SSMB 29: రాజమౌళి సినిమాలో మహేష్ బాబు లుక్ ఇదే,  వైరల్‌
x

SSMB 29: రాజమౌళి సినిమాలో మహేష్ బాబు లుక్ ఇదే, వైరల్‌

రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రూపొందుతున్న చిత్రం గురించి ఏ వార్త లేదా ఫోటో వచ్చినా వైరల్ అయిపోతుంది.

రాజమౌళి(Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కాంబోలో రూపొందుతున్న చిత్రం గురించి ఏ వార్త లేదా ఫోటో వచ్చినా వైరల్ అయిపోతుంది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో మహేష్ ఎలా ఉండబోతున్నాడు, రాజమౌళి ఎలా చూపబోతున్నారనే క్యూరియాసిటీ అభిమానుల్లో బాగా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో అనఫిషియల్ ఫస్ట్ లుక్ లాంటి ఓ ఫోటో బయటకు వచ్చి అభిమానులకు పండగ వాతావరణం క్రియేట్ చేస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా ఉండే కొన్ని అద్భుతమైన లొకేషన్స్ లో ఈ సినిమా ప్లాన్ చేసారు రాజమౌళి. పూర్తిగా అటవీ నేపథ్యంలో సాగే ఈ చిత్రం కోసం మహేష్ బాబు లుక్ పరంగా చాలా కష్టపడుతున్నాడు. తన ఫిజిక్ ని,తన హెయిర్ స్టైయిల్ ని మార్చుకున్నారని వార్తలు వచ్చాయి. దీంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు బయటకు వచ్చిన ఈ లుక్ లో మహేష్ బాబు పెద్దగా మారినట్లు కనపడటం లేదు. ఫిజికల్ గా గతంలో ఎలా ఉండేవారో అలాగే కనపడుతున్నారు.

అయితే మొహంలో మాత్రం తేడా కనబడుతుంది. అబ్జర్వ్ చేస్తే గెడ్డం పెంచారు, నీట్ గా ట్రిమ్ చేసి స్టైల్ గా ఉన్నారు. అలాగే లాంగ్ హెయిర్ కనబడుతుంది. ఇదే సినిమాలో కనపడబోయే మహేష్ బాబు లుక్ అని అభిమానులు ఈ ఫొటోలను వైరల్ చేస్తున్నారు.


తాజాగా ‘ఒడిశా(Odisha) షెడ్యూల్ ముగిసింది. మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి సినిమా ఇన్‌డోర్ షూటింగ్ ఎక్కువగా షూట్ చేసారు, ఈ వారం ఒడిశాలోని తూర్పు కనుమల ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంది. అక్కడ షూట్ పూర్తైన సందర్భంగా అక్కడ వాళ్ళు దిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గత కొద్ది రోజులుగా జరిగిన ఈ షూటింగ్ లో మహేష్ బాబు, ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) లపై ప్రధానంగా సీన్స్ షూట్ చేసారు. గత 15 రోజుల నుంచి ఈ సినిమా షూటింగ్ ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో జరుగుతుంది. సిమిలిగుడ సమీపంలోని మాలి, పుట్‌సీల్‌, బాల్డ ప్రాంతాల్లో నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.


మంగళవారం రాత్రి ఒడిశా షెడ్యూల్‌ పూర్తైంది. దీంతో నటీనటులను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. సెట్‌కు చేరుకొని నటీనటులు, ఇతర చిత్ర టీమ్ తో ఫొటోలు దిగారు. పొట్టంగి ఎమ్మెల్యే రామ్‌చంద్ర కడం నేతృత్వంలో పలువురు ప్రజాప్రతినిధులు చిత్ర టీమ్ ని కలిశారు. రాజమౌళి ఇక్కడి ప్రకృతి అందాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, ఇదొక స్వర్గసీమ అని వర్ణించారు. జిల్లా యంత్రాంగం, ప్రజల సహకారం ఎప్పటికీ మరువలేమని కృతజ్ఞతలు తెలిపారు.


ఈమేరకు థాంక్స్‌ నోట్‌ను అధికారులకు అందించారు. బయలుదేరే ముందు హీరో మహేశ్‌ను జిల్లా ఎస్పీ రోహిత్ వర్మ, జయపురం సబ్ కలెక్టర్ సస్య రెడ్డి, ఇతర అధికారులు కలిసి ఫొటోలు దిగారు.


‘SSMB-29’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కీ రోల్ ప్లే చేస్తున్నారు. అలాగే ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్(Vijayendra Prasad) కథ అందించగా.. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్ నారాయణ(KL Narayana) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీకి కీరవాణి(Keeravani) సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

Read More
Next Story