సూపర్ హిట్ సినిమాని నిర్ధాక్ష్యంగా  KILLచేసిన  OTT
x

సూపర్ హిట్ సినిమాని నిర్ధాక్ష్యంగా 'KILL'చేసిన OTT

2021 నాటికి ఓటీటీ వ్యాపారం పదివేల కోట్ల రూపాయలను దాటేసింది. జియో రాకతో బ్రాడ్‌ బ్యాండ్‌ మరింత చవకైంది. .


2021 నాటికి ఓటీటీ వ్యాపారం పదివేల కోట్ల రూపాయలను దాటేసింది. జియో రాకతో బ్రాడ్‌ బ్యాండ్‌ మరింత చవకైంది. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఓటీటీ వేదికలు చందా ధరలను తగ్గించాయి. అలా అన్నీ కలిసొచ్చి… భారతీయులు ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయారు. ఈ వినోద వ్యాపారం 2030 నాటికి 90 వేల కోట్లను చేరుతుందని అంచనా. మూడేండ్ల క్రితం ఓటీటీలలో స్థానిక కంటెంట్‌ 20 శాతం మాత్రమే ఉండేది. ఇప్పుడది 60 శాతానికి చేరుకుంది. శుక్రవారం వచ్చిందంటే చాలు అన్ని ఓటీటీల్లో ఎదో ఒక సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది. మొదట్లో ఇది సినిమాలకు కొత్త ఆదాయమార్గంగా కనపడింది. ఇప్పుడు ఓటిటి లో ఎంత వస్తుందనేదాన్ని బట్టే బడ్జెట్ లు పెట్టే సిట్యువేషన్ కు వచ్చారు నిర్మాతలు. దాంతో ఓటిటీలు తమ రూల్స్, ఎగ్రిమెంట్స్ తో ఇండస్ట్రీని శాసిస్తున్నాయి. దాంతో ఓటిటి సంస్దలు వల్ల కొన్ని సార్లు మంచి సినిమాలు కిల్ అవుతున్నాయి. అలా తాజాగా కిల్ అనే బ్లాక్ బస్టర్ కు అదే పరిస్దితి ఎదురైంది. థియేటర్ లో బ్రహ్మాండంగా ఆడుతున్న సినిమాని ఓటిటిలోకు వచ్చేసింది.

రిలీజ్ కు ముందు ఏ దర్శకుడు, నిర్మాత తమ సినిమా ఏ స్దాయిలో ఆడుతుందో ఎవరూ అంచనా వేయలేరు. కీడెంచి మేలు ఎంచాలన్నట్లు ఓ సినిమాకు ఓటిటి నుంచి మంచి రేటు వస్తుందంటే అమ్మేయటం సహజంగా జరిగే పక్రియ. అమ్మకం జరిగినప్పుడే ఓటిటిలో రిలీజైన ఇన్ని రోజులుకు అంటే ఫలానా తేదీకు స్ట్రీమింగ్ అవుతుందని ఎగ్రిమెంట్ లో రాసుకుంటారు. దాన్ని బట్టే రేట్లు నిర్ణయమవుతాయి. కాకపోతే అవి రిలీజ్ ల తర్వాత సినిమా ఫెరఫార్మెన్స్ ని బట్టి మారిపోతూంటాయి. కానీ ఒక్కోసారి ఓటిటి సంస్దలు అందుకు ఒప్పుకోవు. అలాంటప్పుడు ఖచ్చితంగా ఆ సినిమా కిల్ అయ్యిపోతుంది. ఇప్పుడు బాలీవుడ్ బ్లాక్ బస్టర్ కిల్ సినిమాది అదే పరిస్దితి.

అసలే కొంతకాలంగా బాలీవుడ్ పరిస్దితి బాగోలేదు. ఏ సినిమా కూడా ఆడటం లేదు. పట్టుమని థియేటర్ లో నాలుగు రోజులు నిలబడటం లేదు. పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఈ కొత్త ట్రెండ్ కి సమాధానం చెప్పలేక చేతులెత్తేస్తున్నారు. మరో ప్రక్క దక్షిణాది నుంచి వస్తున్న సినిమాలు ప్యాన్ ఇండియా అంటూ హిందీలోనూ ఆడేస్తున్నాయి. ఈ క్రమంలో నార్త్ ఇండియా జనాలకు నచ్చిన హిందీ సినిమాలు వందలో ఒకటో రెండో ఉంటున్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి 'కిల్' . జూలై 5న రిలీజైన ఈ సినిమా అక్కడ తెగ ఆడుతోంది. ఫుల్ ఆన్ యాక్షన్ కథతో వచ్చిన ఈ సినిమా మూడో వారంలోకి వచ్చినా సరే కలెక్షన్స్ దుమ్ము రేపుతోంది. అయితే ఊహించని విధంగా అది ఓటిటిలోకి వచ్చేసింది.

ముందుగా చేసుకున్న ఎగ్రిమెంట్ ప్రకారం ఈ సినిమాని ఓవర్సీస్ ఆడియెన్స్ కోసం రెంట్ విధానంలో అమెజాన్ ప్రైమ్‌లోకి తీసుకు వచ్చారు. సోమవారం (జూలై 22) రాత్రి 9 గంటల నుంచి 'కిల్' మూవీ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మరీ మూడు వారాల్లోనే సూపర్ హిట్ సినిమా ఓటీటీలోకి రావడం షాకే. ఎక్కడో ఓవర్ సీస్ లో కదా ఇక్కడ వాళ్లకు నష్టం ఏమిటంటే..పైరసీ ప్రింట్ ఈ రోజు ఉదయం నుంచి అందుబాటులోకి వచ్చేసింది. అంతే జనం ఈ పైరసీతో పండగ చేసుకుంటారు. థియేటర్ కలెక్షన్స్ ఫుల్ డ్రాప్ అవుతాయి. అంటే చేతులారా ఈ సినిమాని కిల్ చేసేసారన్నమాటే.

