వివాదాస్పద  చిత్రం మహారాజ్ (నెట్ ఫ్లిక్స్) రివ్యూ
x

వివాదాస్పద చిత్రం 'మహారాజ్' (నెట్ ఫ్లిక్స్) రివ్యూ

అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో అనే సందేహం చాలా కాలం నుంచి ఉంది. ఈ సినిమా పోస్టర్స్, టీజర్ వివాదాలను తీసుకొచ్చి పెట్టింది.


అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో అనే సందేహం చాలా కాలం నుంచి ఉంది. ఈ సినిమా పోస్టర్స్, టీజర్ వివాదాలను తీసుకొచ్చి పెట్టింది. రిలీజ్ కాకుముందే ఈ సినిమా కంటెంట్ ని బట్టి బ్యాన్ చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ లు వినిపించాయి. కొన్ని వర్గాలకు వ్యతిరేకంగా మూవీ ఉండనుందని, స్ట్రీమింగ్ నిలిపివేయాలని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో నెట్ ఫ్లిక్స్ ను కూడా బ్యాన్ చేయాలంటూ రచ్చ రచ్చ చేశారు. హిందూ మ‌తాన్ని, ఆచారాలు, సంస్కృత‌ల‌ను మ‌హారాజ్ మూవీతో వ‌క్రీక‌రించే ప్ర‌య‌త్నం చేసినట్లు కోర్టుకు ఎక్కారు. హిందూ సాధువుల‌ను, స‌న్యాసుల‌ను కామంధులుగా చిత్రీక‌రిస్తూ వారిని మ‌హారాజ్ మూవీతో అవ‌మానించాల‌ని చూస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

దీంతో ఆ సినిమా అనుకున్న తేదీకి రిలీజ్ అవ్వలేదు. ఆ తర్వాత గుజరాత్ కోర్టు మూవీని చూసి అందులో అంత వివాదాస్పద విషయం ఏమి లేదని, మేకర్స్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయవచ్చని నెట్‍ఫ్లిక్స్, యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థలకు అనుమతి ఇచ్చింది.అంతకు ముందు జూన్ 13వ తేదీన విధించిన స్టేను ఎత్తివేసింది. గుజరాత్ హైకోర్టు న్యాయ స్థానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఈ సినిమాలో కథ ఏమిటి...అంత వివాదాస్పద విషయం ఏముంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్ ఏమిటి

ఈ కథ 1832లో గుజరాత్ - 'వడాల్' గ్రామంలో మొదలవుతుంది. వైష్ణవ దంపతులైన ముల్జీ జీవరాజ్ దంపతులకు కర్సన్ (జునైద్ ఖాన్) జన్మిస్తాడు. చిన్నప్పటి కర్సన్ అభ్యుదయ భావాలతో ఎదుగుతాడు. ఒక ప్రెస్ లో జర్నలిస్టుగా పనిచేస్తూ ఉంటాడు. అలాగే కిశోరీ (షాలినీ పాండే) ప్రేమలో పడతాడు. వీళ్లు ఉంటుంన్న ప్రాంతంలో కృష్ణ మందిరం ఉంటుంది. ఆ మందిరంలో ఉండే మహారాజ్ (జైదీప్ అహ్లావత్) ఏం చెప్తే అది అక్కడ వైష్ణవులకు శాసనం. ఆయన్ని ఓ దేవుడుగా కొలుస్తూంటాడు. తనను తాను

భగవంతుడి ప్రతినిధిగా ప్రకటించుకుని, తన సేవ చేయడంవలన అందరి జీవితాలు తరిస్తాయని చెప్తూంటారు.

నిజానికి మహారాజ్ ఆధ్యాత్మిక ముసుగు కప్పుకున్న ఒక కామాంధుడు. అతను కన్ను కర్శన్ లవర్ అయిన కిషోరీపై పడుతుంది. ఆమెను 'చరణసేవ' పేరుతో మందిరానికి రప్పించి ఆమెను లోబరచుకుంటాడు. కానీ ఆమె మాత్రం దేవుడు దగ్గర సేవలో ఉన్నాననే భ్రమలో ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న కర్సన్, ఆమెతో ఎంత వాదించినా అర్దం చేసుకోదు. దాంతో ఆమెను దూరం పెట్టేస్తాడు. పెళ్లి రద్దు చేసుకుంటారు.ఈ లోగా ఆమె చెల్లిని కూడా మహారాజ్ లోబరుచుకునే ప్రయత్నం చేయటంతో అసలు విషయం అర్దమవుతుంది. ఇలా చాలా మంది అతని కామానికి బలైపోతూంటారు. ఎదురుతిరిగిన వాళ్లు మాయమైపోతారు.

