
ఆరుపదుల వయస్సులోనూ ‘ఫర్ ఫెక్షనిస్టే’
సినిమాలకు వయస్సు అడ్డంకి కాదంటున్న ఆమీర్ ఖాన్
నవైద్ అంజుమ్
బాలీవుడ్ ఒక చదరంగ బోర్డు అనుకుంటే అందులో కిరీటం లేని రాజు ఆమీర్ ఖాన్. మార్చి 14 తో బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ 60 వ ఏట అడుగుపెట్టాడు. సినిమా చదరంగంలో అతను అనేక అనూహ్య ఎత్తుగడలు వేస్తూ చురుకుగా, నెమ్మదిగా కదులుతూ తన సత్తాను ప్రదర్శిస్తూ వస్తున్నాడు.
బాలీవుడ్ ను 90 వ దశకం నుంచి ఖాన్ లు ఏలడం ప్రారంభించారు. ఈ సమూహంలో ఆమిర్ చిత్రమైన, విరుద్దమైన స్థానాన్ని ఆక్రమించాడని చెప్పవచ్చు.
షారుక్ ఖాన్ రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకోగా, సల్మాన్ కండలవీరుడిగా యాక్షన్ సినిమాలకే కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. సైఫ్ అలీఖాన్ స్టైలిష్ మేన్ గా, పట్టణ ప్రాంత వ్యక్తిగా, ఎప్పుడూ చిరునవ్వుతో కనిపిస్తాడు.
వీరికి భిన్నంగా ఆమిర్ ఏ వ్యక్తిత్వానికి స్టిక్ కాలేదు. సినిమా పూర్తి అయ్యాక పర్వతాలలో కొన్ని రోజులు ప్రశాంతంగా ఉంటాడు. తరువాత ఆకస్మాత్తుగా అదృశ్యమై తిరిగి కొత్త ఎనర్జీతో తిరిగి వస్తాడు.
తన 60 వ పుట్టిన రోజు సందర్భంగా ఆమీర్ ప్రెస్ పెట్టాడు. తన రెండో పెళ్లి విఫలమైన తరువాత బెంగళూర్ కు చెందిన ఓ మహిళను వివాహం చేసుకుంటున్నానని చెప్పారు.
తనతో రెండు దశాబ్ధాలుగా అనుబంధం ఉందని, ఇప్పుడు తన ప్రేమ భాగస్వామిగా మారిందని చెప్పారు. అయితే జర్నలిస్టులు తన ఫొటోలు తీసుకొవద్దని, తన ప్రైవసీని గౌరవించాలని కోరారు.
మళ్లీ పెళ్లి చేసుకుంటారా? అని అడినప్పుడూ ఆమిర్ ఇలా అన్నారు. ‘‘ముష్కిల్ లగ్ రహా హై (కష్టంగా అనిపిస్తుంది). నా జీవితంలో ఇప్పుడు చాలా సంబంధాలు ఉన్నాయి. నా కుటుంబం, నా పిల్లలతో సంతోషంగా ఉన్నాను. నా దగ్గర ఉన్న వ్యక్తులతో ఉండటం నాకు సంతోషంగా ఉంది’’ అని ఆమిర్ ఖాన్ అన్నారు.
పరిచయం.. పెళ్లి.. విడాకులు..
2002 లో తన మొదటి భార్య రీనాతో విడాకులు తీసుకున్నారు. అయినప్పటికీ తనతో స్నేహం కొనసాగించాడు ఆమిర్ ఖాన్. తన బ్లాక్ బస్టర్ మూవీ ‘లగాన్’ కు తనే నిర్మాతగా వ్యవహరించింది.
ఈ సినిమా సమయంలోనే కిరణ్ రావు పరిచయం అయింది. తరువాత వీరు వివాహం చేసుకున్నారు. 2021 లో వీరు కూడా విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం వీరు కూడా స్నేహితులుగానే ఉన్నారు. వీరికి ఉన్న సంతానం ఆజాద్ కు తల్లిదండ్రులుగా వ్యవహరిస్తూనే పానీ పౌండేషన్ నడుపుతున్నారు.
