అడవి శేష్ డెకాయిట్ సినిమా రివ్యూ
x

అడవి శేష్ 'డెకాయిట్' సినిమా రివ్యూ

ప్రేమా? ప్రతీకారమా? చివరికి ఏమైంది!


కథ హిందూపూర్‌లో మొదలవుతుంది.హరిదాస్ అలియాస్ హరి (అడివి శేష్‌)… ఓ బ్లడ్ క్యాంప్‌లో సరస్వతి అలియాస్ జూలియట్‌ (మృణాల్ ఠాకూర్‌)ని చూస్తాడు. మొదట ఇష్టం… తర్వాత అది గాఢమైన ప్రేమగా మారుతుంది. ఇద్దరూ ఒకరిని ఒకరు ప్రాణంగా ప్రేమించుకుంటూ, కలిసి లైఫ్ ప్లాన్ చేసుకుంటారు. కానీ వీరి మధ్య అడ్డుగోడగా నిలుస్తుంది 'కులం'. ఈ లోగా హరికి సపోర్ట్‌గా ఉన్న మల్లి (కామాక్షి భాస్కర్ల)పై సరస్వతి అన్నయ్య అఘాయిత్యానికి పాల్పడటంతో, కోపంతో అతన్ని చంపేస్తాడు హరి.

కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్.. ప్రాణంగా ప్రేమించిన సరస్వతే… పోలీసుల ముందు హరికి వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతుంది. హరి చేసిన నేరం కంటే… ఆమె చెప్పిన అబద్ధమే అతనికి పెద్ద శిక్ష అవుతుంది. అలా 13 సంవత్సరాలు జైలులో మగ్గిపోతాడు హరి. ప్రేమ, ద్రోహం, కోపం… ఈ మూడు మాత్రమే అతని లోపల మిగుల్తాయి. జైలు గోడల మధ్య ఆ కసితోనే రగిలిపోతాడు.

కరోనా సెకండ్ వేవ్ టైమ్‌లో జైలు నుంచి తప్పించుకున్న హరికి దుబాయి పారిపోయి సెటిల్ అవ్వటానికి రూ.60లక్షలకు పైగా డబ్బు అవసరమవుతుంది. దాంతో తనకు అవసరమైన డబ్బు సంపాదించడంతో పాటు మరో పని కూడా చేయాలనుకుంటాడు. అదే సరస్వతిపై ప్రతీకారం తీర్చుకోవటం. ఈ క్రమంలో ఒకప్పటి జూలియట్ కోసం వెతుక్కుంటూ వస్తాడు.

అయితే అప్పటికే ఆమెకు పెళ్లై ఒక కూతురు కూడా ఉంటుంది. కానీ సరస్వతి భర్త చావు బతుకుల్లో ఉంటాడు. హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం కోటి రూపాయల డబ్బు కావాలి. ఆమె అవసరాన్ని అడ్డంపెట్టుకుని తన ప్రతీకారం తీర్చుకునేవిధంగా ఓ హాస్పటిల్ దోపిడికి ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. సరస్వతినే పార్ట్‌నర్‌గా చేసుకుని అదే హాస్పిటల్‌లో పెద్ద మొత్తంలో డబ్బు కొట్టేయాలని స్కెచ్ వేస్తాడు. తను డబ్బుతో ఎస్కేప్ అయి, సరస్వతిని దొంగగా పోలీసులకు పట్టించాలన్నది హరి ప్లాన్.

అయితే ఈ ప్లాన్ వర్కవుట్ అయిందా? అసలు సరస్వతి అప్పుడు ఎందుకు తప్పుడు సాక్ష్యం చెప్పింది? ఆమె మౌనం వెనుక ఉన్న ఆ కన్నీటి గాథ ఏంటి? ఈ క్రైమ్ సీన్‌లోకి ఎంటర్ అయిన పోలీస్ ఆఫీసర్ స్వామి (అనురాగ్ కశ్యప్), ప్రకాష్ రాజ్ పాత్రల వల్ల కథ ఏ మలుపు తిరిగింది? తనని మోసం చేసిందని భావించిన సరస్వతి గురించి తెలిసిన ఆ ఒక్క 'షాకింగ్' నిజం హరిని ఎలాంటి త్యాగానికి ప్రేరేపించింది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే 'డెకాయిట్' అసలు కథ. పగ, ప్రతీకారం అనుకున్న చోట ప్రేమ గెలిచిందా లేదా అనేదే ఈ క్రైమ్ థ్రిల్లర్...ఎమోషనల్ క్లైమాక్స్!

ఎనాలసిస్ ..

