సీన్ లోకి రానా,  నెట్ ప్లిక్స్ భారీ రేటు ఇచ్చి  కొనేసింది
x

సీన్ లోకి రానా, నెట్ ప్లిక్స్ భారీ రేటు ఇచ్చి కొనేసింది

దగ్గుబాటి రానా సీన్ లోకి వచ్చేడంటే లెక్కలే మారిపోతాయి. అతని బ్రాండ్ ఇమేజ్ అలాంటిది. నటుడుగా ఎంతో పేరు తెచ్చుకున్న ఆయనకు నిర్మాతగా మూడో తరం వారసుడు గా ఎంతో పేరు ఉంది.


దగ్గుబాటి రానా సీన్ లోకి వచ్చేడంటే లెక్కలే మారిపోతాయి. అతని బ్రాండ్ ఇమేజ్ అలాంటిది. నటుడుగా ఎంతో పేరు తెచ్చుకున్న ఆయనకు నిర్మాతగా మూడో తరం వారసుడు గా ఎంతో పేరు ఉంది. అందుకే ఆయన ఓ సినిమాని ఎండార్స్ చేసుకున్నారన్నా, సమర్పకుడుగా వ్యవహిస్తున్నాడన్నా అందరూ ఎలర్ట్ అయ్యిపోతారు. ఓటిటి సంస్దలు ఆ సినిమాని తీసుకోవటానికి ముందుకు వస్తాయి. ఎందుకంటే వాళ్లకు తెలుసు రానా ఇమేజ్ ఏమిటో..సురేష్ ప్రొడక్షన్ స్టామినా ఏమిటో..భవిష్యత్ లో చాలా పనులు ఉంటాయని ఉంటాయి వీళ్లతో. అందుకే పెద్ద వాళ్లతో ఆచి,తూచి ముందుకు వెళ్తారు ఓటిటి సంస్దలైనా, మరొకరు అయినా.

అలా ఇప్పుడు ఓ చిన్న సినిమాకు ఆ అదృష్టం పట్టింది. రానా సమర్పించిన ఓ సినిమా రేపు రోజు రిలీజ్ కు రెడీ అయ్యింది. మామూలుగా అయితే చిన్న సినిమాను ఓటిటి సంస్దలు అసలు పట్టించుకోవు. ఓ సారి చూడమన్నా కూడా సంవత్సరాల తరబడి తిప్పించుకుంటాయి. తర్వాత వాటి నిర్ణయం అంత త్వరగా చెప్పవు. అసలు చిన్న సినిమా అంటేనే ఓటిటి సంస్దలకు బాగా చిన్న చూపు. షేరింగ్ పద్దతిలో కూడా తమ ఓటిటి లో పెట్టుకోవటానికి ఇష్టపడవు. కానీ అక్కడున్నది రానా. ఆయన సమర్పకుడు గా ఉన్నాక వాళ్లే ఆ సినిమా కావాలంటూ తిరిగి మరీ తీసుకున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అదీ అదిరిపోయే రేటు ఇచ్చి. ఆ సినిమా ఏంటి...ఎంత పెట్టారు. ఓటిటిలో ఎంత వచ్చింది అనేదే ఇప్పుడు హాట్ టాపిక్.

ఈవారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో ’35.. చిన్న క‌థ కాదు’ ఒక‌టి. రానా ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. నివేద థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్ ఇది. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్ , డైరెక్టర్.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.”35-చిన్న కథ కాదు”సెప్టెంబర్ 6న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్ ఈవెంట్ భారీగానే నిర్వహించారు. నేచురల్ స్టార్ నాని చీఫ్‌ గెస్ట్ గా హాజరైన ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. కొద్దిగా బజ్ స్టార్టైంది. ఈ క్రమంలోనే రిలీజ్ కు ముందే ఈ సినిమా ఆర్థికంగా సేఫ్ అయ్యింది. అదిరిపోయే రేటు ఇచ్చి ప్రముఖ ఓటీటి సంస్ద నెట్ ప్లిక్స్ రైట్స్ తీసుకుంది.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ’35’ సినిమా దాదాపు రూ.6.5 కోట్ల‌తో సినిమా తీసారు. నెట్ ఫ్లిక్స్ సినిమా ఓటీటీ రైట్స్ ద‌క్కించుకొంది. ఈ సినిమా కోసం రూ.7.5 కోట్లు చెల్లించింది. కాబట్టి ఓటీటీతోనే ఈ సినిమా లాభాల్లో పడిపోయింది. ఇప్పుడు శాటిలైట్ బిజినెస్ కూడా బాగానే జరుగుతుందని తెలుస్తోంది. ఇక థియేటర్ నుంచి వ‌చ్చిందంతా లాభ‌మే. రానా సీన్ లోకి రావటమే కలిసొచ్చింది. అఫ్ కోర్స్ సినిమాలో మంచి కంటెంట్ ఉండి వచ్చు. అలాగే నివేదా థామస్ కీ రోల్ చేయటం వల్ల కావచ్చు, ప్రియదర్శి కూడా మరో పాత్రలో కనపడటం వల్ల కావచ్చు. కానీ ఇవన్నీ రానా ఇమేజ్ కన్నా ఎక్కువ కావు.