ఇప్పుడు 60 సంవత్సరాల వయస్సులో ఆయన మరోసారి కొత్త జీవితం ప్రారంభించడానికి సిద్దంగా ఉన్నారు. డిజైన్, ఫ్యాషన్ నిపుణురాలు గౌరీతో బంధం వేసుకోవడానికి ఆయన సిద్దంగా ఉన్నారు. ఇప్పుడు ఆమె ఆమీర్ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్నారు.
ఇంతకుముందు దంగల్ సహనటి ఫాతిమా సనా షేక్ తో తన బంధం కొనసాగించడానికి సిద్దపడుతున్నాడని రుమర్లు వచ్చాయి. అయితే ఆమీర్ తన పాత్రలతోనే కాదు.. బంధాలు ఎంచుకోవడంలోనూ ఆయన చాలామందిని ఆశ్చర్యపరిచాడు. అయితే అతను పాశ్చాత్య సంస్కృతిలో మునిగిపోయేవాడు కాదు.
సినిమాల్లోని పద్దతి..
ఈ ప్రెస్ మీట్ లోనే ఆమీర్ తన సినిమాను కూడా ప్రకటించాడు. 2007 లో తాను నటించిన ‘తారే జమీన్ పర్’ చిత్రానికి సీక్వెల్ అయిన ‘సితారే జమీన్ పర్’ గురించి మాట్లాడారు. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ లోపలే విడుదల చేస్తామని చెప్పారు.
ఈ సినిమా కూడా స్పానిష్ సినిమాకు రీమేక్. ఇది 2018 లో స్పెయిన్ వచ్చిన ‘ఛాంపియన్’ సినిమా ఆధారంగా రూపొందించారు. స్పోర్ట్స్ నేపథ్యంలో సినిమా రానుంది. ఇందులో ఆమీర్ కు జోడీగా జెనిలియా డిసౌజా దేశ్ ముఖ్ నటించనున్నారు.
రెండు దశాబ్దాల కింద వచ్చిన తారే జమిన్ ఫర్ మానసికంగా ఎదగని పిల్లల పరివర్తన, వారి ఆలోచన పరిజ్ఞానం, తల్లిదండ్రుల పెంపకం, బోధన, భావోద్వేగ నిర్లక్ష్యం పై ప్రశ్నలు సంధించింది. ప్రస్తుతం సితారే జమిన్ ఫర్ మరో పది అడుగులు ముందుకు వేస్తుందని చెప్పారు.
అలాగే రాజ్ కుమార్ సంతోషి తీసిన ‘అందాజ్ అప్నా అప్నా’ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. 1994 లో వచ్చిన ఈ కల్ట్ కామెడీకి అందులో ఆయన అమర్ అనే మంత్రగాడి పాత్రను పోషించాడు. ఈ సూపర్ హిట్ సినిమా ఇప్పటికే తరతరాలుగా అందరికీ వారి జ్ఞాపకాల్లో ఓ మధుర స్వప్నంగా ఉంది.
ఇప్పటి పంచ్ కామెడీల కాలంలో ఆమీర్ మరోసారి ఛాలెంజింగ్ రోల్ ను స్వీకరించాలి. ఈ సంవత్సరం జూన్ లో సంతోషి దర్శకత్వం వహించిన, సన్నీ డియోల్, ప్రీతీ జింటా నటించిన విభజన యుగం నాటి డ్రామా సినిమాలో కూడా ఆయన కనిపిస్తారు. ఈ సినిమా సుదీర్ఘకాలం తరువాత మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
పరిపూర్ణత కోసం..
