‘ది కేరళ స్టోరీ’ లో ఏముంది? : ఒటిటి మూవీ రివ్యూ
x

‘ది కేరళ స్టోరీ’ లో ఏముంది? : ఒటిటి మూవీ రివ్యూ

ప్రస్తుతం హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో “ది కేరళ స్టోరీ” ఓటిటిలో ప్రసారం అవుతోంది. అక్కడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.


గత ఏడాది ఏప్రిల్ 26న రిలీజ్ అయిన ‘ది కేరళ స్టోరీ’ భాషా భేధం లేకుండా సృష్టించిన ప్రకంపనల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . కేవలం 20 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సరిగ్గా తొమ్మిది నెలల క్రితం రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ములేపింది. దాదాపు 300 కోట్లకి పైగా కలెక్షన్లు సాధించింది. అయితే ఇంత సెన్సేషన్ హిట్ సినిమా ఓటిటి బిజినెస్ వెంటనే అయ్యిపోవాలి. కానీ కాలేదు. అందుకు కారణం వివాదస్పద సినిమాగా పేరు తెచ్చుకోవటమే. ఈ ఒక్క కారణంతో ‘ది కేరళ స్టోరీ’ఓటిటి బిజినెస్ చాలా కాలం జరగలేదు. మెయిన్ ఓటిటి ప్లేయర్స్...నెట్ ప్లిక్స్, అమేజాన్ ఈ సినిమా తీసుకుంటే తాము కూడా వివాదంలో ఇరుక్కోవాల్సి వస్తుందేమో అని దూరంగా నిలబడిపోయారు.


చివరకు జీ5 ఓటిటి సంస్థ “ది కేరళ స్టోరీ” మూవీని మంచి ధరకు తీసుకుని, ఫిబ్రవరి 16 నుంచి జీ 5లో “ది కేరళ స్టోరీ” స్ట్రీమింగ్ చేస్తోంది. ప్రస్తుతం హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో “ది కేరళ స్టోరీ” ఓటిటిలో ప్రసారం అవుతోంది. అక్కడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే ది కేరళ స్టోరీ జీ5 ఓటిటి లో ఏకంగా 150 మిలియన్ కి పైగా స్ట్రీమింగ్ మినిట్స్ తో దూసుకెళుతోంది. ఓటిటిలో ఇప్పటికే ఉన్న అనేక రికార్డ్స్ బద్దలు కొడుతూ దూసుకెళ్తున్న తమ మూవీ కి ఈ స్థాయి రెస్పాన్స్ రావటం టీమ్ ఎక్సపెక్ట్ చేసినట్లు లేదు. చాలా ఉత్సాహంగా ఉన్నారు.

చిత్రం కథేమిటంటే... కేరళ కాసర్గడ్‌లోని నర్సింగ్ కాలేజీ స్టూడెంట్స్ షాలిని ఉన్ని కృష్ణన్ (అదాశర్మ), నీమ (యోగితా బిహాని), గీతాంజలి (సిద్ధి ఇద్నానీ) . వీళ్లతో పాటే అదే హాస్టల్‌ గదిలోనే ఆసిఫా (సోనియా బలాని) అనే ఆమె ఉంటుంది. ఆమె పైకి స్టూడెంట్ లా కనిపించినా అసలు ఆమె చేసే వేరేది ఉంటుంది. ఆమె ఐసిస్‌లో అండర్ కవర్‌ గా పనిచేస్తుంటుంది. అమ్మాయిలకు మాయమాటలు చెప్పి మతం మార్చే మిషన్‌లో పనిచేస్తుంటుంది. అందుకోసం పెద్ద స్కెచ్ కూడా వేసి అమలు చేస్తూంటుంది.

ఆ స్కెచ్ లో భాగంగా ఇద్దరు అబ్బాయిలను రంగంలోకి దింపి గీతాంజలి, షాలినిలు ప్రేమించేలా చేస్తుంది. అలా రమీజ్‌ ప్రేమలో పడిన షాలిని గర్భవతి అవుతుంది. పెళ్లి చేసుకోమని అడిగితే మతం మార్చుకుంటే వివాహం చేసుకుంటానని చెబుతాడు. దాంతో చేసేదేమీ లేక రమీజ్‌ను పెళ్లి చేసుకుని మతం మార్చుకుంటుంది. కొన్ని రోజులకు ఆ కుర్రాడు ముఖం చాటేయడంతో ఇసాక్‌ అనే మరో అతనితో కలిసి భారత్‌ నుంచి సిరియాకు వెళ్తుంది. అక్కడికి వెళ్లాక తాను మోసపోయానని తెలుసుకున్న షాలిని ఏం చేసింది? ఆమెకు ఎదురైన ఇబ్బందులు ఏంటి? సిరియా నుంచి ఎలా బయటపడింది? (the kerala story) అనేది మిగతా కథ.

ఆదా శర్మ ప్రధాన పాత్ర పోషించిన “ది కేరళ స్టోరీ” మూవీకి సుదీప్టో సేన్ దర్శకత్వం వహించగా, విపుల్ అమృత్ లాల్ షా నిర్మించారు. యోగితా బలానీ, సిద్ధి ఇద్నాని, సోనియా బలానీ కీలక పాత్రలు పోషించారు.

ఇక ఈ సినిమా థియేటర్ రిలీజ్ కు ముందే ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంది. అయితే ది కేరళ స్టోరీ థియేటర్లలో రిలీజయ్యాక ఒక సెన్సేషనే సృష్టించిందనే చెప్పాలి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో ఏకంగా ఈ సినిమాను ప్రదర్శించుకుండా నిషేధం విధించారు. అదే సమయంలో మరికొన్ని రాష్ట్రాల్లో పన్ను మినహాయింపు ప్రకటించారు. బీజేపీ నాయకులు ఈ సినిమాకు మద్దతుగా నిలిస్తే, ప్రతిపక్షాలు మాత్రం విమర్శలు గుప్పించాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా ప్రదర్శనపై అక్కడక్కడా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అలా థియేటర్లలో అదరగొట్టి, అందరి నోళ్లలో నానిన ది కేరళ స్టోరీ ఓటీటీ రిలీజ్‌లోనూ సెన్సేషన్ అయ్యినా ఆశ్చర్యం పోనక్కలేదు.



Read More
Next Story