టైమ్ ట్రావెల్ ఫిల్మ్ : ఆరంభం మూవీ రివ్యూ
x

టైమ్ ట్రావెల్ ఫిల్మ్ : 'ఆరంభం' మూవీ రివ్యూ

మనకి టైమ్ ట్రావెల్ ఫిల్మ్స్ తక్కువే. ఎందుకంటే అవి చాలా బడ్జెట్‌తో కూడుకుని ఉంటాయి కాబట్టి వాటి జోలికి పోరు దర్శక, నిర్మాతలు. అయితే ఓటిటిలు వచ్చాక ఈ పద్దతి..


మనకి టైమ్ ట్రావెల్ ఫిల్మ్స్ తక్కువే. ఎందుకంటే అవి చాలా బడ్జెట్‌తో కూడుకుని ఉంటాయి కాబట్టి వాటి జోలికి పోరు దర్శక, నిర్మాతలు. అయితే ఓటిటిలు వచ్చాక ఈ పద్దతి మెల్లిగా మారుతోంది. ఇప్పుడు తక్కువ బడ్జెట్‌లో తమ క్రియేటివిటిని చూపటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఆ క్రమంలో వచ్చిందే ఈ సినిమా. టైమ్ ట్రావెల్, లూప్ కాన్సెప్టుతో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది...స్టోరీ లైన్ ఏంటి చూడదగ్గ సినిమాయేనా చూద్దాం.

స్టోరీ లైన్

కాలాఘాటి జైల్లో ఓ మర్డర్ కేసులో శిక్ష అనుభవిస్తూ ఉంటాడు మిగిల్(మోహన్ భగత్). తెల్లారితే ఉరితీస్తారు అనగానే.. జైలులోంచి ఊహించని విధంగా మాయం అవుతాడు. దాంతో జైల్లో అది పెద్ద సెన్సేషన్ అవుతుంది. అతను ఉన్న జైలు సెల్ ఎలా ఉందో అలాగే ఉంది. తాళాలు బ్రద్దలు కొట్టలేదు. ఏ మార్గం గుండా పారిపోయాడో ఎవరికీ అర్థం కాదు. అప్పుడు ఈ కేసుని డీల్ చేయటానికి డిటెక్టివ్(రవీంద్ర విజయ్)ని పిలిపిస్తారు. అతను ఇన్విస్టిగేషన్‌ని.. మొదటగా మిగిల్ రాసుకున్న డైరీతో ప్రారంభిస్తాడు. ఆ పుస్తకం ఆ సెల్‌లోనే దొరుకుతుంది.

డైరీలాంటి ఆ పుస్తకంలో మిగిల్ చిన్నప్పటి నుంచి సైంటిస్ట్ ( భూషణ్) దగ్గర పెరిగాడని పెరిగాడని తెలుస్తుంది. ఆయన మిగిల్‌తో కలిసి క్వాంటమ్ ఫిజిక్స్ సిద్దాంతాలతో డేజావు ఎఫెక్ట్ అనే ఎక్స్పరిమెంట్ చేస్తున్నాడని అర్థం చేసుకుంటారు. అలాగే ఈ పుస్తకంలో ఈ ప్రయోగంతోపాటు అతని జీవితం గురించి కూడా ఉంటుంది. దాంతో పుస్తకం ముందుకు వెళ్లే కొలిదీ ఒక్కో ముడి వీడుతుంది. అసలు మిగిల్ ఎవరు… ఎవర్ని మర్డర్ చేసి జైలుకు వచ్చాడు. అసలు జైల్లో నుంచి ఎలా మాయమయ్యాడు అనేది మిగతా కథ.

విశ్లేషణ

ఆధారంగా దర్శకుడు అజయ్‌ నాగ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సమయాన్ని కథా వస్తువుగా చేసుకుని రూపొందిన ఇలాంటి సినిమాల్లో చూసిన సన్నివేశాలనే మళ్లీ మళ్లీ చూడాల్సి వస్తుంది. దీంతో, ప్రేక్షకుడికి కన్‌ఫ్యూజ్‌ తప్పదు. ఈ చిత్రం విషయంలో ప్రథమార్ధంతా క్లారిటీగా ఉన్నా ద్వితీయార్ధంలో కొంత స్పష్టత లోపించింది. కథానాయకుడి జైలు జీవితంతో సినిమా ఆసక్తికరంగా ప్రారంభమైంది. మిగిల్‌ ఎందుకు జైలుకెళ్లాడు? అందరి కళ్లుగప్పి ఎలా తప్పించుకోగలిగాడు? అతడి నేపథ్యమేంటి?తెలుసుకోవాలనే ఉత్సుకత కలిగిలే ఆయా సన్నివేశాలు రూపొందించారు. కానీ, వాటిని రివీల్‌ చేసేందుకు వచ్చిన డిటెక్టివ్‌ల పాత్రలు పేలవంగా ఉన్నాయి. డైరీని చదువుతూ హీరో ఫ్లాష్‌బ్యాక్‌ చెప్పడానికే ఆ క్యారెక్టర్లు పరిమితమయ్యాయి.