ఈలోగా కిశోరి మరణిస్తుంది. అంతేకాకుండా ఆ మహారాజ్ గుట్టుని బయిటపెట్టమని ఉత్తరం రాస్తుంది. ఆ క్రమంలో కర్శన్ తన పత్రిక సత్య ప్రకాశ్ ద్వారా నిజాలు బయిటపెట్టే ప్రయత్నం చేస్తాడు. ఇది మహారాజుకు పరువు పోయే పరిస్దితి వస్తుంది. దాంతో కర్శన్ పై పరువు నష్టం దావా వేస్తాడు. కేసు సుప్రీం కోర్టుకు వెళ్తుంది. అప్పుడు ఏమైంది. కర్శన్ తను పత్రికలో రాసిన విషయాలు కోర్టులో నిరూపించగలుగుతాడా..చివరకి మహరాజ్ నిజ స్వరూపం జనాలకు తెలిసిందా అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది...

ఈ చిత్రం దాదాపు 150 ఏళ్ల సంవత్సరాల క్రితం నాటి జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త కర్సన్ దాస్ ముల్జీ జీవితం ఆధారంగా తెరకెక్కింది. గుజరాతీ రచయిత సౌరభ్ షా రచించిన 1862 మహారాజ్ లిబెల్ కేస్ అనే పుస్తకం ఆధారంగా మహారాజ్ చిత్రాన్ని దర్శకుడు సిద్ధార్థ్ మల్హోత్రా తెరక్కించారు. సినిమా మొదటి నుంచి చివరి దాకా టైట్ స్క్రీన్ ప్లేతోనే వెళ్లుంది. అయితే కథ ఓ సంఘటన బేస్ కావటంతో అక్కడక్కడే తిరిగిన ఫీలింగ్ వస్తుంది.

సినిమాటెక్ కు పెద్దగా ప్రయారిటీ ఇవ్వకుండా సీన్స్ డిజైన్ చేసారు. దాంతో నాచురాలిటిగానే అనిపిస్తుంది. అయితే కథలో క్లైమాక్స్ దాకా హీరో సైడ్ నుంచి హై ఇచ్చే ఎలిమెంట్ కనపడదు. మహరాజ్ పాత్రే డామినేట్ చేస్తూంటుంది. నిజ జీవితంలో దాదాపు అలాగే జరుగుతుంది కాబట్టి అలాగే తీసారని సరిపెట్టుకోవాలి. ఎంటర్టైన్మెంట్ పాళ్లు కూడా తక్కువే. చివరి క్లైమాక్స్ కోర్ట్ సీన్ దాకా డ్రామా బిల్డప్ చేసుకుంటూ వచ్చారు. మధ్యలో పెద్దగా చెప్పుకోదగ్గ మలుపులు లేవు.

నటుడుగా అమీర్ ఖాన్ కుమారుడు జునైద్‍ ఖాన్‍ తొలి చిత్రం. అద్బుతంగా చేసాడని చెప్పలేం కానీ నడిచిపోతుంది. అమీర్ ఖాన్ తో పొరపాటున కూడా పోల్చి చూడలేం. ఇక మహరాజ్ గా జైదీప్ అహల్వాత్ అదరకొట్టారు. కిషోర్ గా అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండే బాగా చేసింది. సినిమాలో శార్వరీ వాఘ్, జే ఉపాధ్యాయ్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకం నిర్మించగా.. సోహైల్ సేన్ సంగీతం అందించారు. 18 శతాబ్దం నాటి ముంబై ని మన ముందు ఉంచటానికి దర్శక,నిర్మాతలు ప్రయత్నించారు. ఆర్ట్ డైరక్టర్,కాస్ట్యూమ్స్ డిపార్టమెంట్ కృషి బాగా కనపడుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగా కుదిరింది.

చూడచ్చా

సినిమా కంటెంట్ వివాదాస్పదమైనదైనా అసభ్యత, శృంగారం వంటివి లేకపోవటంతో చూడచ్చు. ముఖ్యంగా చారిత్రాత్మక అంశాలపై ఆసక్తి ఉన్నవారికి ఈ సినిమా నచ్చుతుంది.

ఎక్కడ చూడచ్చు

నెట్ ప్లిక్స్ లో తెలుగులో ఉంది.

Read More
Next Story