
‘అఖండ 2’ రిలీజ్ డేట్ ఈ రెండు తేదీల్లో ఒకటి ఫిక్స్?
ఇవాళ,రేపట్లో ఫైనల్ డిసిషన్!?
టాలీవుడ్‌లో ఈరోజు మాట్లాడుతున్న ఒక్క మాట — “అఖండ 2 ఎప్పుడు వస్తుంది?” సినిమా వాయిదా పడిన నాటి నుంచి, సోషల్ మీడియా నుంచి సింగిల్ స్క్రీన్స్ దాకా, అభిమానుల నుంచి డిస్ట్రిబ్యూటర్ల దాకా… అందరి నంబర్ వన్ టెన్షన్ ఇదొక్కటే.
ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే — బిజినెస్, ఫైనాన్షియల్స్, మార్కెట్, కోర్ట్… అన్నీ క్లియర్ కానప్పటికీ, హైప్ మాత్రం కొద్దిగా కూడా తగ్గలేదు. బాలయ్య సినిమా విడుదల కాకముందే బాక్సాఫీస్ పై తాండవం చేస్తున్నట్టుంది. ఇప్పుడు, టీమ్ చేతుల్లో రెండు తేదీలు మాత్రమే మిగిలాయి: రెండు తేదీలూ బ్లాక్‌బస్టర్ పటిష్ట శక్తి కలిగినవే. కానీ… ఏది ఫిక్స్ అవుతుంది? ఏ రోజు నిర్ణయమవుతుందనే పెద్ద ఉత్కంఠ!
టీమ్ డిస్ట్రిబ్యూటర్లతో కలిసి రెండు తేదీల గురించి సీరియస్‌గా చర్చిస్తోందిది: ఆ తేదీలు
డిసెంబర్ 12
డిసెంబర్ 25
సోర్సెస్ ప్రకారం, మెజారిటీ 25 డిసెంబర్ వైపు మొగ్గు చూపినట్టు సమాచారం.
25 డిసెంబర్ ఎందుకు బలమైన ఆప్షన్?
డిస్ట్రిబ్యూటర్లు సూచించిన ప్లాన్ ఏంటంటే – 25 డిసెంబర్ రిలీజ్, 24 రాత్రి ప్రీమియర్స్ అన్ని ఏరియాల్లో వేస్తారు. క్రిస్మస్ గురువారం కావడంతో, బుధవారం ప్రీమియర్స్ , గురువారం సెలవు, శుక్రవారం, శని, ఆదివారం కలిసి వస్తాయి. 4 రోజుల పొడిగించిన హాలిడే వీకెండ్ బాక్సాఫీస్‌కు భారీగా పనిచేస్తుంది.
అందులోనే మరో ప్లస్:
రెండో వారం జనవరి 1 వస్తుంది. అంటే న్యూ ఇయర్ హాలిడే కూడా అదనంగా వెన్నుదన్నుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ తేదీ తీసుకుంటే, ప్రొడ్యూసర్లకు ఆర్థిక క్లియర్‌న్స్ చేయడానికి టైమ్ దొరుకుతుంది.
నెట్‌ఫ్లిక్స్ క్రిస్మస్ సజెషన్ – ఇప్పుడు నిర్ణయం 48 గంటల్లో!
Netflix కూడా అదే ఆప్షన్ ఇచ్చింది — “క్రిస్మస్ రిలీజ్ బెస్ట్!” అని సూచించింది.
కానీ ఒక పెద్ద టెన్షన్… మూమెంట్!
ఇక్కడే కథలో ట్విస్ట్ ఉంది. వాయిదా వల్ల ఇప్పుడు సినిమాకు మూమెంట్, చర్చలు, హైప్ బాగా ఉంది. కాబట్టి 12 డిసెంబర్ రిలీజ్ అయితే, ఈ హైప్ బాక్సాఫీస్‌లో నేరుగా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది.
కానీ 25 డిసెంబర్ అయితే, మరో 2 వారాల గ్యాప్. మొమెంటం కంటిన్యూ అవుతుందా అన్న టెన్షన్.
అందుకే
ఫ్యాన్స్ క్లియర్‌గా 12 డిసెంబర్ రిలీజ్ డేట్ డిమాండ్ చేస్తున్నారు.
అయితే ట్రేడ్ ఏమంటోంది?
25 డిసెంబర్ ఛాన్సెస్ ఎక్కువ.
అయినా… రేపటి వరకూ అన్ని ఇష్యూలు క్లియర్ అయితే, 12 డిసెంబర్ కూడా పాసిబుల్!. అంటే రెండు తేదీలూ టేబుల్‌పై ఉన్నాయి.
EROS ఇష్యూ – ఎంత దాకా వచ్చింది?!
పాత బాకీల విషయంలో EROS International మాత్రం స్ట్రాంగ్ గా తన స్టాండ్ పైనే ఉంది. ఎలాంటి కంప్రమైజ్ లేదు అన్నట్టే వ్యవహరిస్తోంది.
కోర్టు విచారణలో ఏ నిర్ణయం వస్తుందో — అదే ‘అఖండ 2’ భవితవ్యం.
ప్రొడ్యూసర్లు డ్యూస్ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్సియర్స్ కూడా స్పష్టంగా సూచించారు: “ముందు EROS ఇష్యూ క్లియర్ చేయండి… తర్వాతే రిలీజ్ డేట్ నిర్ణయించండి.” కాబట్టి EROS సమస్య ముగిసిన వెంటనే పెద్ద ఆటంకాలు ఉండవని మేకర్స్ చెబుతున్నారు.
మధ్యలో ప్రచారం అయ్యింది — “డిస్ట్రిబ్యూటర్లు కలసి రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు” అని. కానీ ఇది నిజం కాదు.
దిల్ రాజు తనే డిస్ట్రిబ్యూటర్లతో సమన్వయం చేస్తున్నారు. బాలయ్య – బోయపాటి ఇద్దరూ ముందుకొచ్చి తమ రెమ్యునరేషన్ తగ్గించి, ప్రొడ్యూసర్లకి సపోర్ట్ ఇవ్వడానికి అంగీకరించారు. ఇది ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది.
ఇప్పటికే సోషల్ మీడియాలో డిసెంబర్ 12 అనే రిలీజ్ డేట్ వైరల్ అవుతోంది. కానీ మేకర్స్ క్లియర్: “సమస్యలు పరిష్కారం అయ్యాకే డేట్ ఫిక్స్ చేస్తాం.”
అయితే ‘అఖండ 2’ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అనే ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. కానీ ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు… మీడియా ఊహాగానాలు మరో లెవెల్‌కి చేరాయి. కానీ అసలు విషయం ఏమిటంటే — ఇప్పుడు సినిమా రిలీజ్ పూర్తిగా కోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంది.
ప్రస్తుతం ఫోకస్ ఒక్కటే:
EROS లీగల్ క్లియరన్స్. అన్ని విషయాలు రేపు–ఎల్లుండి స్పష్టమవుతాయని ఇండస్ట్రీలో మాట.
ఫ్యాన్స్ ఒక్క మాటే చెబుతున్నారు: కొంచెం ఆలస్యం జరిగినా… అఖండ తాండవం మాత్రం తప్పదు!

