వయసు 94 ఏళ్లు.. అయినా తగ్గేదేలే!
x

వయసు 94 ఏళ్లు.. అయినా తగ్గేదేలే!

మళ్ళీ మెగాఫోన్ పట్టిన లెజెండరీ డైరెక్టర్


'వయసు అనేది జస్ట్ నెంబర్ మాత్రమే' అని నిరూపిస్తున్నారు మన టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు (Singeetam Srinivasa Rao). భైరవద్వీపం, ఆదిత్య 369, పుష్పక విమానం వంటి అద్భుతాలు సృష్టించిన ఈ దిగ్గజ దర్శకుడు.. 94 ఏళ్ల వయసులో మళ్ళీ డైరెక్షన్ చేయడానికి రెడీ అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచారు.

అశ్వినీదత్ చేతుల మీదుగా..

దాదాపు 60 సినిమాలకు దర్శకత్వం వహించిన సింగీతం, ఇప్పుడు తన 61వ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్రాజెక్ట్ ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ (Vyjayanthi Movies) నిర్మించబోతుండటం విశేషం. ఇంత వయసులో ఆయనతో సినిమా చేయడం అంటే మామూలు సాహసం కాదు, అందుకే ఇండస్ట్రీ మొత్తం ఈ ప్రాజెక్ట్ వైపే చూస్తోంది.

బాలయ్యతో 'ఆదిత్య 369' సీక్వెలేనా?

గతంలో బాలకృష్ణ (Balakrishna) - సింగీతం కాంబినేషన్ లో 'ఆదిత్య 369' సీక్వెల్ రావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది. మరి ఇప్పుడు వైజయంతీ మూవీస్ లో చేయబోయేది ఆ సీక్వెలేనా? లేక వేరే ఏదైనా కొత్త ప్రయోగమా? అన్నది తెలియాల్సి ఉంది.

త్వరలో బిగ్ అనౌన్స్మెంట్:

పాన్ ఇండియా సినిమాలు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో.. 94 ఏళ్ల లెజెండ్ ఎటువంటి మ్యాజిక్ చేయబోతున్నారో అని సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన భారీ అనౌన్స్మెంట్ రాబోతోంది.

ఈ వయసులో సింగీతం గారి ఎనర్జీ చూస్తే వావ్ అనాల్సిందే కదా! దీనిపై మీ కామెంట్ ఏంటి?

Read More
Next Story