ఆహా కు అదే  ఒటిటి వైరల్ ఇన్ ఫెక్షన్...
x

'ఆహా' కు అదే ఒటిటి వైరల్ ఇన్ ఫెక్షన్...

మెల్లిగా బూతు రూట్ లోకి 'ఆహా' , పోటీ తట్టుకోవాలంటే 'అడల్ట్ కంటెంటే' దారా? ఈ మధ్య ఒటిటిలో మితిమీరుతున్న అడల్ట్ కంటెంట్. ఒక చిన్న సమీక్ష


ముఖ్యంగా ఓటీటీలో వచ్చే కంటెంట్ కి సెన్సార్ లేకపోవడంతో అశ్లీల కంటెంట్ ఎక్కువ అయిపోయింది. ఓటీటీలో బాగా ఆదరణ దక్కించుకున్న వెబ్ సిరీస్ లు చూస్తే ఈ విషయం నిజమే అనిపిస్తుంది.మనకు ఓటిటిలు పాపులరైన టైమ్ లోనే అంటే 2020లోనే 'మస్టరమ్' 'Fబుడ్డీస్' లాంటి వెబ్ సిరీస్ లు బాగా పాపులర్ అయ్యాయి. ఇవి ప్యూర్ అడల్ట్ కంటెంట్ ని బేస్ చేసుకొని తీసిన వెబ్ సిరీసులు. ఇవే కాకుండా ఇప్పుడు ప్రముఖ ఓటీటీల్లో క్రేజ్ తెచ్చుకుంటున్న వెబ్ సిరీస్, ఒరిజినల్ మూవీస్ అన్నీ దాదాపు అడల్ట్ కంటెంట్ తో వచ్చినవే. వీటికి ఆదరణ లభిస్తుండటంతో ఓటీటీలు కూడా వీటి వైపే మొగ్గుచూపుతున్నాయి. దాంతో మెల్లిగా పెద్ద సంస్థలు, కొంతమంది నిర్మాతలు నేరుగా రంగంలోకి దిగి ఓటీటీ కోసం ప్రత్యేకంగా ఇలాంటి ఒరిజినల్ సినిమాలు వెబ్ సిరీస్ లు నిర్మించడానికి ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. పనిలోపనిగా దర్శకులు, రైటర్స్ అలాంటి కంటెంట్ రెడీ చేయటానికి ముందుకొస్తున్నారు.

న 'బూతో' న భవిష్యతి అని రీజనల్ ఓటిటి సంస్దలు మెల్లిగా గ్రహించేశాయి.

ఒకప్పుడు థియేటర్స్ లో కూడా సెన్సార్ బోర్డు వారు ఇచ్చే 'ఏ' సర్టిఫికెట్ తో అడల్ట్ కంటెంట్ సినిమాలు ప్రదర్శించబడేవి. కాకపోతే ఇప్పుడు ఓటీటీ కంటెంట్ కి ఎలాంటి షరతులు లేకపోవడంతో హద్దులు లేకుండా లాగించేస్తున్నారు. యూత్ ఎక్కువగా ఇలాంటి వాటినే ఇష్టపడుతున్నారు. అందులో వింతకూడా ఏమీ లేదు. అయితే ఇంతకాలం ఇలాంటివి అంతర్జాతీయ ఓటిటి సంస్దలు అమేజాన్, నెట్ ప్లిక్స్ లకే పరిమితం అయ్యాయి. కానీ ఇప్పుడు తెలుగులోనూ ఈ స్టైల్ మొదలైంది. డీసెంట్ ప్రేక్షకులకు వెన్ సిరీస్ లు, వెన్ ఫిల్మ్ ల పైనే ఏవగింపు కలిగేలా చేసే పరిస్దితి మొదలైంది. ఎక్కువుగా బెంగాలీ, హిందీ సినిమాల్లో కనిపించే బూతు.. ఇప్పుడు తెలుగు డిజిటల్ కంటెంట్ లో కూడా విచ్చలవిడిగా రావటం మొదలైంది..ఎవర్ని అని ఇక్కడ ఫలితం లేదు ? ఏదన్నా అంటే ఇది యాపారం అని చెప్పే పరిస్దితి.

ఇది ఏ స్దితికి చేరిదంటే మితిమీరిన శృంగార సన్నివేశాలు లేకపోతే జనాలు చూడరు..ప్రక్కన పెట్టేస్తారు అనే ఆలోచనలు వచ్చే స్దాయికి. హిందీలో ఏక్తా కపూర్( Ekta Kapoor ) తీసేవన్ని అలాగే ఉంటున్నాయి ఆమె సొంత ఓటీపీ అయినా ఆల్ట్ బాలాజీ ఓపెన్ చేస్తే చాలు బూతు కంటెంట్ భయంకరంగా దర్శనం ఇస్తుంది. అలాగే ఆ మధ్యన వచ్చిన రానా నాయుడు వెబ్ సిరీస్ చూస్తే.. ఫ్యామిలీ ఆడియన్స్ షాక్ అయ్యారు. రానా, వెంకటేష్ కలిసి చేసిన ఈ సిరీస్ లో లెక్కలేనన్ని బూతులు ఉన్నాయి. ఫ్యామిలీ హీరో వెంకటేష్ ఇంత దారుణమైన బూతు పదాలను ఎలా ఎంకరేజ్ చేశాడో అర్థం కాలేదు చాలా మందికి. అయితే ఈ సీరిస్ బాగా హిట్టై సీక్వెల్ సైతం తీస్తున్నారు. ఇక్కడ ఏకైక అదృష్టం ఏమిటంటే మిగతా సీనియర్ తెలుగు హీరోలు ఈ రానా నాయుడు లాంటింది చేయాలని ప్రేరణ కలగకపోవటం.

అంతెందుకు ఇంతకాలం ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఉన్నట్లున్న ఆహా సైతం ఈ రూట్ లోకి వచ్చేస్తోంది. తాజగా ఓ హాట్ మూవీ ని త్వ‌ర‌లో తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తోంది ఆహా. మిక్స‌ప్ టైటిల్ తో తెర‌కెక్కుతోన్న ఈ మూవీ టీజ‌ర్‌ను ఆహా ఓటీటీ రిలీజ్ చేసింది. దీన్ని చూస్తే టాలీవుడ్ లస్ట్ స్టోరీ(నెట్ ప్లిక్స్ లో వచ్చిన) అనిపిస్తోంది.
ఈ టీజర్ లో ఇద్దరు కపుల్స్ . వారిలో ఒకరికి శృంగారం అంటే బాగా ఇంట్రస్ట్ . కానీ, రెండో వారు మాత్రం ప్రేమనే ఎక్కువ కోరుకుంటారు. ఇలా రెండు జంటల్లో ఒక భార్య, ఒక భర్త ఒకే రకమైన శృంగార ఆసక్తి కలిగిన వాళ్లు ఒక్కటైతే? ఇదే కథ నాకు మూడ్ రావాలంటే ఎక్సైట్‌మెంట్ కావాలి. ఎంట‌ర్‌టైన్‌మెంట్ కావాలి అనే డైలాగ్‌ లు. ఈ మిక్స‌ప్‌ టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అదే సమయంలో హాట్ టాపిక్ గానూ మారింది. మార్చి 15న ఈ సినిమాని ఆహాలో రిలీజ్ చేయనున్నారు. ఏదైమైనా రాబోయే రోజుల్లో తెలుగులో ఇంతకుమించి బూతు కంటెంట్ ప్రసారం చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.


Read More
Next Story