మోహన్ లాల్ హెల్త్ కండిషన్ పై హెల్త్ బులిటెన్
x

మోహన్ లాల్ హెల్త్ కండిషన్ పై హెల్త్ బులిటెన్

ప్రముఖ నటుడు మోహన్‌లాల్ తీవ్ర అస్వస్థతకి గురయ్యారు.


ప్రముఖ నటుడు మోహన్‌లాల్ తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్టు ఆసుపత్రి వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన కేరళ కొచ్చిలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. వైద్య నివేదికల ప్రకారం, మోహన్‌ లాల్‌ కు వైరల్ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.

ఆరోగ్యం మెరుగుపడి పూర్తిగా కోలుకోవడానికి వైద్యులు ఆయన్ని ఐదు రోజులు విశ్రాంతి తీసుకోవాలని, ఈ సమయంలో బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఆయన త్వరగా కోలుకునేందుకు తగిన మెడిసిన్స్ ఇస్తున్నట్టు వైద్యులు తెలిపారు. మోహన్ లాల్ అనారోగ్యంపై ఆసుపత్రి అధికారిక ప్రకటన, ఆయన ప్రస్తుత కండిషన్, సిఫార్సు చేసిన జాగ్రత్తల గురించి సినీ క్రిటిక్ శ్రీధర్ పిళ్లై ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

కాగా, మోహన్‌లాల్ ఆసుపత్రి పాలయ్యారనే వార్త ఆయన అభిమానులను, సినీ వర్గాలను ఆందోళనకు గురి చేసింది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, శ్రేయోభిలాషులు ఆశిస్తున్నారు. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో వెర్సటైల్ యాక్టర్ గా పేరుగాంచిన మోహన్‌ లాల్‌ కు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. వీరంతా తమ హీరో అనారోగ్యం పాలయ్యారని తెలియగానే కలవర చెందుతున్నారు.

కాగా మోహన్ లాల్ ప్రస్తుతం ఎంపురాన్ అనే సినిమాకి దర్శకత్వం వహిస్తూ, అదే సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత జ్వరం వచ్చినట్లు కుటుంసభ్యులు వెల్లడించారు. కాగా మోహన్ లాల్ తెలుగులోనూ పలు సినిమాల్లో మంచి పాత్రల్లో నటించారు. జనతా గ్యారేజ్ సినిమా ఆయనకి మంచి గుర్తింపు తెచ్చింది. ఆయన నటనకి గాను నాలుగు సార్లు జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. 2001లో ఆయన్ని పద్మశ్రీ పురస్కారం వరించింది.

Read More
Next Story