ఈ సినిమా కన్నడ నవల ‘నీను నిన్నోళగి ఖైదీ’ ఆధారంగా రూపొందించారు. టైమ్ ట్రావెల్ ప్రధాన కథాంశం. అలాగే టైమ్ లూప్ కూడా కథలో భాగంగా వస్తుంది. సైన్స్ మీద అవగాహన లేని వారికి సైతం అర్థమయ్యేలా చెప్పటానికి దర్శకుడు కష్టపడ్డాడు. అయితే కొంత కన్ఫూజన్, ప్రెడిక్టబులిటీ తప్పలేదు. సినిమా ప్రారంభం జైల్లోంచి మాయమవటం అనే హుక్ అద్బుతంగా పేలింది. ఆ తర్వాత కథలో ఎక్కడా ఆ స్దాయి మలుపు కనపడదు. మరొక విషయం సినిమాలో డిటెక్టివ్ ఈ కేసుని డీల్ చేయటానికి వస్తాడు కానీ అతను ఏమీ చేయడు. కేవలం డైరీ చదవుతూ కూర్చుంటాడు.

డైరీ చదవడం పూర్తవగానే సినిమా దాదాపు పూర్తైపోతుంది. దాంతో కథలో వచ్చే మలుపు డిటెక్టివ్ యాంగిల్ లో చూడటానికి ఏమీ ఉపయోగపడవు. డిటెక్టివ్ లేకపోయినా ఆ డైరీ పాయింటాఫ్ వ్యూలో కథ చెప్పేసినా సరిపోతుంది. డిటెక్టివ్ పాత్రను పెట్టినప్పుడు తనంతట తానే కొన్ని క్లూలు పట్టుకుని ముందుకు వెళ్తూ మిస్టరీని రివీల్ చేస్తే బాగుండేది. నవలను యాజటీజ్ ఫాలో అయ్యిపోయినట్లున్నారు. కానీ సినిమాగా స్క్రీన్ ప్లే మార్చి రాసుకోలేదనకుంటాను. అయితే ఇలాంటి లోపాలు ఉన్నప్పుటికి ఇంట్రస్టింగ్ చివరి దాకా ఏం జరుగుతుందనే ఆసక్తిని అయితే కలగ చేశారు. డేజావు ఎక్స్పరిమెంట్ కాస్త ఆసక్తికరమనిపిస్తుంది.

ఆర్టిస్టుల ఫెరఫార్మెన్స్ విషయానకి వస్తే.. కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ మోహన్ భగత్ కీ రోల్ చేశారు. ఆకట్టుకున్నాడు. హీరోయిన్ సుప్రీతా సత్యనారాయణ జస్ట్ ఓకే . హీరో తల్లిగా సురభి ప్రభావతి పాత్ర బాగా వర్కవుట్ అయ్యింది. సైంటిస్ట్‌గా భూషణ్, మిగతా పాత్రల్లో లక్ష్మణ్ మీసాల, రవీంద్ర విజయ్ వంటి పరిధి మేరకు నటించారు.

టెక్నికల్‌గా చూస్తే ...సినిమాటోగ్రఫీ బాగుంది. పాటలు బాగోలేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగా సెట్ అయ్యాయి. స్క్రీన్ ప్లే ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ సింపుల్ కథ ఇంకా బాగా వచ్చేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చూడచ్చా

రెగ్యులర్‌గా సెన్స్ ఫిక్షన్ సినిమాలు చూసేవారికి సోసోగా అనిపించవచ్చు కానీ మిగతా వారికి బాగానే ఉందనిపిస్తుంది.

ఎక్కడుంది

ఈటీవి విన్ లో తెలుగులో ఉంది

Read More
Next Story