ఆమీర్ పరిపూర్ణత అనేది.. పెద్ద చరిత్ర.. సినిమా కోసం ఎంతటి రిస్క్ అయినా తీసుకుంటాడు. అశుతోశ్ గోవారికర్ దర్శకత్వం లో వచ్చిన ‘లగాన్’ సినిమా క్రికెట్ స్వింగ్ తగినంత డ్రామాగా లేదని, సినిమాలోని చాలా భాగాలను మరోసారి రీషూట్ చేయించాడు.
రంగ్ దే బసంతి సినిమాను చూసిన కొంతమంది అతని సినిమా ప్రేక్షకులు నెగెటివ్ గా చెప్పడంతో వెంటనే దాని క్లైమాక్స్ ను మార్చేశాడు. బాల నటుడి కోసం 300 సార్లు ఆడిషన్ నిర్వహించాడు.
అతను రెండు వైపులా పదును ఉన్న కత్తిలా ఉంటాడు. సమస్యలను పరిష్కరిస్తాడు. కథలు రాస్తాడు.. పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే సమకూరుస్తాడు.
స్టార్ డమ్ కు విరుద్దం..
ఇతర ఖాన్ లకు.. ఆమీర్ కు స్పష్టమైన వ్యత్యాసం ఏంటంటే.. స్టార్ డమ్ ప్రలోభాలను పట్టించుకోకుండా, వాటి మాయాలో పడిపోకుండా ఉండటం. ది బెస్ట్ అవుట్ పుట్ రావడానికి ఇదొక కారణం.
కథ.. కథనాలపై పూర్తి దృష్టి పెట్టి సెలెక్టివ్ సినిమాలతో ప్రజల దృష్టిని ఆకర్షించాడు. తన ఇమేజ్ పెంచుకోవడానికే కాకుండా ప్రజలను చైతన్యం చేయడానికే ప్రయత్నించాడు. అందులో భాగంగా వచ్చిన సినిమానే ‘పీకే’.. దీనిపై విమర్శలు వ్యక్తం అయినప్పటికి ప్రజలు మాత్రం ఆదరించారు.
అలాగే 2012 నుంచి 2014 వరకూ ప్రసారమైన ‘సత్యమేవ జయతే’ ఆయనకు ఉన్న సామాజిక అవగాహానను బయటపెట్టింది. దేశాన్ని వేధిస్తున్న అనేక సమస్యలను ఆయన బయట పెట్టారు. తన ఇమేజ్ ను పెట్టుబడి గా పెట్టి ఆయన ఈ సాహసం చేశాడు. పరువు హత్యలు, స్త్రీ భ్రూణ హత్యలు, కులహింస, వైద్య సేవలో నిర్లక్ష్యం, లైంగిక వేధింపులు వంటి వాటిని హైలైట్ చేశారు.
ఈ ప్రదర్శన అందరి మన్ననలు పొందింది. దాని ప్రభావం అసెంబ్లీలను తాకింది. ఖాన్ నటుడు, మోడరేటర్, నిజమైన ప్రజల బాధను స్థలం కల్పించడానికి తన విశ్వసనీయతను ఉపయోగించాడు. సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించే నటుల కంటే తాను ఎంతో ముందున్నానని ఆమీర్ నిరూపించుకున్నాడు.
విరామం లేని పౌరుడు.. కళాకారుడు..
1990లో యుక్త వయస్సులోకి అడుగుపెట్టిన ఓ కళాకారుడిని బాలీవుడ్ గుర్తించింది. తన గురించి మొదటి జ్ఞాపకం ‘జో జీతా వోహి సికందర్(1992)’ లో ఉంది. అందులో అతడు బాల్య మంత్రగాడి పాత్రను పోషించాడు. అందులో పోషించిన సంజయ్ పాత్ర సోమరివాడు. లోపభూయిష్టుడు, స్వార్థపరుడు కానీ చివరకు అసమానతలు, నిందలు ఎదుర్కొనే పాత్రను సమర్థవంతంగా పోషించాడు.
