హారర్ కామెడీ:  ‘ముంజ్యా’ ఓటిటి సినిమా రివ్యూ
x

హారర్ కామెడీ: ‘ముంజ్యా’ ఓటిటి సినిమా రివ్యూ

అనగనగా ఓ కుర్రాడు. వాడు చిన్నప్పుడే తీరని కోరికలతో చచ్చి దెయ్యమై ఊరి చివర మర్రి చెట్టు మీద ఉన్నాడు. వాడి దగ్గరకు వెళ్లిన వాళ్లను వాడు పీడిస్తూంటాడు.

అనగనగా ఓ కుర్రాడు. వాడు చిన్నప్పుడే తీరని కోరికలతో చచ్చి దెయ్యమై ఊరి చివర మర్రి చెట్టు మీద ఉన్నాడు. వాడి దగ్గరకు వెళ్లిన వాళ్లను వాడు పీడిస్తూంటాడు. ఇలాంటి 'చెట్టు మీద దెయ్యం' కథలు మనం చిన్నప్పుడు చాలా విని ఉంటాము. అయితే దాన్ని ఎవరో ఒకరు.. సీరియస్‌గా తీసుకుని దాన్ని ఏ కథగానో మలచాలి కోరుకోం. కానీ ఆదిత్య సర్పోత్థార్‌ ఈ పాయింట్ చుట్టూ కథ అల్లి సినిమా చేయాలనుకున్నాడు. తమ ప్రాంతంలో పాపులరైన ఓ జానపద కథలాంటి ఓ దెయ్యం కథను తీసుకుని , దాన్ని ఇప్పుడు కాలమాన పరిస్థితులకు వర్తింప చేస్తూ నవ్విస్తూ, భయపెడుతూ సినిమా చేస్తే అదే 'ముంజ్యా' . కొంకణ్ తీర ప్రాంతంలో చాలా కాలంగా జనం చెప్పుకునే ఓ కాల్పనిక కథను తీసుకుని దాని చుట్టు సిట్యువేషన్స్ అల్లి తెరకెక్కించిన తీరు జనాలకి తెగ నచ్చేసింది.

ఎంతలా నచ్చింది అంటే.. రూ. 30 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా, రూ. 130 కోట్లకి పైగా వసూలు చేసేటంత. నార్త్ ఇండియాలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రం ఓటీటీ పుణ్యమా అని తెలుగులోకి డబ్బింగ్ అయ్యి మన ఇళ్లల్లోకి వచ్చింది ఈ పిల్ల దెయ్యం. చూడదినేశ్ విజయన్ - అమర్ కౌశిక్ నిర్మించిన ఈ సినిమాకి, ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించాడు. అభయ్ వర్మ .. శర్వాణి .. మోనా సింగ్ .. సత్యరాజ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందో , తెలుగు వాళ్లకు నచ్చే కంటెంట్ ఉందా, అసలు కాన్సెప్ట్ ఏమిటో చూద్దాం.

స్టోరీ లైన్

'పూణె' లో ఉండే బిట్టు (అభయ్ వర్మ) కొద్దిగా భయస్థుడు. అయితే స్వతంత్రంగా బ్రతకాలనే ఆలోచన ఉన్న కుర్రాడు. బిట్టు తల్లి పమ్మి (మోనా సింగ్) అతి జాగ్రత్త తో అతన్ని ముందుకు వెళ్లనివ్వదు. నచ్చినట్టుగా బ్రతకనివ్వదు. తన తల్లి .. బామ్మతో కలిసి ఉండే అతనికి తన తండ్రి గురించి పెద్దగా ఏమీ తెలియదు. ఆ టాపిక్ వచ్చినప్పుడల్లా తన తల్లి .. బామ్మా దాటేస్తూంటారు. అలా ఎందుకు దాటవేస్తున్నారనే విషయం అతనికి అర్థం కాదు. ఇదిలా ఉంటే అతనికి అప్పుడప్పుడూ ఓ అడవిలో .. ఒక చెట్టుపై భయంకరమైన ఆకారం తనని పిలుస్తున్నట్టుగా అనిపిస్తూంటుంది.

ఇక ఓ రోజున అతను తన బాబాయ్ కూతురు ఎంగేజ్మెంట్ తన కుటుంబంతో కలిసి కొంక‌ణ్ ప్రాంతంలోని సొంతఊరు వెళతాడు. అక్కడ తనకి తరచు కళ్లలో కనపడే ప్రదేశాన్నీ .. పెద్ద మర్రిచెట్టును చూసి ఆశ్చర్యపోతారు. అలాగే ఆ చెట్టు దగ్గరికి వెళ్లినప్పుడే తన తండ్రి చనిపోయాడని తెలిసి బాధపడతాడు. ఆ బాధలోనే అతను ఆ చెట్టు దగ్గరికి పరిగెడతాడు. అతని వెనకే బామ్మ కూడా వెళ్తుంది. ఆ చెట్టుపై ముంజ్య అనే ఒక పిల్ల ద‌య్యం (ముంజ్యా) ఎంతోకాలంగా తన కోరికను తీర్చుకోవడానికి ఎదురుచూస్తుంటుంది.