మూవీ ప్రజెంటర్, హీరో రానా దగ్గుబాటి మాట్లాడుతూ..”35-చిన్న కథ కాదు’ నాని గారి బయోపిక్ అన్నారు కానీ కథ విన్నప్పుడు నా బయోపిక్ కూడా అనుకున్నా.(నవ్వుతూ). నాకు మ్యాథ్స్ అస్సల్ వచ్చేది కాదు. 35 అనే హ్యుజ్ టాస్క్ లా వుండేది. ఈ సినిమాలో పార్ట్ కావడం ఆనందంగా వుంది. నేను స్కూల్ లో వున్నప్పుడు మ్యాథ్స్ టీచర్ నచ్చేవారు కాదు. ఇందులో దర్శి ఎగ్జాట్ గా అలానే వున్నాడు. నివేద, విశ్వ ని చూస్తే మా మదర్ ఫాదర్ ఎదో మూమెంట్ లో గుర్తుకు వచ్చారు. ఇలాంటి మంచి కథలు చేస్తున్న ఈ సినిమా నిర్మాతలకు ఎప్పుడూ నా సపోర్ట్ వుంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన సినిమా ఇది’అన్నారు.

చిత్రం కథేంటి

తిరుపతిలో మిడిల్ క్లాస్ సంసారం సరస్వతి (నివేదా థామస్), ప్రసాద్ (విశ్వ దేవ్)లది. వాళ్లకి ఇద్దరు కొడుకులు అరుణ్, వరుణ్‌లు. స్కూల్ కు వెళ్లే వయస్సు.పెద్ద అబ్బాయి అరుణ్ కాస్త భిన్నంగా ఉంటాడు. అందరిలా బట్టీపట్టి తూతూ మంత్రంగా చదవడు. లెక్కల్లో ఉండే ఫండమెంటల్స్, బేసిక్స్‌, లాజిక్స్ ను ప్రశ్నిస్తుంటాడు. సున్నాకే విలువ లేనప్పుడు.. దాని పక్కన ఒకటి పెడితే.. దాని విలువ ఎలా మారిపోతుంది?.. సున్నా అంటేనే ఏమీ లేనప్పుడు.. దాని కంటే తక్కువ మైనస్ అని ఎలా అంటారు? అని ఇలా బేసిక్స్ ప్రశ్నలు, ఆలోచనలు, అనుమానాలతో ఉంటాడు.

అయితే ఈ ప్రశ్నల్ని ఏ మాస్టర్ ఆన్సర్ ఇవ్వరు. కనీసం కూడా అర్థం చేసుకోడు. కానీ అరుణ్ తెలివి తేటలపై తల్లి సరస్వతికి అపారనమ్మకం. మరో ప్రక్క స్కూల్‌లో కొత్తగా వచ్చిన లెక్కల మాస్టర్ చాణక్య (ప్రియదర్శి) అరుణ్‌ను జీరో అని గేలి చేస్తుంటాడు. జీరో అని పిలవడం మొదలు పెడుతాడు. చాణక్య రాకతో అరుణ్ జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి? అరుణ్ ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అరుణ్‌కు లెక్కల్లో ఉండే ఆ ప్రశ్నలు, అనుమానాల్ని తల్లి ఎలా నివృత్తి చేసి కనీసం 35 మార్కులు తెచ్చుకునేలా ఎలా ప్రిపేర్ చేయించింది? చివరకు అరుణ్ ఏం చేశాడు? అన్నది కథ.

Read More
Next Story