కోడీ కోడీ వన్నేలాడీ..  నువ్వోడితే నే ఇల్లూ వాకిలి అమ్ముకుంటా..
x
cockfights

కోడీ కోడీ వన్నేలాడీ.. నువ్వోడితే నే ఇల్లూ వాకిలి అమ్ముకుంటా..

కోడీ కోడీ వన్నేలాడీ కోరుకున్న పువ్వూబోడీ..నేడీ పందెం నువ్వూ కొడితేనూ నీ కాళ్ళకు గజ్జెలు మువ్వలు కడతా..నిన్నే రాణిగ చూసుకుంటా.. లేకుంటే..


సంక్రాంతికి మనకు గుర్తొచ్చే నాలుగైదిట్లో కోడి పందాలు ఒకటి. అక్కడ బర్లు, ఇక్కడ కోళ్లు, అక్కడ కోట్లు వంటి అనేకానేక వార్తలనేకం వింటాం, కంటాం. 32 అంగుళాల టీవీల్లో చూసి అబ్బా.. మనం మిస్ అవుతున్నామే అనుకునేంతగా ఇదై పోతాం. అయితే ఈ పందెపు కోళ్లపై అప్పుడెప్పుడో ప్రముఖ కవి, గాయకుడు పాలగుమ్మి విశ్వనాథం ఓ అద్భుత పద్యాన్ని గానం చేశారు. పుంజుకు కత్తి కట్టే వారి పరిస్థితి, మానసిక స్థితి ఎంతగా ఉంటదో పాడి చూపించారు. అదెంత గొప్పగా ఉందంటే..

(కోడీ కోడీ వన్నేలాడీ కోరుకున్న పువ్వూబోడీ)

గానం..పాలగుమ్మి విశ్వనాథం

నేడీ పందెం నువ్వూ కొడితేనూ

నీ కాళ్ళకు గజ్జెలు మువ్వలు కడతా

నిన్నే రాణిగ చూసుకుంటా

నీతో జంటగ ఆడుకుంటా

కోడీ కోడీ వన్నేలాడీ కోరుకున్న పువ్వూబోడీ

నువ్వీ పందెం ఓడిపోతేనూ..

నేడీ పందెం ఓడిపోతేనూ

నీతో నేస్తం వదులుకుంటా

తిండిపెట్టకా పండుకుంటా

నిన్నేకూరగ వండుకుతింటా

కోడీ కోడీ వన్నేలాడీ కోరుకున్న పువ్వూబోడీ

నేడీ పందెం నువ్వూ కొడితేనూ

నీ మెళ్ళో కాసుల పేరు పెడతా

బంగారంతో మేడ కడతా

మెడలో నీతో కాపురముంటా

కోడీ కోడీ వన్నేలాడీ కోరుకున్న పువ్వూబోడీ

నేడీ పందెం ఓడిపోతేనూ

నువ్వీ పందెం ఓడిపోతేనూ

ఇల్లూ వాకిలి అమ్ముకుంటా

వీధీ వీధీ అడుక్కుతింటా

మత్తుగ తాగీ పండుకుంటా

కోడీ కోడీ వన్నేలాడీ కోరుకున్న పువ్వూబోడీ

నేడీ పందెం నువ్వూ కొడితేనూ

వేడీ వేడీ పకోడి పెడతా

చేగోణీలా దండకడతా

ఊరి మధ్యనా గుడి కడతా

గుళ్ళో నిన్నూ కూచోపెడతా

(కోడీ కోడీ వన్నేలాడీ కోరుకున్న పువ్వూబోడీ)

Read More
Next Story