'నేను, మీ బ్రహ్మనందం'- ఓ అభిమాని అనుభవం అంతే !
పుస్తకాల మీద నిర్మొహమాటంగా మాట్లాడటం కష్టం. అందునా రాసిన వ్యక్తి సెలెబ్రిటీ అయితే మరీ కష్టం. అయితే, బ్రహ్మానందం పుస్తకం మీద ఒక ఫ్యాన్ ఏమంటున్నాడో చూడండి
--శ్రీరాం. సి
అమ్మ చేతి వంట రుచులు అలంకారం, ముద్దలు చేసి పెట్టడమే అసలు అమితానందం. వరం. భాగ్యం. అలాగే కళాకారుల అభిమాని మాటలు ఊహలు కావు, ఆ ముగ్దుల్ని చేసే భావాలకు ప్రతీక దాటి వారు ఉంటూ, ప్రేక్షకుడికి దొరికిన ప్రతిఫలం మించిన అనుభూతితో వీరు.అమ్మ వంట రుచి లాగా, కళాకారుడి విస్తృతికి కొలమానం లేదు, ఉంటే 'ముద్ద' ఒక్కటే.
నేను చిన్నప్పటి నుండి ఆటోబయోగ్రఫీలు పెద్దగా చదవలేదు. అందుకు కారణాలు అనేకం. తెలిసిన వ్యక్తి అయినందుకో ఏమో తెలియదు, ముఖ్యంగా మొదలెట్టినప్పుడు నుండి ఆయన వీరుడు, సూరుడు, ధీరుడు అని ఊదరగొట్టి విసుగు పుట్టించేవి.ఇంక చదివేదేముంది, చివరగా తెలుసుకొనవల్సింది ముందే తెలియజేస్తే, ఇక పాఠకుడి అనుభూతికి పాతరేసినట్టేగా అని అనిపించడం. కానీ కొన్ని ప్రత్యేకం గాను అనిపించాయి, చదివించాయి ,నాతొ ఉండిపోయాయి, అణుడిలోని కొందరి పేర్లు మహాత్మా గాంధీ, చార్లీ చాప్లిన్, సిడ్నీ షెల్డన్, శ్రీ శ్రీ, శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి, తిరుమల రామచంద్ర, గొల్లపూడి మారుతీ రావు, వంశీ, Bill Buford, Anthony Bourdain, రాఘవ శర్మ, అవధానం రఘు కుమార్, ముక్కామల చక్రధర్ ఇంకొందరు ఉన్నారు.
ఇప్పుడు 'నేను' మీ బ్రహ్మానందం,అంటూ బ్రహ్మానందం గారు తన డైరీలో కొన్ని మాటలు, సంగతులు పంచుకునేందుకు మన ముందుకు పుస్తకంలో వచ్చారు.ఇంత వరకు మీరు చూసింది ఒక వైపు, ఇందులో ఇంకో వైపు అంటూ చెప్పుకొచ్చారు.నేను అందరిలాగానే ఆయన పోషించిన పాత్రలకు, మానరిజాలకు అభిమానినే. ఆయన అభినయాని కన్నా ఆయనకు సాహిత్యం పై వున్న అవగాహన నన్ను ఆయనకు దగ్గర చేర్చింది. తెలుగు భాషాభిమానిగా, వక్తగా కొన్ని తెలుగు సాహిత్య కళా వేదికల పై వారి ప్రసంగం అద్భుతం. ఇదే, ఈ కారణం మూలానే, ఈ పార్శ్యమే నాకు ఈ పుస్తకం అసంతృప్తి మిగిల్చింది, కోపం వచ్చింది, ఇలా రాయాలనిపించింది.
అసంతృప్తి ఎందుకంటే ఆయన చెప్పిన సాధారణ వ్యక్తి జీవితంలోని విషయాలే, కానీ చెప్పిన తీరు ఎందుకా అనిపించాయి. ఆయనలోని విద్వత్తు ఎందుకూ ఉపయోగించకపోవడం ఆశ్చర్యమేసింది. జీవితం ఎంతో అనుసునిశితంగా వున్న జీవితం గడిపిన ఆయన ప్రతిభతో పటాపంచలు చేసిన వ్యక్తా అనిపించింది.అతనిలోని కళాకారుడు అనవసరంగా అతి సామాన్య శైలిలో(బహుశా ఎవరన్నా సలహా ఇచ్చారేమే) అక్షరమే కాదు, ఆకట్టుకోవడంలో కూడాను చెప్పిన విషయాలకు మంచి పట్టు లేకుండా ఉండే కథనంతో నన్ను రచనను ఇముడ్చుకోలేక పోయాయి. డైరీలోని విషయాలే అని చెప్పినా, నేను సర్దుకోలేక పోయాను, ఎందుకంటే అవి అన్ని ఒకే రుచిని పోలిన, ఇచ్చే వస్తువులుగా తోచాయి నాకు. ఆయన ఎలా రాసుకున్నా, మనకు చెప్పేటప్పుడు ఆ ప్రతిభను కూడిన ముద్ద పంచుతారని అనుకోవడం నా తప్పే.