ఈ సినిమా ట్రైలర్స్, టీజర్, ప్రమోషన్స్ చూసి ఏదో ఒక కొత్త పాయింట్, పక్కా లాజిక్స్ తో అడవి శేషు వస్తాడని థియేటర్ కు వెళ్తాం. కానీ సినిమా ప్రారంభమైన కాసేపటికే ఆ అంచనాలు కాస్త తలకిందులవ్వటం మొదలవుతాయి. టైటిల్ వింటేనే ఒక భారీ దొంగతనం, పవర్‌ఫుల్ యాక్షన్ సీన్లు ఉంటాయనుకుంటే.. సినిమాలో మాత్రం ఏదో వెలితి కనిపిస్తూంటుంది. చివరకి ఫ్యామిలీ, త్యాగం, ఎమోషన్ అంటూ వెళ్లిపోతుంది. ఇది యాక్షన్ డ్రామానా లేక సెంటిమెంట్ మూవీనా అనే కన్ఫ్యూజన్ క్లైమాక్స్ దాకా వేధిస్తుంది.

ఇంటర్వల్ వరకు వచ్చేవరకూ ప్లాష్ బ్యాక్ లతో కథను,పాత్రలను సెట్ చేసే ప్రయత్నం చేసారు. ఈ క్రమంలో కొంత ఏంటి చాలా రొటీన్ గా ప్లాట్ గా నడుస్తూంటుంది. అయితే ఇంటర్వెల్ దగ్గర జైలు నుంచి హరి ఎస్కేప్, ఇంటర్వల్ వద్ద రాబరీ సీన్స్ ఉన్నాయి. అవే ఫస్టాఫ్ ని సేవ్ చేస్తాయని ఊహించి ఉంటారు. వాస్తవానికి ఇవి రెండు కూడా హై వోల్టేజ్ సీన్స్ అవ్వాలి. కానీ ఎక్జిక్యూషన్ ఫ్లాట్‌గా ఉంది. ఇంట్రెస్ట్ ఉంది, ఇంపాక్ట్ లేదు

ఇది చాలదన్నట్లు సినిమాకు టోన్ కన్ఫ్యూజన్ కనపడుతూంటుంది. మాటి మాటకి ఇది ఏ జానర్ సినిమా?అని డౌట్ వస్తుంది. కాసేపు జైలు డ్రామా, హాలీవుడ్ స్టైల్ యాక్షన్ కాసేపు, తమిళ్ సెంటిమెంట్ కాసేపు, సోషల్ యాంగిల్ కాసేపు, చివరికి రొమాంటిక్ ట్రాజెడీ (ప్రేయసి రావే ని గుర్తు చేస్తూ ) ఇవన్నీ కలపడం సమస్య కాదు. కానీ విడిగా కనపడకుండా కలిసిపోలేక పోవడం పెద్ద ఇష్యూ. అంటే సినిమా ఒక్క దారి పడకుండా… రకరకాల ఐడియాల మధ్య ఊగిసలాడుతుంది. సాధారణంగా కథ కోసం పాత్రలు మారాలి… కానీ ఇక్కడ పాత్రల కోసం కథే అవసరం వచ్చినప్పుడల్లా కన్వీనెంట్ గా వంగిపోతూంటుంది. స్క్రీన్ ప్లే సరిగ్గా సెట్ అయ్యి ఉంటే ఓ కొత్త తరహా సినిమా చూసినట్లు ఉండేది.

టెక్నికల్ గా..

రైటింగ్ తప్ప మిగతా విభాగాలన్ని చాలా బ్రిలియెంట్ గా అనిపిస్తాయి. అబ్బూరి రవి రాసిన రాయలసీమ యాస డైలాగ్స్ చాలా నేచురల్‌గా ఉండి, కథలోని లోకల్ ఫీల్‌ను పక్కాగా క్యారీ చేశాయి. ధనుష్ భాస్కర్ సినిమాటోగ్రఫీ సినిమాకు ఒక రిచ్ అండ్ గ్రాండ్ లుక్ ఇచ్చింది.బీజీఎమ్ సినిమాకు పెద్ద అసెట్. పాటలు మాత్రం సోసోగా ఉన్నాయి. భారీ బడ్జెట్ సినిమాల స్థాయిలో ఉన్న మేకింగ్ వాల్యూస్ విజువల్ ట్రీట్‌ను ఇస్తాయి!

నటీనటుల్లో..

అడివి శేష్ మాస్ ట్రాన్స్‌ఫర్మేషన్, మృణాల్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ఉన్నంతలో సినిమాను నిలబెట్టాయి. అయితే అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, సునీల్ లాంటి పవర్ ఫుల్ యాక్టర్స్ ఉన్నా.. వారి టాలెంట్‌కు తగ్గట్టుగా సరైన స్కోప్ ఇవ్వలేదనిపిస్తుంది.

ఫైనల్ థాట్

ఈ సినిమా ఒక ప్రేమ కథ కావాలి… ఒక రివెంజ్ డ్రామా కావాలి…ఓ ఎమోషనల్ టచ్ ఇవ్వాలి. కానీ చివరికి అన్ని ట్రై చేసి, ఏదీ పూర్తిగా కాలేకపోయింది.

Read More
Next Story