(MILLION EUUROS) మన దేశంలో అయితే రూ. 601 కోట్లు పెనాల్టీగా చెల్లించడానికి ఒప్పుకుందని ఆమె ప్రతినిధి వెల్లడించారు.

ఇంతకుముందు కూడా 2012-14 నాటి కేసులో ఆమె తన ఆదాయానికి సంబంధించి సరిగా పన్ను చెల్లించలేదని అంగీకరించింది. అందుకు గాను దాదాపు రూ. 7.3 మిలియన్ యూరోలు చెల్లించింది. ఇది ఆమె సంపాదించిన ఆదాయంలో సగం కావడం గమనార్హం. మొదట ప్రాసిక్యూషన్ వాదనలను షకీరా తిరస్కరించిన, తరువాత తన పిల్లల శ్రేయస్సు దృష్ట్యా కేసును సామరస్యంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించుకుందని ఆమె వ్యక్తిగత ప్రతినిధి వివరించారు.

Read More
Next Story