ఎందుకో నన్ను ఆయన చెప్పిన నేపథ్యం పెద్దగా ఆకట్టుకోలేదు, పంచుకున్న విశేషాలు నా కంటికింపు అనిపించలేదు, ఆద్యంతం ఆయన జీవితంలో ఎదురొచ్చిన, పొందిన, అక్కున చేర్చుకున్న అవకాశాల గూర్చి ఎక్కువగా ప్రస్తుతించడం జరిగింది. తనను వ్యక్తులు, వారి ద్వారా అనుభవాలను భావగర్భితంగా చెప్పినా ఎందుకో ఇది అయన చేసిన హాఫ్- హార్టెడ్ ప్రయత్నంగా తోచింది. వీటితో పాటు, తాను ఎదుర్కొన్న సంఘర్షణలు, తన వల్ల జరిగిన నష్టాలు, తాను సరిగా సమతుల్యంగా లేని సందర్భాలు, తనలోని లోపాలను సరిదిద్దుకొనే ప్రయత్నాలు, విఫలాలు ఇవి ఏవి ఆయన రాసుకోలేదా, రాసుకున్నా మనతో పంచుకోలేదా అన్నట్టు తోచింది. అదే ఈ రచనకు లోపం.
పెద్ద కుటుంబం, పేదరికం, ఆకలి, దారిద్య్రం,విలువలు, కష్టాలు, దేవుడు, పెళ్లి, పిల్లలు, గురువులు, మిత్రులు, సంసారం, భార్య, పిల్లలు, మేనేజరు, దర్శకులు అని పెద్దగా ఉపన్యాసం ఇవ్వకపోయినా, ఇచ్చినట్టే ఉంది నాకు. ముఖ్యంగా ఆయన కుల ప్రస్తావన తేవడం నన్ను ఆశ్యర్యపరిచింది.ఇంత వరకు ఆయనేంటో నేను ఎప్పుడు ఆలోచించ లేదు. ఇందులోని వ్యక్తులను ఆయన పొగడ్డం తప్ప వేరే ఏమి చెయ్యలేక పోయారు. పోనీ ఆయనలోని ఎక్కువ తక్కువలు, ఆయన పై వచ్చిన విమర్శలను, ఆయన అధిగమించలేని అలవాట్లను ఏవి పెద్దగా ప్రస్తావించనే లేదు. ఇందులో నాకు నచ్చినది త్రివిక్రమ్ శ్రీనివాస్ చేత ఏమి రాయించలేదు. బతికిపోయాం.
పేజీలు తిప్పుతుంటే, ఎక్కడా బ్రమహానందం రాసినట్టు అనిపించలేదు ,అక్కడడక్కడా పొందుపర్చిన ఫోటోలు ఏమి విలువను ఆపాదించవు. వాటి బదులు ప్రతి కథకు ఓ పెయింటింగ్ వేసుంటే బాగుండేది. స్వయంకృషి, తీక్షణత, పట్టుదల,ప్రయత్నం మొదలుగునవి వారి మైలు రాళ్లు, పాకుడు రాళ్ళూ, పునాది రాళ్లు, అవన్నీ వాడుకొని చిరస్మరణీయమైన పూర్తీ స్థాయి తెలుగువాడి రహదారి లాంటి రచన చేస్తారని నమ్ముతున్నాను. ఈ పుస్తకం అలాంటి రచన వస్తుందని నాలోని అభిమాని కాపాడుకొనేందుకు కొని వేచి చూస్తున్నటువంటిది, వేచి చూస్తుంటాను కూడా.
(రామ్ కిషో ర్ సి. ముందుగా బిజినెస్ మేనేజ్ మెంట్ స్ట్రాటజిస్టు. ఈ రంగం మీద ఎన్ని వ్యాసాలు రాశారో. అంతకంటే ముందు, ఆయనను సాహిత్యం, సినిమా మీద బాగా పట్టున్న మనిషిగా పరిచయం చేయాలి. పూర్తి పరిచయం మరొకసారి ఎపుడైన.)
Next Story