ఆ తరువాత ఆమీర్ తనను తాను ఆవిష్కరించుకునే ప్రయత్నం చేశాడు. రాజ్ కుమార్ హీరాణీ దర్శకత్వం లో వచ్చిన ‘త్రీ ఇడియట్స్(2009)’ లో, అలాగే ఫర్హాన్ అక్తర్ నటించిన దిల్ ఛాహ్తా హై (2001) లో 44 సంవత్సరాల వయస్సులో కళాశాల విద్యార్థిగా నటించాడు.
ఇందులో రాంఛో అనే అసాధారణమైన స్వేచ్ఛా ఆలోచన కలిగిన వ్యక్తిగా కనిపించారు. ఆకాశ్ పాత్రలో ఆధునిక పురుషులు కొరుకునే సున్నితత్వాన్ని ప్రదర్శించారు. ఇందులో ఆయన నటన ఆమోఘం.
రాకేష్ ఓం ప్రకాశ్ మెహ్రా దర్శకత్వంలో వచ్చిన రంగ్ దే బసంతిలో మరో అడుగు ముందుకేసి రాజకీయాలను పాప్ సంస్కృతితో మిళితం చేసి ప్రతిఘటన స్నేహాన్ని తెరపై ఆవిష్కరించాడు. నిష్క్రయాత్మకతకు బదులు నిరసనను ఎంచుకునే వ్యక్తిగా ఆమీర్ కనిపించాడు.
రంగ్ దే బసంతి ఒక రెచ్చగొట్టే చిత్రంగానే చెప్పవచ్చు. ఉదాసీనతపై ప్రజాభిప్రాయ సేకరణ. ఆమీర్ తనదైన నటనతో చిత్రానికి మంచి జనాదరణ లభించేలా చేశాడు. దంగల్ క్రమశిక్షణ కలిగిన తండ్రి పాత్రలో ఒదిగిపోయాడు.
తన కలను కూతుళ్లతో నేర్చువేర్చుకునే ప్రయత్నంలో జాతీయతను కలగలిపి తీయడంతో బాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
కొన్ని తప్పటడుగులు..
కానీ ఆమీర్ సినిమా కెరీర్ లో కొన్ని అపజయాలు సైతం ఉన్నాయి. వాటిలో విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో వచ్చిన ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ (2018) సినిమా బాక్సాపీస్ దగ్గర బొల్తా పడింది. ఇది సముద్ర దొంగల నేపథ్యంలో వచ్చింది. కానీ హలీవుడ్ సినిమాను పోలీ ఉండటంతో సినిమా విపరీతంగా ట్రోలింగ్ కు గురైంది.
ఈ సినిమా ఇచ్చిన షాక్ తో చాలాకాలం తరువాత 2022 లో ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది ఫారెస్ట్ గంప్ అనే సినిమాకు రీమేక్. ఇది కూడా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది. ఇందులో ఏదో ఫీలింగ్ మిస్ అయినట్లు స్పష్టంగా కనిపించింది. ఇందులో ఆయన నటన అతిగా రిహార్సల్ చేసినట్లుగా కనిపించింది.
ఈ 60 ఏళ్ల వయస్సులో ఆమీర్ తనకు నటనపై ఉన్న ప్రేమతో సినిమాల కోసం రిస్క్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కామెడీ, స్పోర్ట్స్ డ్రామాలు, స్వాతంత్య్రానికి ముందున్న కథల గురించి ఆలోచిస్తున్నారు. అలాగే గతంలో హిట్ అయిన సినిమాల రీమేక్ ల పై కూడా తన దృష్టిని కేంద్రీకరించాడు.
అసలు తనకు నటించాల్సిన అవసరం లేకపోయినప్పటికీ ప్రేక్షకుల డిమాండ్ లేదా మరో సుదీర్ఘ ఏకాంతం కోసం తపనో దేని కోసమే ఆరాటపడుతున్నాడు. అతని వారసత్వం వద్దు, స్టార్ డమ్ కాదు.. బాక్సాఫీస్ గణాంకాలు వద్దు.. కానీ ఇంకేదో కావాలి..
Next Story