ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు, అక్షయ్ కుమార్ ఫ్లాఫ్ లకు ఓటీటీ లే కారణమా?
x

ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు, అక్షయ్ కుమార్ ఫ్లాఫ్ లకు ఓటీటీ లే కారణమా?

రీసెంట్ గా తన సినిమాలు వరస పెట్టి ఫెయిల్యూర్ అవటంపై అక్షయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.


తాను సరిగా పాట పాడలేక, మద్దెలను బాగా వాయించలేదని నిందించాడట ఓ ఘనుడు. తన అసమర్ధతకు ఇతరులను నిందించే వాణ్ణి ఉద్దేశించి ఈ సామెతను వాడుతూటాం. మద్దెల దరువుకు తగినట్టు నాట్యం చేయాలి. కానీ ఆడే వాడు మద్దెల దరువుకు తగినట్టు ఆడడంలేదు. ఏమయ్యింది అలా ఆడు తున్నావంటే అతడు "నేను బాగానె ఆడుతున్నాను, నీ మద్దెలే ఓడు బోయి. సరిగా పలకడం లేదు" అన్నాడు. అనగా తన తప్పును కప్పి పుచ్చుకునేందుకు ఇతరులపై నెపం మోపేవారిని గురించి ఈ సామెత పుట్టింది. "ఆడ లేక మద్దెల ఓడన్నట్టు" ఇప్పుడు అక్షయ్ కుమార్ తన ఫెయిల్యూర్స్ కారణం చెప్తూంటే ఖచ్చితంగా ఈ సామెత గుర్తు వస్తుంది.

రీసెంట్ గా తన సినిమాలు వరస పెట్టి ఫెయిల్యూర్ అవటంపై అక్షయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. బాక్సాఫీస్‌ సక్సెస్‌ రేటు తగ్గడంపై బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ (Akshay Kumar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటీటీ వల్లే సినిమాలు థియేటర్లలో ఆడటం లేదని ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.దాంతో సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అవుతోంది.

అక్షయ్ కుమార్ మాట్లాడుతూ... ‘‘ఈ మధ్యకాలంలో నేను చాలామందితో సినిమాల గురించి మాట్లాడాను. ఏదైనా సరే తాము ఓటీటీలో చూస్తామని వారు అన్నారు. బాక్సాఫీస్‌ వద్ద సినిమాలు సరిగ్గా ఆడకపోవడానికి ప్రధాన కారణం అదే. కొవిడ్‌ సమయంలో ప్రజలందరూ ఓటీటీ వేదికగా ఇంట్లో కూర్చొని సినిమాలు చూశారు. ఆ తర్వాత పరిస్థితులు ఎంతో మారినప్పటికీ వారు మాత్రం ఓటీటీకే మొగ్గు చూపిస్తున్నారు. అది వాళ్లకు ఒక అలవాటుగా మారింది’’ అని అక్షయ్‌ అన్నారు.

గత కొంతకాలంగా బాలీవుడ్ టాప్ హీరో అక్షయ్ కుమార్ కు టైం అస్సలు కలిసి రావడం లేదనే చెప్పాలి. వరుస ఫ్లాఫ్ లతో బాధపడుతున్న ఆయనకు కొత్త సినిమా వస్తోందంటేనే కంగారు పుట్టే పరిస్దితి ఎదురౌతోంది. ఎంతో ఎక్సపెక్ట్ చేసి చేసిన రీమేక్ లుసైతం బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో రాణించడం లేదు. ఆ మధ్య రిలీజైన సెల్ఫీ చిత్రం ఓపెనింగ్ కలెక్షన్స్ రూ. 3 కోట్ల కంటే తక్కువగా వచ్చాయి. ఈ నేపథ్యంలో అక్షయ్ కుమార్ తీవ్ర నిరాశలో మునిగిపోయారు. తనను తాను మార్చుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. ఇలాంటి పరాజయాలు తనకు కొత్త కాదని చెప్పిన ఆయన, బాక్సాఫీస్ దగ్గర తన సినిమాల పరాజయానికి తప్పకుండా తానే బాధ్యత వహిస్తానని చెప్పారు. ఈ లోగా మరిన్ని ఫ్లాఫ్ లు వచ్చేసాయి.

