హారర్‌ థ్రిల్లర్‌ శబ్దం రివ్యూ
x

హారర్‌ థ్రిల్లర్‌ 'శబ్దం' రివ్యూ

హర్రర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీని అరివళగన్ వెంకటాచలం తెరకెక్కించారు.

నటుడుగా ఆది పినిశెట్టికు ప్రత్యేకమైన గుర్తింపు మార్కెట్ ఉంది. అయితే ఆయన హీరోగా సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. తాజాగా చాలా గ్యాప్ తర్వాత ఆది 'శబ్దం' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. హర్రర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీని అరివళగన్ వెంకటాచలం తెరకెక్కించారు. లక్ష్మీ మీనన్, సిమ్రాన్, లైలా, రాజీవ్ మీనన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా థ్రిల్లింగ్ అంశాలతో సినిమా పై ఆసక్తిని పెంచింది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది, కథేంటి

స్టోరీ లైన్

ఘోస్ట్ ఇన్వెస్టిగేటర్ వ్యోమ వైద్యలింగం (ఆది పినిశెట్టి) దెయ్యాలకు సంభందించిన మేటర్స్ డీల్ చేస్తూంటాడు. త‌ను మ‌నుషుల‌కు వినిపించని శ‌బ్దాల్ని త‌న వ‌ద్ద ఉన్న సాంకేతిక ప‌రిక‌రాల‌తో వింటూ.. ఆత్మల‌తో మాట్లాడి ఆ కేసుల్ని ప‌రిష్కరిస్తుంటాడు. అతని దగ్గరకు ఓ కేసు రావడంతో కథ ప్రారంభం అవుతుంది. హోలీ ఏంజెల్ కాలేజీలో వరుసగా స్టూడెంట్లు చనిపోతుంటారు. ముఖేష్, శ్వేత అనే స్టూడెంట్ మరణాలతో కాలేజీలో దెయ్యాలు ఉన్నాయనే వార్త బయటకు వస్తుంది. దీంతో కాలేజీ యాజమాన్యం ఈ కేసుని డీల్ చేసేందుకు ఘోస్ట్ ఇన్వెస్టిగేటర్ వ్యోమ వైద్యలింగం ని రంగంలోకి దించుతుంది. వ్యోమ కాలేజీలో అడుగు పెట్టి అసలు విషయాన్ని కనిపెట్టే ప్రయత్నం చేస్తాడు.

మరో ప్రక్క అదే కాలేజీలో అవంతిక (లక్ష్మీ మీనన్) అసలు ఈ దెయ్యాలు, ఆత్మలు అనేవి లేవనే థీసిస్ చేస్తుంటుంది. కానీ అవంతిక ప్రవర్తనలో ఏదో తేడాను వ్యోమ కనిపెడతాడు. ఆ కాలేజీలోని సెంట్రల్ లైబ్రరీలోనే అవంతిక‌పై ఓ ప్రయోగం చేస్తూండగా .. అక్కడ 42 ఆత్మలు ఉన్నట్లు అత‌ను క‌నిపెడ‌తాడు. మరో ప్రక్క ఈ క్రమంలోనే దీపిక అనే మరో అమ్మాయి కూడా మరణిస్తుంది.

మరి ఆత్మలుగా మారిన ఆ 42 మంది ఎవ‌రు? వాళ్లకు కాలేజీలో జ‌రుగుతున్న చావుల‌కు.. అవంతిక‌కు ఉన్న సంబంధం ఏంటి? అస‌లు ఆ లైబ్రరీలో ఒక‌ప్పుడు ఏం జ‌రిగింది? ఈ క‌థ‌కు ఆ కాలేజీ మాజీ ఛైర్మన్ డాక్ట‌ర్ డ‌యానా (సిమ్రన్‌)కు ఉన్న సంభందం ఏమిటి? నాన్సీ డేనియ‌ల్ (లైలా) పాత్రకున్న ప్రాధాన్యమేంటి? ఆ కాలేజ్‌లో ఏం జరిగింది? ఈ కథలో డయానా (సిమ్రాన్), డేనియల్, న్యాన్సీ డేనియల్ (లైలా) పాత్రల ప్రాధాన్యం ఏంటి? అన్నదే కథ.