బిట్టు అనుకోకుండా ఆ పిల్ల ద‌య్యం ద‌గ్గ‌రికి వెళ్ల‌టంతో అతడిని వ‌శ‌ప‌ర‌చుకుంటుంది ముంజ్య. ముంజ్యా బారి నుంచి బిట్టూను కాపాడటానికి వచ్చిన బామ్మను ముంజ్యా చంపేస్తుంది. అక్కడ నుంచి ముంజ్యా ..బిట్టుతో కలిసి పూనే వచ్చేస్తుంది. అతనికి తనకు మాత్రమే కనిపిస్తూ తనను టార్చర్ చేస్తుంటుంది. అయితే అసలు ముంజ్య ఎవరు. బిట్టు వెన‌క మాత్రమే ఎందుకు ప‌డుతుంది. దాని కోరిక ఏమిటి, ఆ ముంజ్యా బారి నుంచి బిట్టు ఎలా బయటపడ్డాడు, బేలాతో అతని లవ్ స్టోరీ ఏమైంది అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎందుకింత హిట్టైంది

ఈ కథలో ముంజ్యా దెయ్యానికి ఉన్న కోరిక దగ్గరే కథను లాక్ చేసాడు డైరక్టర్. చచ్చిపోయి దెయ్యం అయినా అది తను ఎప్పుడో ప్రేమించిన మున్నీని పెళ్లి చేసుకుంటాను. మున్నీతో పెళ్లిచేయమని ఆ దెయ్యం ..హీరో వెనకపడి వేధించటమే కామెడీ. అలాగే హీరో ప్రెండ్ ని కూడా ఈ కథలో కి తీసుకొచ్చి నవ్వించారు. దెయ్యం కూడా భయపెట్టడం అనే దాని కన్నా గమ్మత్తుగా ఉండటం కలిసొచ్చింది. మనలో చాలా మంది ముఖ్యంగా విలేజ్ ల నుంచి వచ్చినవాళ్లు తమ ఊళ్లో మర్రి చెట్టు పైనో మరో చోటే దెయ్యం ఉందని, దానికో కథ ఉందని వినే ఉంటారు. దాంతో ఈజీగా ఈ కథతో కనెక్టు అవుతారు. అయితే ఈ ముంజ్యా దెయ్యం పెద్దగా భయపెట్టలేకపోయింది. కథ .. స్క్రీన్ ప్లే .. క్యారక్టర్ డిజైన్ ప్లస్ అయ్యింది. కొద్ది పాటి క్యారక్టర్స్ మధ్యే సినిమాని నడిపారు. ఈ కథలో మరో కీలకమైన పాత్ర దెయ్యాలు, భూతాలను వదిలించే పద్రి (సత్యరాజ్)ది. ఆయన ఉన్నంతసేపు నవ్వించే ప్రయత్నం చేసారు. ఇలా ఓ పిల్ల దెయ్యానికి, గమ్మత్తైన మిగతా పాత్రలను ముడిపెట్టి సినిమాని నడిపించటం, పిల్లలకు, పెద్దలకు నచ్చేసింది. బిట్టు...ఆ దెయ్యంతో పడే ఇబ్బందులు భయపెట్టవు సరికదా ఆకట్టుకుంటాయి.

టెక్నికల్ గా ఈ సినిమా చాలా స్ట్రాంగ్ గా ఉంది. పిల్ల దెయ్యాన్ని చూపించే విధానం, ఆ క్రమంలో వాడిన వీఎఫ్ ఎక్స్ మామూలుగా లేవు. అలాగే బోర్ కొట్టని విధంగా రోలర్ కోస్టర్ లా సినిమాని పరుగెత్తించారు. మొదట పావు గంట స్లో గా అనిపించినా తర్వాత సినిమా చివరి దాకా ఆపకుండా చూసేస్తాం. జస్టిన్ వర్గీస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , సౌరభ్ గోస్వామి కెమెరా వర్క్ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. ఎడిటింగ్ జస్ట్ ఓకే అనిపించింది. నటీనటుల్లో అందరూ బాగా చేసారు. సత్యరాజ్ , బిట్టుగా చేసిన అభయ్ వర్మ, బిట్టు ప్రెండ్ గా జచేసిన తరణ్ జోత్ సింగ్, అదరకొట్టారు. డైరక్టర్ ఆతిత్య సర్పోత్థార్ సినిమాని హారర్ కామెడీ ని కొత్తగా చేయాలనే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు.

చూడచ్చా

ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్యామిలీతో చూడవచ్చు

ఎక్కడుంది

డిస్నీ , హాట్ స్టార్ లో తెలుగులో ఉంది

Read More
Next Story