కరోనా లాక్ డౌన్ తర్వాత అక్షయ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ అందుకోవడం లేదు. కరోనా తర్వాత విడుదలైన అక్షయ్ తొలి సినిమా ‘బెల్ బాటమ్’. ఆ తర్వాత వచ్చిన ‘సూర్యవంశీ’ ఫర్వాలేదు అనిపించాయి. 2022 నుంచి థియేటర్లలో విడుదలైన అతడి చిత్రాలన్నీ పరాజయాన్ని చవి చూశాయి. గతేడాది విడుదల అయిన ‘రక్షా బంధన్’, ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ కూడా పెద్దగా సక్సెస్ అందుకోలేదు. రీమేక్ చిత్రం ‘సెల్ఫీ’ సైతం అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

2020 నుంచి 2024 వరకు నాలుగేళ్ల సమయంలో అక్షయ్ కుమార్ చేసిన 16 సినిమాలు ఫ్లాప్ కావడమే కాక నిర్మాతలకు రూ.వందల కోట్లలో నష్టాలను మిగిల్చాయి. అవి బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్వీరాజ్, రక్షా బంధన్, రామ్ సేతు, సెల్ఫీ, టస్హాన్, కంబఖ్త్ ఇష్క్, జోకర్, లక్ష్మీ, కట్‌పట్లీ, బాస్, చాందినీ చౌక్ టు చైనా, బ్లూ, బ్రదర్స్, 8 x 10 తస్వీర్, ది షౌకీన్స్. అయినప్పటికీ నిర్మాతలు అక్షయ్‌తో సినిమాలు నిర్మించేందుకు క్యూకడుతున్నారు. ప్రస్తుతం అక్షయ్ హీరోగా నటిస్తున్న 10 సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి.

అప్పటికీ కంటెంట్‌ ఎంపిక విషయంలో తాను ఎంతో జాగ్రత్తగా ఉంటున్నానని అక్షయ్‌ చెప్పారు. ‘‘కొవిడ్‌ వల్ల చిత్రపరిశ్రమలో ఎన్నో మార్పులు వచ్చాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఏ చిత్రాలు చూడాలనే విషయంలో ప్రేక్షకులు చాలా క్లియర్‌గా ఉంటున్నారు. పూర్తిగా వినోదాత్మక, విభిన్నమైన ప్రాజెక్ట్‌లను ఎంచుకోవడం చాలా కీలకం. నేను కూడా ఆ విషయంలో మరింత శ్రద్ధ వహిస్తున్నాను. ప్రస్తుత కాలానికి అనుగుణంగా.. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సినిమాలను మాత్రమే ఎంచుకుంటున్నా’’ అని తెలిపారు.

అయితే పుష్ప2 లాంటి సినిమాలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. రీసెంట్ గా తెలుగులో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక్కడా ఓటిటి మార్కెట్ ఉంది. పుష్ప2 ఆడిన నార్త్ లోనూ ఓటిటి గట్టిగానే చూస్తారు. అలాంటప్పుడు ఓటిటి మార్కెట్ ...హీరోల హిట్, ఫ్లాఫ్ లకు కారణం అని చెప్పటం వల్ల నవ్వులు పాలవటం తప్పించి కలిసొచ్చేది లేదు. కంటెంట్ ఉన్న సినిమా , ఖచ్చితంగా థియేటర్ కు వెళ్లి చూడాలనిపించే సినిమానే ఇప్పుడు భాక్సాఫీస్ దగ్గర గెలుస్తోందనే విషయం అక్షయ్ వంటి హీరోలు మర్చిపోకూడదు. మారుతున్న కాలానికి సరపడ స్క్రిప్టులు ఎంచుకోపోతే ఇలాంటి ఫ్లాఫ్ లే పలకరిస్తాయి.

ఇక అక్షయ్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘స్కై ఫోర్స్‌’. సారా అలీఖాన్, వీర్‌ పహారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సందీప్‌ కేవ్లానీ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. జియో స్టూడియోస్‌, మడాక్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జనవరి 24న ఇది విడుదల కానుంది. ఇటీవల రిలీజైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. మరోవైపు, అక్షయ్‌కుమార్‌ ప్రస్తుతం ‘కన్నప్ప’, ‘స్త్రీ 3’ ప్రాజెక్ట్‌ల కోసం కూడా వర్క్‌ చేస్తున్నారు.

Read More
Next Story