విశ్లేషణ

ఈ కథని దర్శకుడు రెండు పాయింట్స్ ఆధారంగా రూపొందించారు. చరిత్రంలో ధ్వనిని ఓ ఆయుధంలా యుద్ధాల్లో వినియోగించిన విశేషాలు ఉన్నాయి. అలాగే శ‌బ్దం నుంచి పుట్టే సంగీతంతో కొన్నిర‌కాల జ‌బ్బుల‌కు చికిత్స చేయ‌డాన్ని వైద్య రంగంలో వినియోగిస్తున్నారు. ఈ రెండు కోణాల నుంచే దర్శకుడు ఈ శ‌బ్దం క‌థ అల్లుకున్నారు. వాటికి దెయ్యాలు, ఆత్మలను ముడిపెట్టారు. అంతవరకూ ఇంట్రెస్టింగ్ విషమే. అయితే ఇలాంటి కథలను ఎంత ఇంట్రెస్టింగ్ చెప్పారనేదే అసలైన పాయింట్. శబ్దంను హార‌ర్ థ్రిల్ల‌ర్‌ గా మార్చాలన్న స్టోరీ ఐడియా దాకా బాగానే ఉంది.

అయితే హార‌ర్ థ్రిల్లర్స్‌లో ఇన్వెస్టిగేష‌న్ ప్రాసెస్ ని కొత్త గా చెప్పలేకపోయారు. హీరో ఇన్విస్టిగేషన్ ఇంట్రెస్టింగ్ గానే సాగుతుంది (Sabdham Movie Review). ఫస్టాఫ్ అంతా ఏదో జరుగుతుంది అన్ని యాంగిల్ లో వర్కవుట్ చేశారు. ప్రీ ఇంట‌ర్వెల్‌కు ముందొచ్చే కొన్ని హార‌ర్ సీక్వెన్స్‌లు బాగా డిజైన్ చేసారు. కానీ సెకండాఫ్ కు వచ్చేసరికి వివరణ ఎక్కువైపోయింది.

42 ఆత్మల ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ ,ఆత్మలకు శబ్దానికి ఉన్న లింక్ , ఆ తర్వాత వచ్చే వివరణలలో అనాథ‌లు, గ‌బ్బిలాలు, మ్యూజిక్ థెర‌పీ, బ్లాక్ మ్యాజిక్‌ అంటూ అనేక విషయాలు ఒకసారి చెప్పి గందరగోళపరిచాడు. దాంతో అక్కడ దాకా జరిగిన కథ దారి తప్పింది. దానికి తోడు ఏదో ఉంటుంది అనుకున్న ఫైనల్ ట్విస్ట్ థ్రిల్లింగ్ గా లేదు. అయితే ఈ సినిమాలో ఒకే ఒక కొత్త ఎలిమెంట్ ఆత్మ‌లు శ‌బ్ధాన్ని వాహిక‌గా తీసుకోవ‌డం బాగుంది. కానీ భ‌యం పుట్టించలేకపోయారు.

టెక్నికల్ గా

ఈ సినిమా టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ లోనే ఉంది. శ‌బ్దం నేప‌థ్యంలో వ‌చ్చే సీన్స్ ప్రేక్షకుల్ని భ‌య‌పెట్టేలాగే ఉంటుంది. ఈ విష‌యంలో త‌మ‌న్ ని మెచ్చుకోవాలి. అలాగే సౌండ్ డిజైనింగ్ బాగా వర్కవుట్ చేసారు. కెమెరా వ‌ర్క్ చాలా చ‌క్క‌గా వుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నతంగా ఉన్నాయి.

నటుడుగా ఆది పినిశెట్టి ఎప్పుడూ నిరాశపరచడు. ఈ సినిమాలోనూ చక్కగా చేసుకుంటూ పోయారు. అలాగే కథకు కీలకమైన సిమ్రాన్, లైలా పాత్రలు ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారు. ల‌క్ష్మీ మీన‌న్‌ది కూడా రెగ్యుల‌ర్ హీరోయిన్‌ పాత్ర కాకపోవటం ప్లస్ అయ్యింది.

చూడచ్చా

హారర్‌ థ్రిల్లర్‌ ని చూడటం ఆసక్తి ఉంటే ఓ లుక్కేయవచ్చు. కొన్ని చోట్ల భయపడచ్చు, మరికొన్ని చోట్ల నవ్వుకోవచ్చు.

Read More
Next Story