కరోనా తర్వాత టాలీవుడ్ లోనే కాదు , అన్ని ఇండస్ట్రీల్లోనూ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయనేది నిజం. ముఖ్యంగా ఓటీటీల వాడకం విపరీతంగా పెరిగింది. ప్రేక్షకుడు థియేటర్‌కు రాలేని పరిస్థితుల్లో.. సినిమానే ప్రేక్షకుడికి వద్దకు తీసుకెళ్లేందుకు ఓటీటీ మీడియం ఎంతగానో ఉపయోగపడింది. అయితే కరోనా కాలం వెళ్లిపోయి చాలా కాలం అయ్యింది. అయినా ఓటిటిలకు అలవాటు పడ్డ జనాలు ప్రక్కకు రావటం లేదు. ఇప్పటికీ కొన్ని చిత్రాలు నేరుగా ఓటీటీల్లోనే విడుదలవుతున్నాయంటే ఓటీటీల పరిధి ఎంత విస్తృతమైందో ఇట్టే అర్థమవుతోంది. అయితే, ఈ పరిణామమే థియేటర్ల పరిస్థితిని ప్రశార్థకంగా మార్చింది. సినిమా కలెక్షన్స్ సరిగ్గా లేకపోవటానికి ఓటీటీల్లో త్వరగా సినిమాలను విడుదల చేయటమూ ఓ ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇప్పటివరకూ 45 రోజుల దాకా సినిమా విడుదల చేయకూడదన్న నిర్మాతలు ఆ సమయాన్ని 70 రోజులకు పెంచాలని పట్టుబట్టారు కానీ ఫలితం లేదు.

ఇక ఆగస్టు రెండో వారం లేదా సెప్టెంబరు మొదటి వారంలో ‘కిల్‌’ఇండియాలో స్ట్రీమింగ్‌ కానుంది. ప్రముఖ ఓటీటీ వేదికగా డిస్నీ+హాట్‌స్టార్‌లో తెలుగు, హిందీ, తమిళంతో సహా పలు భాషల్లో అందుబాటులోకి తీసుకొస్తోందని తెలుస్తోంది.

'కిల్' చిత్రం కథేంటంటే..

ఎన్‍ఎస్‍జీ కమాండోగా పని చేస్తున్న అమిత్ రాథోడ్ ( లక్ష్‌ లాల్వానీ) ఢిల్లీ నుంచి రాంచీకి ఒకే ట్రైన్‍లో బయలుదేరి వస్తూంటాడు. అమిత్‍తో పాటు తోటి కమాండో తన స్నేహితుడు వీరేశ్ (అభిషేక్ చౌహాన్) కూడా ఉంటాడు. రాత్రిపూట ప్రయాణం. అమిత్ ఆలోచనల నిండా ఒకటే. తను ప్రేమించిన అమ్మాయి కోటీశ్వరరాలు అయిన తులికా (తాన్య మనక్తిలా)కు వేరే అబ్బాయితో ఎంగేజ్‍మెంట్ చేసేసారు. వాళ్లకు కమెండో గా పనిచేసే అమిత్ ఆనడు. దాంతో ఆమె తల్లితండ్రులు ఇలా వేరే కుర్రాడితో ఎంగేజ్మెంట్ చేసేసారన్నమాట. అదే ట్రైన్ లో ఆమె తన ఫ్యామిలీతో ఉంది. ఎలాగైనా ఈ పెళ్లిని ఆపాలనేది అమిత్ ఆలోచన.

ఇదిలా ఉండగా...ఊహించని విధంగా ఆ ట్రైన్ పై బందిపోట్ల దాడి జరుగుతుంది. ఫణి (రాఘవ్ జుయల్), బేని (ఆశిష్ విద్యార్థి) లీడ్ చేస్తున్న ఓ బందిపోట్ల ముఠా ఆ ట్రైన్ లోని ప్రయాణికులపై దాడి చేస్తుంది. ప్రయాణికులను ఆ బందిపోట్లు దోచుకునేందుకు వస్తారు. ఆ బందిపోట్లు కేవలం దోచుకోవడమే కాకుండా ప్రయాణికుల ప్రాణాలు కూడా తీస్తుంటారు. బయిటకు కాల్స్ వెళ్లకుండా జామర్లు పెట్టి ఎవరి ఫోన్లు పని చేయకుండా చేస్తారు. ఈ క్రమంలో ఆ ట్రైన్ లో ఉన్న ప్రయాణీకుల తో పాటు తులికా కుటుంబం కూడా ప్రమాదంలో పడుతుంది. అప్పుడు అమిత్ రంగంలోకి దిగుతాడు. తన స్నేహితుడు వీరేశ్ సాయింతో కమెండో స్కిల్స్ తో ఆ బందిపోట్లపై సునామీలా విరుచుకుపడతాడు. అప్పుడు ఏం జరిగింది. తులికా ఫ్యామిలీని, ప్రయాణీకులను రక్షించగలిగారా....అనేది మిగతా కథ.

Read More
Next Story