పారిస్ ఒలింపిక్స్ లో  అఫ్గాన్ బ్రేక్ డ్యాన్సర్ సంచలనం
x

పారిస్ ఒలింపిక్స్ లో అఫ్గాన్ బ్రేక్ డ్యాన్సర్ సంచలనం

ఫోటీల్లో ఓడినా ప్రపంచం మద్దతు సంపాదించిన రెఫ్యూజీ అథ్లెట్


పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ ఒక అఫ్గానిస్తాన్ అమ్మాయి అలజడి సృష్టించింది. మనీషా తలాష్ (Manizha Talash) అనే అమ్మాయి బ్రేక్ డాన్స్ కాంపిటీషన్ పాల్గొన డానికి వచ్చి ఉన్్నట్లుండి జాకెట్ తీసేసి తాటికాయంత అక్షరాలతో రాసిన ఫ్రీ అఫ్గాన్ విమెన్ (Free Afghan Women)అనే నినాదం ముద్రించిన జాకెట్ ను ప్రదర్శించింది. వెంటనే స్టేడియం ఈలలతో మారుమ్రోగి పోయింది. తలాష్ అఫ్గానిస్తాన్ నుంచి కాందిశీకురాలు. ఆమె స్పెయిన్ లో ఉంటుంది. ఆదేశంలో తాలిబన్ ప్రభుత్వం రాగానే ఆమె దేశం విడిచిపోయింది. కాందిశీకుల టీమ్ (Refugee Olympic Team) తరఫున ఆమె బ్రేక్ డ్యాన్స్ పోటీల్లో పాల్గొంటున్నది. ప్రీ క్వాలిఫైర్ పోటీలకోసం ఆమె నెదర్లాండ్ కు చెందిన అథ్లెట్ తో పోటీ పడింది. తలాష్ వయసు 21 సంవత్సరాలు. ఆమె కాబూల్ నగరానికి చెందింి. 2021లో ఆమె దేశం విడిచివెళ్ళిపోయింది.

అయితే, నేడు పోటీలో ఆమె ఫ్రీ అఫ్గాన్ విమెన్ అని రాసిఉన్న జాకెట్ ను ప్రదర్శించడానికి అధికారులు అభ్యంతరం చెప్పారు. ఈ నినాదం ఒక రాజకీయ ప్రకటన లాంటిది. ఓలింపిక్స్ లో ఎలాంటి రాజకీయ ప్రకటనలకు తావులేదు. పోటీ ప్రారంభమయిన కొన్ని క్షణాల్లోనే ఆమె స్వెటర్ తీసేసి ఈ నినాదం రాసి ఉన్న జాకెట్ ప్రదర్శించినంది స్టేడియం మొత్తం దృష్టిని ఆకట్టుకుంది. దీనికి వర ల్డ్ డ్యాన్సింగ్ (World DanceSport Federation) వెంటనే రంగంలోకి దిగింది. ఆమెను డిస్ క్వాలిఫై చేసున్నట్లు ప్రకటించింది. ఆమె ధైర్యానికి పారిస్ అర్బన్ పార్క్ లో ఈ పోటీని తిలకిస్తున్నవా ళ్లంతా జేజేలు పలికారు.

ప్రపంచవ్యాపితంగా రాజకీయంగా నిరాశ్రాయులయిన వారికి సంఘీభావం చెప్పేందుకు ఒలింపిక్స్ లో ఒక రిఫ్యూజీ టీమ్ ను అనుమతిస్తున్నారు. మూడేళ్లు ఇది జరుగుతుంది. 12 రకాల స్పోర్ట్స్ వీళ్లు పాల్గొంటున్నారు. ఈ ఏడాది 37 అథ్లెట్స్ పోటీలకు వర్చారు. ఇందులో అఫ్గనిస్తాన్ చెందిన వారు ముగ్గురు మహిళలు, ముగ్గురుపురుషులు ఉన్నారు.

ఈ పోటీల్లో ఆమె ఓడిపోయింది. అయితే, ఆమె నినాదం నెగ్గింది.

Read More
Next Story